చట్టపరం

సేవా షరతులు

చివరగా నవీకరించబడింది: ఫిబ్రవరి 2020


సాధారణ షరతులు – భారతదేశంలో నివశించే వారందరికీ

1. మాతో మీ సంబంధం

టిక్‌టాక్ (“ప్లాట్‌ఫాం”)కు స్వాగతం, బైట్‌డ్యాన్స్ (ఇండియా) టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్  దీనిని సమర్పిస్తున్నారు. టిక్‌టాక్ అనేది సేవలను అందించేందుకు, ప్రచారం చేసేందుకు మా బ్రాండు. భారతదేశం నుండి ఈ సేవలను వినియోగించుకునేటప్పుడు, దయచేసి తదనుగుణంగా “టిక్‌టాక్‌”ను “మేము” లేదా “మాకు”ను చదవండి.

ఈ సేవా షరతులు (“షరతులు”)ను మీరు చదువుతున్నారు, ఇది సమాచార సాంకేతికత చట్టం 2000 యొక్క నిబంధనల క్రింద దాని షరతులతో బాటుగా నడిచే ఒక ఎలక్ట్రానిక్ ఒప్పందం, తద్వారా సంబంధాన్ని ముందుకు నడిపించి, మీకు, మాకు మధ్య ఒక ఒప్పందంగా పని చేస్తూ, నియమ నిబంధనలను ఏర్పరుస్తుంది. వీటి ద్వారా మీరు ప్లాట్‌ఫాంను, మాకు సంబంధించిన వెబ్‌సైట్లు, సేవలు, అప్లికేషన్లు, ఉత్పత్తులు, కంటెంట్ (మూకుమ్మడిగా, “సేవలు”)ను యాక్సెస్ చేసి, ఉపయోగించవచ్చు. ప్రైవేట్, వాణిజ్యేతర వినియోగం కొరకు మా సేవలు అందించబడతాయి. ఈ షరతుల ప్రయోజనార్ధం, “మీరు”, “మీ యొక్క” అంటే సేవలను వినియోగించుకునే వ్యక్తిగా మీరు అని అర్ధం.

మీకు, మాకు మధ్య చట్టపరమైన ఒప్పందాన్ని షరతులు ఏర్పరుస్తాయి, కాబట్టి, వాటిని జాగ్రత్తగా చదివేందుకు దయచేసి సమయాన్ని కేటాయించండి. మా సేవలను వినియోగించుకోవడం ద్వారా, మీరు వీటిని అంగీకరిస్తున్నారు:

 1. ఒక బైండింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు చట్టపరంగా సమర్ధులు;
 2. మీరు జాతి అపరాధ దోషి కాదు;
 3. మా నియమ నిబంధనలను లేదా పాలసీలను లేదా ప్రమాణాలను ఉల్లంఘించిన కారణంగా మీ ఖాతా ఇంతకుమునుపు డిజేబుల్ చేయబడింది; మరియు
 4. జాతీయ మరియు అంతర్జాతీయ చట్టాలు మరియు నిబంధనలను అన్నింటికీ మరియు ఈ షరతులకు మీరు అనుగుణంగా నడుచుకుంటారు.

2. షరతులను అంగీకరించడం

మా సేవలను యాక్సెస్ చేయడం లేదా వినియోగించడం ద్వారా, టిక్‌టాక్‌తో ఒక అనివార్య ఒప్పందాన్ని మీరు ఏర్పరచగలరని, ఈ షరతులను మీరు అంగీకరిస్తున్నారని, వాటికి అనుగుణంగా నడుచుకునేందుకు మీరు అంగీకరిస్తున్నారని మీరు నిర్ధారిస్తున్నారు. మా గోప్యతా విధానం మరియు సంఘ మార్గదర్శకాలు కూడా మా సేవలకు మీ ప్రవేశ సౌలభ్యత మరియు వాటి వినియోగం లోబడి ఉంటుంది. ప్లాట్‌ఫాం మీద, లేదా ప్లాట్‌ఫాంను డౌన్‌లోడ్ చేసుకునే సౌలభ్యం గల చోట లేదా మీ మొబైల్ పరికరానికి వర్తించే యాప్‌ స్టోర్‌లో వీటి షరతులను సరాసరి చూడవచ్చు, మరియు అవి రెఫరెన్స్ ద్వారా ఇందుమూలంగా అమలుచేయబడ్డాయి. సేవలను వినియోగించడం ద్వారా, మీరు పాలసీ షరతులకు అంగీకరిస్తున్నారు.

వేరే అనుబంధిత నియమాలు కలిగిన న్యాయపరిధి నుండి గనక మీర సేవలను యాక్సెస్ చేసినా లేదా వినియోగించినా, దిగువన బయల్పరచినట్లుగా ప్రతి న్యాయపరిధిలోని వినియోగదారులకు వర్తించే అనుబంధిత నియమాలకు కూడా మీరు ఇందుమూలంగా అంగీకరిస్తున్నారు. మీరు సేవలను యాక్సస్ చేసే లేదా వినియోగించే మీ న్యాయపరిధికి సంబంధించిన న్యాయపరిధి నిర్దిష్ట అనుబంధిత నియమాల నిబంధనలు మరియు ఈ మిగిలిన నియమాల మధ్య విబేదం ఏర్పడితే, సంబంధిత న్యాయపరిధిలోని న్యాయపరిధి నిర్దిష్ట అనుబంధిత నియమాలు వర్తించి, నియంత్రిస్తాయి. ఈ నియమాలకు మీరు అంగీకరించనట్లైతే, మా సేవలను మీరు యాక్సెస్ చేయరాదు లేదా వినియోగించరాదు.

ఒక వ్యాపారం లేదా ఎంటిటీ తరఫున మా సేవలను మీరు యాక్సెస్ చేస్తున్నా లేదా వినియోగిస్తున్నా, (ఎ) “మీరు” మరియు “మీ యొక్క” అంటే మీరు మరియు ఆయా వ్యాపారం లేదా ఎంటిటీ అని అర్ధం, (బి) ఎంటిటీని అధికారికంగా ఈ షరతులకు కట్టుబడి ఉంచేందుకు మీరు ఆయా వ్యాపారం లేదా ఎంటిటీ యొక్క అధీకృత ప్రతినిధి అని, సదరు ఎంటిటీ తరఫున ఈ షరతులను మీరు అంగీకరిస్తున్నారు, మరియు (సి) మీ యాక్సెస్‌కు లేదా సేవల వినియోగానికి అలాగే ఉద్యోగులు, ఏజెంట్లు లేదా కాంట్రాక్టర్లు ఎవరైనా సరే వారితో సహా మీ ఎంటిటీతో సహసంబంధం ఉన్న ఇతరుల చేత మీ ఖాతా యాక్సెస్‌కు లేదా వినియోగానికి మీ వ్యాపారం లేదా ఎంటిటీ చట్టబద్ధంగా మరియు ఆర్ధికంగా బాధ్యులు అని మీరు సూచించి, నిశ్చయపరుస్తున్నారు. 

