ప్రియమైన తల్లిదండ్రులారా! TikTok గురించి మరియు యాప్‌లో, సంఘంలో మీ యుక్త వయస్సు పిల్లలకు మీరు చేయగల సహాయం గురించి అర్థం చేసుకోవడంలో సహాయపడగల సమాచారాన్ని మరియు వనరులను మీరు ఈ పేజీలో కనుగొనవచ్చు.
సాధారణంగా, మీ యుక్త వయస్సు ఉన్న పిల్లల మొత్తం ఆన్‌లైన్ అనుభవంలో మీరు క్రియాశీల పాత్రను కలిగి ఉండాలని మేము ప్రోత్సహిస్తాము. ముందుగా, ఇంటర్నెట్ భద్రత, ఆన్‌లైన్ గోప్యత, వారికి అందుబాటులో ఉన్న ఎంపికల గురించి మాట్లాడుతూ వారితో సంభాషణను ప్రారంభించండి. మీ మార్గదర్శకం అమూల్యమైనది!
TikTok అంటే ఏమిటి?
TikTok అన్నది ప్రపంచవ్యాప్తంగా చిన్న మొబైల్ వీడియోలలో అగ్రగామిగా ఉంది. ప్రపంచంలోని ప్రతిఒకరి సృజన, జ్ఞానం, సంఘటనలను సేకరించి, ప్రదర్శించడమే మా లక్ష్యం. ప్రతిఒక్కరూ తమ స్మార్ట్‌ఫోన్‌ల నుండే నేరుగా సృష్టికర్తగా మారడంలో TikTok వారికి సహాయపడుతుంది మరియు తమ వీడియోల ద్వారా తమ ఇష్టాన్ని, సృజనాత్మక వ్యక్తీకరణను ఇతరులకు తెలియజేయగల సంఘాన్ని రూపొందించడానికి మేము నిబద్ధతను కలిగి ఉన్నాము.
TikTok ఎవరి కోసం రూపొందించబడింది?
TikTok అన్నది 13 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువగా వయస్సు ఉన్న వారి కోసం రూపొందించబడుతుంది. 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు యాప్‌ని అందించవద్దు.
13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మీ పిల్లలు TikTok ఖాతా కోసం నమోదు చేసుకున్నట్లు మీరు గమనిస్తే, మీరు https://www.tiktok.com/legal/report/privacy ద్వారా మాకు హెచ్చరించవచ్చు. మేము తక్షణం సముచిత చర్యను తీసుకుంటాము.
సముచిత వినియోగం గురించి మరింత తెలుసుకోవడం కోసం, దయచేసి మా సేవా నిబంధనలు మరియు సంఘం మార్గదర్శకాలను చూడండి.
యుక్త వయస్సులో ఉన్న నా పిల్లలు TikTokని డౌన్‌లోడ్ చేయకుండా నేను నివారించవచ్చా?
మీ యుక్త వయస్సు ఉన్న పిల్లలు డౌన్‌లోడ్ చేయగల యాప్‌లతో పాటు వారి ఇంటర్నెట్ వినియోగాన్ని మీరు పర్యవేక్షించాలని మేము ప్రోత్సహిస్తాము. iOS మరియు Android రెండింటిలోనూ తల్లిదండ్రుల నియంత్రణలు ఉంటాయి, వీటి ద్వారా మీరు పరికర స్థాయిలో నిర్దిష్ట యాప్‌లు, ఫీచర్‌లు, చలన చిత్రాలు, సంగీతం మరియు మరిన్నింటిని నిరోధించవచ్చు లేదా పరిమితం చేయవచ్చు."
TikTok అన్నది 13 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారి కోసం రూపొందించబడింది, కనుక మేము దీనిని ఖచ్చితమైన 12+ యాప్ స్టోర్ రేటింగ్ ఇచ్చాము. తద్వారా మీ మైనపర్ పిల్లల ఫోన్‌లో యాప్‌ని నిరోధించడం కోసం మీరు పరికర ఆధారిత తల్లిదండ్రుల నియంత్రణలను ఉపయోగించవచ్చు.
తల్లిదండ్రుల నియంత్రణలు (లేదా 'పరిమితులు') గురించి, వాటిని ప్రారంభించడం గురించి మరింత తెలుసుకోవడం కోసం Apple App స్టోర్ లేదా Google Play స్టోర్ సూచనలను చూడండి.