మా సేవలను యాక్సెస్ చేయడం లేదా వినియోగించడం ద్వారా షరతులను మీరు అంగీకరించవచ్చు. ఆ క్షణం నుండి సేవలకు మీ యాక్సెస్‌ను లేదా వినియోగాన్ని ఒక ఆమోదంగా మేము పరిగణిస్తాము అన్నది మీరు అర్ధం చేసుకుని, అంగీకరిస్తున్నారు.

 షరతుల స్థానిక కాపీని ఒక దానిని మీ రికార్డుల కొరకు మీరు ప్రింట్ చేసుకోవాలి లేదా భద్రపరచుకోవాలి.

3. షరతులలో మార్పులు

ఈ షరతులను మేము ఎప్పటికప్పుడు సవరిస్తూ ఉంటాము, ఉదాహరణకు మా సేవల ఫంక్షనాలిటీని మేము నవీకరించినప్పుడు, మా చేత లేదా మా అనుబంధ సంస్థల చేత నిర్వహించబడే సేవలు లేదా పలు యాప్‌లను ఒకటే సమిష్టి సేవ లేదా యాప్‌గా మేము సంకలితం చేసినప్పుడు లేదా ఏవైనా నియంత్రణా మార్పులు ఉన్నప్పుడు. ఈ నియమాలకు చేసే ఏవైనా ముఖ్యమైన మార్పులు, ఉదాహరణకు మా ప్లాట్‌ఫాం మీద ఒక ప్రకటనను చేయడం వంటి వాటిని మా యూజర్లు అందరికీ సాధారణంగా తెలియజేసేందుకు వాణిజ్యంగా సహేతుకమైన ప్రయత్నాలను మేము ఉపయోగిస్తాము, అయితే అటువంటి మార్పులు ఏవైనా చేయబడ్డాయేమో తెలుసుకునేందుకు మీరు షరతులను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ షరతుల పై భాగంలో “చివరగా నవీకరించబడిన” తేదీని కూడా మేము నవీకరిస్తాము, ఆ తేదీ నుండి సదరు షరతులు అమలు అవుతాయి. కొత్త షరతులు అమలు అయ్యే తేదీ నుండి మీరు మా సేవలను నిరంతరంగా యాక్సెస్ చేయడం లేదా వినియోగించడం అనేది కొత్త షరతులకు మీ ఆమోదాన్ని తెలియజేస్తుంది. కొత్త షరతులకు మీరు గనక అంగీకరించనట్లైతే, మీరు మా సేవలను యాక్సెస్ చేయడం లేదా వినియోగించడం ఆపేయాలి.

4. మాతో మీ ఖాతా

 మా సేవలలో కొన్నింటిని యాక్సెస్ చేసేందుకు లేదా వినియోగించేందుకు, మీరు మా వద్ద ఒక ఖాతాను రూపొందించుకోవాలి. మీరు ఈ ఖాతాను రూపొందించేటప్పుడు, మీరు తప్పని సరిగా ఖచ్చితమైన మరియు తాజా సమాచారాన్ని అందించాలి. మీరు మాకు అందించే మీ వివరాలను మరియు ఏదైనా ఇతర సమాచారాన్ని తాజాగా, పరిపూర్ణంగా ఉంచేందుకు సదరు సమాచారాన్ని మీరు మెయింటైన్ చేస్తూ, ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఉండడం ముఖ్యం.

మీ ఖాతాకు గల పాస్‌వర్డ్‌ను గోప్యంగా ఉంచుకోవడం, దానిని ఎటువంటి తృతీయ పక్షానికీ వెల్లడించకుండా ఉండడం ముఖ్యం. తృతీయ పక్షం వారికెవరికైనా మీ పాస్‌వర్డ్ తెలుసునని లేదా వారు మీ ఖాతాను యాక్సెస్ చేసారని మీకు తెలిసినా లేదా అనుమానం వచ్చినా, మీరు తక్షణమే mailto:feedback@tiktok.com వద్ద మాకు తప్పక తెలియజేయాలి.

మీ ఖాతాలో జరిగే కార్యకలాపానికి (మాకు మరియు ఇతరులకు) కేవలం మీరు మాత్రమే బాధ్యులని మీరు అంగీకరిస్తున్నారు. ఒక ఖాతాను రూపొందించేటప్పుడు, మీ గురించి మీరు ఖచ్చితమైన సమాచారాన్ని అందించాలి, కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కొరకు ఒకే ఒక ఖాతాను మీరు రూపొందించాలి.

ఈ షరతులలోని ఏ నిబంధనలతోనైనా అనుగుణ్యంగా వ్యవహరించడంలో మీరు విఫలమైనా, లేదా మీ ఖాతాలో జరిగే కార్యకలాపాలు, మా స్వంత నిర్ణయం మేరకు, సేవలకు హాని తలపెట్టేవి లేదా తలపెట్టగలవి అయినా లేదా సేవలను బలహీనపరిచేవైనా లేదా తృతీయ పక్షపు హక్కులను వేటినైనా ఉల్లంఘించేవి లేదా అతిక్రమించేవి ఐనా, లేదా వర్తించే చట్టాలు లేదా నియంత్రణలు వేటినైనా అతిక్రమించేవి అయినా, మీ యూజర్ ఖాతాను నిలిపివేసే, మరియు మీరు అప్‌లోడ్ చేసే లేదా పంచుకునే కంటెంట్‌ను దేనినైనా, ఏ సమయంలోనైనా తొలగించే లేదా నిలిపివేసే అధికారం మాకు ఉంది.

మీ గోప్యతా భద్రతను మేము చాలా ప్రధానంగా చూస్తాము, కాబట్టి మీ ఖాతాకు సంబంధించిన సమాచారాన్ని మేము సమాచార సాంకేతికత చట్టం 2000 మరియు దాని క్రింది నియమాల క్రింద ఆదేశించబడినట్లుగా డేటా సంరక్షణ మరియు భద్రతా ప్రమాణాల ఉన్నత ప్రమాణాలతో అనుగుణంగా ఉంచుతాము. మా ప్రస్తుత గోప్యతా విధానం ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

మీరు ఇకపై మా సేవలను మళ్ళీ వినియోగించదలచుకోకపోతే, మీ ఖాతా తొలగించబడాలని కోరుకుంటే, మీ తరఫున మేము తొలగిస్తాము. mailto:feedback@tiktok.com ద్వారా దయచేసి మమ్మల్ని సంప్రదించండి. మేము మీకు తదనంతర సహకారాన్ని అందించి, అది ఎలా చేయాలో చెబుతాము. మీ ఖాతాను తొలగించాలని మీరు ఒకసారి ఎంచుకుంటే, మీరు మీ ఖాతాను తిరిగి మళ్ళీ యాక్టివేట్ చేయలేరు లేదా మీరు జోడించిన ఏ కంటెంట్‌ను గానీ లేదా సమాచారాన్ని గానీ తిరిగి పొందలేరు.

5. మా సేవలకు మీ యాక్సెస్ మరియు వాటి వాడకం

మా సేవలకు మీ యాక్సెస్, వాటి వాడకం అనేది ఈ షరతులు మరియు వర్తించే అన్నీ చట్టాలు మరియు నిబంధనలకు లోబడి ఉంటుంది. మీరు బహుశా:

 • ఈ షరతులను అంగీకరించేందుకు మీరు పూర్తిగా సమర్ధులు కాకపోయినా, చట్టపరంగా యోగ్యులు కాకపోయినా, సేవలను యాక్సెస్ చేయలేరు, వినియోగించరు;
 • మా సేవలను యాక్సెస్ చేసేటప్పుడు లేదా వినియోగించేటప్పుడు మీరు ఎటువంటి చట్టవిరుద్ధమైన, దారితప్పించే, విభేదించే లేదా మోసపూరితమైన కార్యకలాపాన్ని చేయరు;
 • అనధీకృత నకలులను చేయడం, సవరించడం, అనుకూలపరచుకోవడం, అనువదించడం, రివర్స్ ఇంజనీరింగ్ చేయడం, చిన్నాభిన్నం చేయడం, డికంపైల్ చేయడం లేదా సేవల నుండి ఏవైనా పనులను ఉత్పన్నం చేయడం లేదా అందులో ఏవైనా ఫైల్స్, పట్టికలు లేదా పత్రీకరణ (లేదా దాని యొక్క ఏదైనా భాగం) వంటి ఏదైనా కంటెంట్‌ను చేర్చడం లేదా ఏవైనా సేవలు లేదా దాని యొక్క ఏదైనా ఉత్పాదిత పనుల ద్వారా రూపొందించబడిన ఏదైనా సోర్స్ కోడ్‌, అల్గరిథమ్‌లు, విధానాలు లేదా మెళకువలను నిర్ధారించడం లేదా నిర్ధారించేందుకు ప్రయత్నించడం చేయరు;
 • ఏవైనా సేవలు లేదా దాని యొక్క ఏదైనా ఉత్పాదిత పనులను పూర్తిగా గానీ లేదా భాగాలుగా గానీ పంపిణీ చేయడం, లైసెన్స్ చేసుకోవడం, బదిలీ చేయడం లేదా విక్రయించడం చేయరు;
 • సేవలను ఉచితంగా మార్కెట్ చేయడం, అద్దెకివ్వడం లేదా లీజుకివ్వడం, లేదా ఏదైనా వాణిజ్యపరమైన అభ్యర్ధనను చేసేందుకు లేదా ప్రకటన చేసేందుకు సేవలను ఉపయోగించడం చేయరు;
 • మేము రాతపూర్వకంగా వ్యక్తపరచిన సమ్మతిని పొందకుండా, ఏదైనా వాణిజ్యపరమైన ప్రకటన లేదా అభ్యర్ధన లేదా స్పామింగ్‌కు కమ్యూనికేట్ చేయడం లేదా సహకరించడం వంటి వాటితో సహా ఏదైనా వాణిజ్యపరమైన లేదా అనధీకృత ప్రయోజనం కోసం సేవలను వినియోగించడం చేయరు;
 • సక్రమంగా నడిచే సేవలలో జోక్యం చేసుకోవడం లేదా జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించడం, సేవలకు అనుసంధానమై ఉన్న ఏవైనా నెట్‌వర్కులు లేదా మా వెబ్‌సైట్‌ను భంగపరచడం, లేదా సేవలకు ప్రవేశ సౌలభ్యతను నివారించేందుకు లేదా నిషేధించేందుకు బహుశా మేము ఉపయోగించే ఏవైనా ప్రమాణాలను బైపాస్ చేయడం వంటివి చేయరు;
 • సేవలను లేదా దాని యొక్క ఏదైనా భాగాన్ని ఏదైనా ఇతర ప్రోగ్రాం లేదా ప్రొడక్టులో అమలు చేయడం వంటివి చేయరు. అటువంటి సందర్భంలో, సేవను తిరస్కరించి, ఖాతాలను రద్దు చేయడం లేదా మా స్వంత నిర్ణయం మేరకు సేవలకు ప్రవేశ సౌలభ్యతను పరిమితం చేసేందుకు మాకు హక్కు ఉంటుంది;
 • సేవల నుండి లేదా ఇతరత్రా సేవలను ప్రభావితం చేసి సమాచారాన్ని సేకరించేందుకు ఆటోమేటెడ్ స్క్రిప్టులను ఉపయోగించరు;
 • ఎవరైనా వ్యక్తి లేదా ఎంటిటీని మోసగించడం, లేదా మీరు అప్‌లోడ్ చేసే, పోస్ట్ చేసే, ప్రసారం చేసే, పంపిణీ చేసే ఏదైనా కంటెంట్‌ను లేదా ఇతరత్రా సేవల నుండి ఉత్పన్నమయ్యే వాటిని పొందవచ్చు అనే అభిప్రాయాన్ని కల్పించడంతో సహా, ఎవరైనా వ్యక్తి లేదా ఎంటిటీతో మిమ్మల్ని లేదా మీ అనుబంధకులను తప్పుగా చెప్పడం లేదా ఇతరత్రా వక్రీకరించడం చేయరు;
 • ఇతరులను భయపెట్టడం లేదా సతాయించడం, లేదా జాతి, లింగం, మతం, జాతీయత, వైకల్యం, లైంగిక నేపథ్యం లేదా వయస్సు ఆధారంగా వివక్షతను లేదా హింసను, లైంగికపరంగా తేటతెల్లమైన విషయాలను ప్రోత్సహించడం వంటివి చేయరు;
 • టిక్‌టాక్ వారి అనుమతి పొందకుండా ఇతరుల ఖాతా, సేవ లేదా సిస్టంను ఉపయోగించడం లేదా ఉపయోగించేందుకు ప్రయత్నించడం, లేదా సేవల మీద ఒక తప్పుడు గుర్తింపును రూపొందించడం వంటివి చేయరు;
 • సేవల ప్రయోజనాల విలువను తగ్గించే విధంగా లేదా వ్యక్తిగత ఆసక్తిని కనబరచి, పక్షపాతం చూపే విధంగా సేవలను ఉపయోగించడం, అంటే ఇతర యూజర్లతో సమీక్షలను వ్యాపార మార్గంలో చేయడం లేదా నకిలీ సమీక్షలను రాయడం లేదా కోరడం వంటివి చేయరు;
 • వైరస్‌లు, ట్రోజన్లు, వామ్‌లు, లాజిక్ బాంబ్‌లు లేదా ప్రతికూలమైన లేదా సాంకేతికతపరంగా హానికరమైన ఇతర అంశాలను కలిగిన ఫైల్స్‌; అభ్యర్ధించని లేదా ఆమోదం పొందని ప్రకటనలు, అభ్యర్ధనలు, ప్రచార సంబంధిత అంశాలు, “జంక్ మెయిల్,” “స్పామ్”, “గొలుసు అక్షరాలు”, “పిరమిడ్ స్కీంలు”, లేదా ఏదైనా ఇతర నిషేధిత రూపంలో ఉండే అభ్యర్ధన; ఏదైనా తృతీయ పక్షపు చిరునామాలు, ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ అడ్రసులు, వ్యక్తిగత గుర్తింపు పత్రంలోని నెంబరు మరియు విశేషాంశం (ఉదా: జాతీయ బీమా నెంబర్లు, పాస్‌పోర్ట్ నెంబర్లు) లేదా క్రెడిట్ కార్డ్ నెంబర్లతో సహా ఏదైనా వ్యక్తిగత సమాచారం; ఏదైనా కాపీరైట్, ట్రేడ్‌మార్క్ లేదా ఇతర బౌద్ధిక సంపద లేదా ఏదైనా ఇతర వ్యక్తి యొక్క గోప్యతా హక్కులను అతిక్రమించే లేదా అతిక్రమించగల ఏదైనా మెటీరియల్; అశ్లీలమైన, హేయమైన, బూతువ్రాత సంబంధిత, ద్వేషభరితమైన లేదా ఉద్రేకపూరితమైన, ఏ వ్యక్తినైనా అప్రతిష్టపాలు చేసే ఏదైనా మెటీరియల్; నేరాపరాధన, హానికరమైన కార్యకలాపాలు లేదా స్వీయ-హానికి ప్రోత్సహించే లేదా సూచనలు ఇచ్చే, కల్పించే ఏదైనా మెటీరియల్; మనుషులకు కోపం తెప్పించే లేదా రెచ్చగొట్టేందుకు కావాలని రూపొందించబడినటువంటివి, ప్రత్యేకించి కొంటె చేష్టలు చేయడం, వెక్కిరించడం వంటివి, లేదా మనుషిని క్షోభపెట్టడం, హాని తలపెట్టడం, బాధ పెట్టడం, భయపెట్టడం, దురవస్థపాలుచేయడం, ఇబ్బంది పెట్టే లేదా కలవరపెట్టేందుకు ఉద్దేశించబడిన ఏదైనా మెటీరియల్; శారీరికంగా హింసించేందుకు బెదిరింపులతో సహా ఏదో రకమైన బెదిరింపుతో కూడిన ఏదైనా మెటీరియల్; ఒకరి జాతి, మతం, వయస్సు, లింగం, వైకల్యం లేదా లైంగికతల ఆధారంగా చూపే బేధాలతో సహా జాత్యహంకార లేదా విబేధించే ఏదైనా మెటీరియల్: వంటి వాటిని ఏవైనా మార్గాలలో అప్‌లోడ్ చేయడం, ప్రసారం చేయడం, పంపిణీ చేయడం, నిల్వ చేయడం లేదా ఇతరత్రా అందుబాటులో ఉంచేందుకు సేవలను వినియోగించడం చేయరు;
 • మీకు సరిగ్గా అనుమతి లేని లేదా ఇతరత్రా అర్హత లేని ఏవైనా సమాధానాలు, ప్రతిస్పందనలు, వ్యాఖ్యలు, అభిప్రాయాలు, విశ్లేషణలు లేదా సిఫారసులు ఇవ్వడం చేయరు; లేదా
 • టిక్‌టాక్ వారి స్వీయ నిర్ణయం మేరకు ఆక్షేపణీయమైన లేదా సేవలను వినియోగించుకునేందుకు ఎవరైనా ఇతర వ్యక్తిని నిషేధించే లేదా నిరోధించే, లేదా టిక్‌టాక్‌ను, సేవలను లేదా వారి యూజర్లను ఏదైనా హాని లేదా ఏ రకమైన లయబిలిటీకైనా బహిర్గతం చేసే మెటీరియల్;

 పైన చెప్పిన వాటితో బాటుగా, సేవలకు మీ ప్రవేశ సౌలభ్యత మరియు వాటి వినియోగం మా కమ్యూనిటీ మార్గదర్శకాలతో అన్ని వేళలా అనుగుణంగా ఉండడం తప్పనిసరి.