తమ వీడియోలను చూడగల వ్యక్తులు మరియు తమకు సందేశాలు పంపగల వ్యక్తులను నా యుక్త వయస్సు ఉన్న పిల్లలు ఎలా నియంత్రించవచ్చు?
వినియోగదారులు తమ ఖాతాను ప్రైవేట్‌గా మార్చడం ద్వారా తాము అప్‌లోడ్ చేసిన కంటెంట్‌ని ఎవరు చూడవచ్చు, తమను ఎవరు అనుసరించవచ్చు మరియు తమకు ఎవరు సందేశాలు పంపవచ్చు అన్నవి వారు నిర్ణయించగలరు. ప్రైవేట్ ఖాతా ఉంటే, అనుచురలను వినియోగాదురులు ఆమోదించగలరు లేదా తిరస్కరించగలరు మరియు తాము అప్‌లోడ్ చేసిన కంటెంట్‌ని చూడగల మరియు తమకు సందేశాలు పంపగల అవకాశాన్ని అనుచరులకు మాత్రమే అందించగలరు.
ఒక వినియోగదారు వద్ద పబ్లిక్ ప్రొఫైల్ ఉంటే, TikTokకి సైన్ ఇన్ చేసిన ఎవరైనా ఆ వినియోగదారు యొక్క పబ్లిక్ వీడియోలను చూడగలరు. అయితే, ఆమోదం పొందిన వినియోగదారులు మాత్రమే వారికి సందేశం పంపగలరు.
వినియోగదారులు పబ్లిక్ ఖాతా ఎంచుకున్నా లేదా ప్రైవేట్ ఖాతా ఎంచుకున్నా, వారు ఎప్పుడైనా ఇలా చేయవచ్చు:
- ఏ సమయంలో అయినా తమను సంప్రదించకుండా మరొకరిని నిరోధించవచ్చు
- వీడియోని ప్రైవేట్‌గా సేవ్ చేసుకుని, ఆ కంటెంట్‌ని ఇతర వినియోగదారులు చూడకుండా చేయవచ్చు
- వ్యాఖ్యలు, డ్యూయెట్‌లు లేదా సందేశాలలో పరిమితులను ప్రారంభించవచ్చు
తమ TikTok అనుభవాన్ని నియంత్రించడంలో మీ యుక్త వయస్సు ఉన్న పిల్లలకు సహాయపడగల మరిన్ని సెట్టింగ్‌ల కోసం, మా సాధనాల పేజీలోకి వెళ్లండి.
దయచేసి గుర్తుంచుకోండి: ఖాతా ప్రైవేట్‌గా ఉన్నా కూడా, ప్రొఫైల్ ఫోటో, వినియోగదారు పేరు మరియు బయోగ్రఫీ వంటి ప్రొఫైల్ సమాచారాన్ని వినియోగదారులందరూ గమనించవచ్చు. తమ ప్రొఫైల్‌లో వయస్సు, చిరునామా లేదా ఫోన్ నంబర్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని పేర్కొనవద్దని మీ యుక్త వయస్సు ఉన్న పిల్లలకు సూచించండి.
అనుచిత కంటెంట్ లేదా ప్రవర్తన గురించి మా యుక్త వయస్సు ఉన్న పిల్లలు ఎలా నివేదించవచ్చు?
మా సేవా నిబంధనలను ఉల్లంఘిస్తున్న దేనినైనా మీరు లేదా మీ యుక్త వయస్సు ఉన్న పిల్లలు గమనిస్తే, దాని గురించి మాకు నివేదించండి, తద్వారా మా మోడరేషన్ బృందం దానిని సమీక్షించి, సముచిత చర్య తీసుకుంటుంది. యాప్ లోపలే ఉన్న నిర్దిష్ట వీడియో, వినియోగదారు లేదా వ్యాఖ్య గురించి వినియోగదారు నివేదించవచ్చు.
ఇంకా, తమ కంటెంట్‌ని చూడకుండా లేదా తమకు సందేశాలు పంపకుండా యుక్త వయస్సు ఉన్న పిల్లలు మరో వినియోగదారులను నిరోధించవచ్చు.