ముందస్తుగా తెలియజేయకుండా, ఏ సమయంలోనైనా, ఏ కారణం చేతనైనా లేదా ఏ కారణం లేకున్నా, మా నిర్ణయం మేరకు కంటెంటుకు ప్రవేశ సౌలభ్యతను తొలగించే లేదా రద్దు చేసే హక్కును మేము కలిగి ఉంటాము. కంటెంట్ అభ్యంతరకరంగా ఉన్నా, ఈ షరతులను లేదా మా కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించేదిగా ఉన్నా, లేదా ఇతరత్రా సేవలకు లేదా మా యూజర్లకు హానికరమైనదిగా కంటెంట్ అనిపించడం అనేవి మేము కంటెంటుకు ప్రవేశ సౌలభ్యతను బహుశా తొలగించేందుకు లేదా రద్దు చేసేందుకు గల కొన్ని కారణాలు. మీ అభిరుచులకు అనుగుణంగా శోధనా ఫలితాలు, మీకు అనుకూలంగా మార్పులు చేసిన ప్రకటనలు, మరియు స్పామ్ మరియు మాల్వేర్‌ను కనుగొనడం వంటి వ్యక్తిగత సంబంధిత ఉత్పత్తి విశేషాంశాలను మీకు అందించేందుకు మీ కంటెంట్‌ను మా ఆటోమేటెడ్ సిస్టంలు విశ్లేషిస్తాయి. కంటెంట్‌ను పంపినప్పుడు, పొందినప్పుడు మరియు భద్రపరిచినప్పుడు ఈ విశ్లేషణ జరుగుతుంది.

6. మేధాశక్తి హక్కులు

మేధాశక్తి హక్కులను మేము గౌరవిస్తాము, మిమ్మల్ని కూడా గౌరవించమని కోరుతున్నాము. సేవలకు మీ ప్రవేశ సౌలభ్యత మరియు వాటి వినియోగానికి ఒక షరతుగా, మేధాశక్తి హక్కులను వేటినైనా ఉల్లంఘించేందుకు సేవలను ఉపయోగించరని మీరు అంగీకరిస్తున్నారు. మా స్వంత నిర్ణయం మీద ఏ సమయంలోనైనా, చెప్పైనా లేదా చెప్పకుండానైనా, కాపీరేట్లు లేదా ఇతర మేధాశక్తి హక్కులను వేటినైనా అతిక్రమించిన లేదా అతిక్రమించేందుకు ఆరోపించబడిన ఏ యూజర్‌ ఖాతానైనా నిలిపివేసేందుకు మరియు/లేదా దానికి ప్రవేశ సౌలభ్యతను నిరోధించేందుకు మాకు అధికారం ఉంది.

ఇంకా, ప్లాట్‌ఫాంలోని అన్నీ చట్టపరమైన హక్కులు, టైటిల్, ఆసక్తి, మేధాశక్తి మరియు సేవలు (ఆ హక్కులు నమోదుచేయబడి ఉన్నాయా లేదా అన్న దానితో సంబంధం లేకుండా, మరియు ఆ హక్కులు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా), టిక్‌టాక్ వారి స్వంతం, మరియు టిక్‌టాక్ వారి వాణిజ్య పేర్లు, ట్రేడ్‌మార్కులు, సేవా మార్కులు, లోగోలు, డొమైన్ పేర్లు, మరియు ఇతర విశిష్ట బ్రాండ్ విశేషాంశాలు వేటినైనా ఏ విధంగానైనా ఉపయోగించేందుకు మేము వ్యక్తపరచకుండా మరియు మా ముందస్తు రాతపూర్వక సమ్మతి లేకుండా ఈ షరతులలో ఏ ఒక్కటీ మీకు అధికారాన్ని ఇవ్వదు.

7. కంటెంట్

A. టిక్‌టాక్ కంటెంట్

మీకు మరియు టిక్‌టాక్ మధ్యలో, కంటెంట్, సాఫ్ట్‌వేర్‌, ఇమేజ్‌లు, టెక్స్ట్, గ్రాఫిక్స్, నిదర్శనాలు, లోగోలు, పేటెంట్లు, ట్రేడ్‌మార్కులు, సేవా మార్కులు, కాపీరైట్లు, ఫోటోగ్రాఫ్‌లు, ఆడియో, వీడియోలు, సేవల “లుక్ అండ్ ఫీల్” మరియు దాని మీది మ్యూజిక్ అన్నీ, మరియు (“టిక్‌టాక్ కంటెంట్”) దానికి సంబంధించిన మేధాశక్తి హక్కులు అన్నీ టిక్‌టాక్ స్వంతం లేదా టిక్‌టాక్ వారు లైసెన్స్ పొంది ఉన్నారు, (క్రింద నిర్వచించిన విధంగా) సేవల ద్వారా మీరు ప్రసారం చేసే లేదా అప్‌లోడ్ చేసే ఏదైనా యూజర్ కంటెంటు మీకు లేదా మీ లైసెన్సర్లకు స్వంతం అన్నది అర్ధం అవుతున్నది. ఈ షరతుల ద్వారా స్పష్టంగా అనుమతించబడని ఏ ప్రయోజనం కోసమైనా టిక్‌టాక్ సేవల మీద టిక్‌టాక్ కంటెంట్ లేదా మెటీరియల్స్‌ను ఉపయోగించడం పూర్తిగా నిషిద్ధం. అటువంటి కంటెంట్ బహుశా డౌన్‌లోడ్ కాకపోవచ్చు, కాపీ చేయడం, తిరిగి ఉత్పత్తి చేయడం, పంపిణీ, ప్రసారం చేయడం, బ్రాడ్కాస్ట్ చేయడం, ప్రదర్శించడం, అమ్మడం, లైసెన్స్ పొందడం లేదా ఇతరత్రా ఏదైనా ప్రయోజనం కోసం దాచుకోవడం వంటివి మా యొక్క లేదా, వర్తించే చోట మా లైసెన్సర్ల ముందస్తు రాతపూర్వక సమ్మతి లేకుండా చేయరాదు. మేము, మా లైసెన్సర్లు తమ కంటెంట్‌కు మరియు అందులో బహిర్గతంగా మంజూరు చేయబడని అన్నీ హక్కులు మా యొక్క మరియు మా లైసెన్సర్ల యొక్క ప్రత్యేకం.

మీరు వినియోగించుకున్న సేవల నుండి మేము ఆదాయాన్ని పొందవచ్చు, ప్రతిష్ఠను పెంచుకోవచ్చు లేదా ఇతరత్రా మా విలువను పెంచుకోవచ్చు అని మీరు తెలుసుకుని, అంగీకరిస్తున్నారు. వీటిలో ప్రతిబంధకాలుగా కాకుండా ఉదాహరణగా చెప్పుకుంటే, ప్రకటనలను విక్రయించడం ద్వారా, స్పాన్సర్‌షిప్‌లు, ప్రచారాలు, వినియోగించిన డేటా, బహుమతులు (క్రింద వివరించబడ్డాయి), మరియు ఈ షరతులలో లేదా మీరు మాతో కుదుర్చుకున్న మరొక ఒప్పందంలో మా ద్వారా ప్రత్యేకించి అనుమతించబడినవి తప్ప, అటువంటి ఆదాయం, ప్రతిష్ఠ లేదా విలువ ఏదైనా సరే దానిలో భాగస్వామ్యానికి హక్కును కలిగి ఉండరు. ఈ షరతులలో లేదా మీరు మాతో కుదుర్చుకున్న మరొక ఒప్పందంలో మా ద్వారా ప్రత్యేకించి అనుమతించబడినవి తప్ప, మీరు (i) (క్రింద వివరించిన) ఏదైనా యూజర్ కంటెంట్‌ నుండి లేదా మీ చేత రూపొందించబడిన ఏదైనా యూజర్ కంటెంట్‌తో సహా, సేవల ద్వారా లేదా వాటి మీద మీకు అందుబాటులో ఉంచిన ఏదైనా మ్యూజిక్ సంబంధిత వర్క్స్, సౌండ్ రికార్డింగులు లేదా శ్రవణ దృశ్య క్లిప్‌లను మీరు వినియోగించడం ద్వారా ఎటువంటి ఆదాయాన్ని లేదా ఇతర ప్రతిఫలాన్ని పొందేందుకు హక్కు కలిగి లేరు, మరియు (ii) సేవలలో లేదా ఏదైనా తృతీయ పక్షపు సేవ మీద ఏదైనా యూజర్ కంటెంట్‌ నుండి ప్రతిఫలాన్ని పొందేందుకు లేదా కరెన్సీని పొందేందుకు ఎటువంటి హక్కులనైనా వినియోగించుకోవడం నిషిద్ధం (ఉదాహరణకు, డబ్బు సంపాదించడం కోసం యుట్యూబ్ వంటి సామాజిక మాధ్యమ ప్లాట్‌ఫాంలకు అప్‌లోడ్ చేసిన యూజర్ కంటెంట్‌ను మీరు క్లెయిం చేసుకోలేరు).

షరతుల నియమ నిబంధనలకు లోబడి, ఒక అనుమతించబడిన పరికరం మీద ప్లాట్‌ఫాంను డౌన్‌లోడ్ చేసుకోవడం మరియు మీ వ్యక్తిగత, వాణిజ్యేతర వినియోగం కొరకు కేవలం టిక్‌టాక్ కంటెంట్‌ను మీ సేవల వినియోగం ద్వారా యాక్సెస్ చేసేందుకు మరియు కేవలం ఈ షరతులకు అనుగుణ్యంగా సేవల ప్రవేశ సౌలభ్యతకు మరియు వినియోగించడానికి మీకు ఇందుమూలంగా ఒక ప్రత్యేకం-కాని, పరిమితమైనట్టి, బదిలీ చేయలేని, సబ్‌లైసెన్స్ చేయలేని, తిరిగితీసుకోలేని, ప్రపంచవ్యాప్త లైసెన్స్‌ జారీ చేయబడుతోంది. టిక్‌టాక్ కంటెంట్‌ మరియు సేవలలో స్పష్టంగా కేటాయించని అన్నీ హక్కులు టిక్‌టాక్ వారి ప్రత్యేకం. ఏ కారణం చేతనైనా లేదా ఏ కారణం లేకుండా ఏ సమయంలోనైనా ఈ లైసెన్సును టిక్‌టాక్ రద్దు చేయవచ్చని మీరు అర్ధం చేసుకుని, అంగీకరిస్తున్నారు.

సేవ నుండి లేదా సేవ ద్వారా అందుబాటులోకి తెచ్చిన సౌండ్ రికార్డింగులు మరియు అందులో చేర్చిన మ్యూజిక్ సంబంధిత వర్క్స్‌కు సంబంధించి ఎటువంటి హక్కులకు లైసెన్స్ లేదు.

సేవల మీద ఇతరుల చేత అందించబడిన కంటెంట్‌ను మీరు చూసినప్పుడు, మీరు మీ స్వంత రిస్క్ మీద అలా చేస్తున్నారని మీరు అర్ధం చేసుకుని, అంగీకరిస్తున్నారు. మా సేవల మీది కంటెంట్ సాధారణ సమాచారం కొరకు మాత్రమే అందించబడింది. మీరు ఆధారపడేందుకు సలహాల కొరకు ఇది ఉద్దేశించినది కాదు. మా సేవల మీది కంటెంట్ ఆధారంగా ఏదైనా చర్యను తీసుకునే ముందు లేదా నిరోధించే ముందు ప్రొఫెషనల్ లేదా స్పెషలిస్ట్ సలహా పొందడం తప్పనిసరి.

 (యూజర్ కంటెంట్‌తో సహా) టిక్‌టాక్ కంటెంట్ ఖచ్చితమైనదని, పరిపూర్ణమైనదని లేదా లేటెస్ట్ అని స్పష్టంగా గానీ, సూచితంగా గానీ మేము ఎటువంటి ప్రతిపాదనలు, వారంటీలు లేదా హామీలు ఇవ్వడం లేదు. మా సేవలలో తృతీయ పక్షాల ద్వారా అందించబడిన వనరులు మరియు ఇతర సైట్లకు లింకులు ఉంటే, ఈ లింకులు కేవలం మీ సమాచారం కొరకు మాత్రమే ఇవ్వబడ్డాయి. సదరు సైట్లు లేదా వనరులలోని కంటెంట్ల మీద మాకు ఎటువంటి నియంత్రణ లేదు. అటువంటి లింక్ చేయబడిన వెబ్‌సైట్లు లేదా వాటి నుండి మీరు బహుశా పొందే సమాచారానికి మా ఆమోదంగా అటువంటి లింకులను అన్వయించుకోరాదు. (యూజర్ కంటెంట్‌తో సహా) మీ చేత మరియు సేవల మీది ఎవరైనా ఇతర యూజర్ల చేత పోస్ట్ చేయబడిన ఏదైనా కంటెంట్‌ను ప్రీస్క్రీన్ చేసే, మానిటర్ చేసే, సమీక్షించే, లేదా సవరించే బాధ్యత మాది కాదని మీరు అర్ధం చేసుకున్నారని తెలుపుతున్నారు.

 B. యూజర్-రూపొందించిన కంటెంట్

మీ వ్యక్తిగత మ్యూజిక్ లైబ్రరీ మరియు చుట్టుపక్కల వచ్చే శబ్దాలు (“యూజర్ కంటెంట్”) నుండి స్థానికంగా నిల్వ చేసిన సౌండ్ రికార్డింగులను అమలు చేసే వీడియోలతో సహా టెక్స్ట్, ఫోటోగ్రాఫులు, యూజర్ వీడియోలు, సౌండ్ రికార్డింగులు మరియు అందులో కూర్చిన మ్యూజికల్ వర్కులు మాత్రమే కాకుండా, అలాంటి అన్నీ సేవల ద్వారా కంటెంట్‌ను అప్‌లోడ్, పోస్ట్ లేదా ప్రసారం చేయడం (ఒక స్ట్రీం ద్వారా చేయడం వంటివి) లేదా ఇతరత్రా అందుబాటులో ఉంచేందుకు సేవలను వినియోగించుకునే యూజర్లు అనుమతించబడవచ్చు. ఒకరికన్నా ఎక్కువ మంది యూజర్ల ద్వారా రూపొందించబడిన యూజర్ కంటెంట్‌ను చేర్చే, కలిపి అందించే ఇతర యూజర్లతో సహకరించే యూజర్‌ కంటెంట్‌తో సహా అదనపు యూజర్ కంటెంట్‌ను ఉత్పత్తి చేసేందుకు మరొక యూజర్‌తో రూపొందించబడిన మొత్తం యూజర్ కంటెంట్‌ను లేదా అందులోని ఏదైనా భాగాన్ని కూడా సేవలను వినియోగించుకునే యూజర్లు సంగ్రహించవచ్చు. ఈ యూజర్‌ కంటెంట్ మీదకు టిక్‌టాక్ (“టిక్‌టాక్ ఎలిమెంట్లు”) సమర్పించిన ఇతర ఎలిమెంట్లు మరియు మ్యూజిక్, గ్రాఫిక్స్, స్టిక్కర్లు, (“అనుబంధక షరతులు – పరోక్ష అంశాల విధానం” లో నిర్వచించి, మరింతగా వివరించిన) పరోక్ష అంశాలను కూడా సేవలను వినియోగించుకునే యూజర్లు కవర్ చేసి, ఈ యూజర్ కంటెంట్‌ను సేవల ద్వారా ప్రసారం చేయవచ్చు. టిక్‌టాక్ ఎలిమెంట్స్‌తో కూడి ఉండే యూజర్ కంటెంట్‌తో సహా యూజర్ కంటెంట్‌లోని సమాచారం మరియు ఎలిమెంట్స్ మా ద్వారా తనిఖీ చేయబడలేదు లేదా ఆమోదించబడలేదు. (పరోక్ష బహుమతుల వినియోగం ద్వారా సహా) సేవల మీద ఇతర యూజర్లు వ్యక్తపరిచిన అభిప్రాయాలు, మా అభిప్రాయాలను లేదా విలువలను సూచించవు.

(ఇన్స్టాగ్రాం, ఫేస్‌బుక్, యుట్యూబ్, ట్విట్టర్ వంటి నిర్దిష్ట తృతీయ పక్షపు సామాజిక మాధ్యమ ప్లాట్‌ఫాంల ద్వారా వంటి వాటితో సహా) సేవల ద్వారా యూజర్ కంటెంట్‌ను అప్‌లోడ్ చేసేందుకు లేదా ప్రసారం చేసేందుకు మిమ్మల్ని అనుమతించే ఒక విశేషాంశాన్ని మీరు యాక్సెస్ చేసినప్పుడు లేదా వినియోగించినప్పుడు, లేదా సేవలను వినియోగించే ఇతర యూజర్లను సంప్రదించడానికి, పైన తెలిపిన “మా సేవలకు మీ ప్రవేశ సౌలభ్యత మరియు వాటి వినియోగం” లో బయల్పరచిన ప్రమాణాలతో మీరు తప్పని సరిగా అనుగుణ్యంగా ఉండాలి. టిక్‌టాక్ ఎలిమెంట్లను కలిగి ఉండే యూజర్ కంటెంట్‌తో సహా మీ యూజర్ కంటెంట్‌ను తృతీయ పక్షాల ద్వారా నిర్వహించబడే సైట్లు లేదా ప్లాట్‌ఫాంల మీద అప్‌లోడ్ చేసేందుకు లేదా ప్రసారం చేసేందుకు కూడా మీరు ఎంచుకోవచ్చు. అలా చేయడానికి మీరు ఎంచుకుంటే, మీరు వారి కంటెంట్ యొక్క మార్గదర్శకాలతో, అలాగే పైన తెలిపిన “మా సేవలకు మీ ప్రవేశ సౌలభ్యత మరియు వాటి వినియోగం”లో బయల్పరచిన ప్రమాణాలతో మీరు తప్పని సరిగా అనుగుణ్యంగా ఉండాలి.

అటువంటి ఏ పనులైనా ఆయా ప్రమాణాలతో అణుగుణ్యంగా ఉంటాయని మీరు వారంటీ ఇస్తున్నారు మరియు అటువంటి వారంటీని ఏ విధంగానైనా ఉల్లంఘిస్తే మీరే బాధ్యులు మరియు మాకు నష్టపరిహారం చెల్లిస్తారు. అంటే వారంటీని మీరు ఉల్లంఘించడం వలన మాకు జరిగే ఏదైనా నష్టానికి లేదా హానికి మీరే బాధ్యులు అని దానర్ధం.

ఏ యూజర్ కంటెంట్ ఐనా గానీ రహస్యంగా, యజమానికి సంబంధించినదిగా పరిగణించబడదు. రహస్యమైన లేదా మీ స్వంతదిగా పరిగణించదగిన ఎటువంటి యూజర్ కంటెంట్‌నూ మీరు ప్రసారం చేయరాదు లేదా సేవల ద్వారా లేదా వాటి మీద ఏ యూజర్ కంటెంట్‌ను కూడానూ పోస్ట్ చేయరాదు. సేవల ద్వారా మీ యూజర్ కంటెంట్‌ను మీరు సమర్పించినప్పుడు. ఆ యూజర్ కంటెంట్‌కు మీరు యజమాని అని లేదా సేవలకు సమర్పించేందుకు, సేవల నుండి ఇతర తృతీయ పక్షపు ప్లాట్‌ఫాంలకు దానిని ప్రసారం చేసేందుకు, మరియు/లేదా ఏదైనా తృతీయ పక్షపు కంటెంట్‌ను అవలంబించేందుకు కంటెంట్ యొక్క ఏదైనా భాగపు యజమాని యొక్క అధీకృతం పొందారని లేదా వారి అనుమతులను, క్లియరెన్సును ఆవశ్యకమైన వాటిని అన్నింటినీ మీరు పొందారని, మీరు అంగీకరించి, సూచిస్తున్నారు,

ఒక సౌండ్ రికార్డింగు క్రింద వచ్చే అటువంటి సౌండ్ రికార్డింగులలో కూర్చిన మ్యూజికల్ వర్కులకు కాకుండా, ఒక సౌండ్ రికార్డింగు మరియు అందులోని హక్కులు మాత్రమే మీ స్వంతం ఐతే, సేవలను సమర్పించేందుకు కంటెంట్ యొక్క ఏదైనా భాగపు యజమాని అధీకృతం పొందితే తప్ప లేదా వారి నుండి అన్నీ అనుమతులను, క్లియరెన్సులను మీరు కలిగి ఉంటే మినహా సేవలకు అటువంటి సౌండ్ రికార్డింగులను మీరు పోస్ట్ చేయరాదు.

మాకు పంపిన యూజర్ కంటెంట్‌లో మీరు లేదా మీ యూజర్ కంటెంట్ యజమాని కాపీరైట్‌ను స్వంతంగా కలిగి ఉంటారు, అయితే సేవల ద్వారా యూజర్ కంటెంట్‌ను సమర్పించడం ద్వారా, ఇప్పుడు తెలిసిన లేదా ఇకపై కనుగొనబడే మీ యూజర్ కంటెంట్‌ను ఏ ఫార్మాట్‌లోనైనా , ఏ ప్లాట్‌ఫాం మీదనైనా వీక్షించేందుకు, యాక్సెస్ చేసేందుకు, ఉపయోగించేందుకు, డౌన్‌లోడ్ చేసేందుకు, సవరించేందుకు, అవలంబించేందుకు, పునరుత్పత్తి చేసేందుకు, వాటి నుండి వర్కులను ఉత్పన్నం చేసేందుకు, ప్రచురించేందుకు మరియు/లేదా ప్రసారం చేసేందుకు మరియు వీక్షించేందుకు, యాక్సెస్ చేసేందుకు, ఉపయోగించేందుకు, డౌన్‌లోడ్ చేసేందుకు, సవరించేందుకు, అవలంబించేందుకు, పునరుత్పత్తి చేసేందుకు, వాటి నుండి వర్కులను ఉత్పన్నం చేసేందుకు, ప్రచురించేందుకు మరియు/లేదా ప్రసారం చేసేందుకు సేవల మీది ఇతర యూజర్లు మరియు ఇతర తృతీయ పక్షాలకు అధికారం ఇచ్చేందుకు, ఒక షరతులులేని తిరిగితీసుకోలేని, ప్రత్యేకం-కాని, రాయల్టీ-రహిత, పూర్తిగా బదిలీ చేయగల, నిరంతర ప్రపంచవ్యాప్త లైసెన్సును మీరు మాకు ఇందుమూలంగా మంజూరు చేస్తున్నారు.

మీ యూజర్ కంటెంట్‌లో ఏదో ఒక దాని యొక్క మూలంగా మిమ్మల్ని గుర్తించేందుకు మీ పేరు, చిత్రం, వాయిస్, వంటి వాటిని ఉపయోగించేందుకు రాయల్టీ-రహిత-లైసెన్సును మీరు మాకు మంజూరు చేస్తున్నారు.

అనుమానాలను తొలగించేందుకు, ఈ సెక్షన్‌లోని ముందరి పేరాగ్రాఫ్‌లలో మంజూరు చేసిన హక్కులలో, సౌండ్ రికార్డింగులను (మరియు అటువంటి సౌండ్ రికార్డింగులలో కూర్చిన మ్యూజికల్ వర్కుల యొక్క యాంత్రిక పునరుత్పత్తులను చేసేందుకు) పునరుత్పత్తి చేసే హక్కు, మరియు బహిరంగ సౌండ్ రికార్డింగులను (మరియు అందులో కూర్చిన మ్యూజికల్ వర్కులను) బహిరంగంగా ప్రదర్శించే మరియు కమ్యూనికేట్ చేసే హక్కు అన్నీ రాయల్టీ-రహిత ఆధారంగా ఉంటాయి, అయితే హక్కులు ఈ జాబితాకు మాత్రమే పరిమితం కాదు. అంటే ఏదేని తృతీయ పక్షానికి రాయల్టీలను చెల్లించే బాధ్యత లేకుండా మీ యూజర్ కంటెంట్‌ను ఉపయోగించే హక్కును మీరు మాకు అందిస్తున్నారని అర్ధం, వీటిలో ఒక సౌండ్ రికార్డింగ్ కాపీరైట్ యజమాని (ఉదా. ఒక రికార్డ్ లేబుల్), ఒక మ్యూజికల్ కాపీరైట్ యజమాని (ఉదా. ఒక మ్యూజిక్ పబ్లిషర్) ఒక ప్రదర్శనా హక్కుల సంస్థ (ఉదా: ఎఎస్‌సిఎపి, బిఎంఐ, ఎస్‌ఇఎస్‌ఎసి, మొ.) (ఒక “పిఆర్‌ఓ”), ఒక సౌండ్ రికార్డింగ్ పిఆర్‌ఓ (ఉదా: సౌండ్‌ ఎక్స్ఛేంజ్), ఏవైనా యూనియన్లు లేదా సంఘాలు, మరియు ఇంజనీర్లు, నిర్మాతలు లేదా యూజర్ కంటెంట్ రూపకల్పనలో ప్రమేయం ఉన్న ఇతర రాయల్టీ అభ్యర్ధులు మాత్రమే కాకుండా మరెందరో ఉంటారు.

యూజర్-రూపొందిత కంటెంట్‌ యొక్క సంపూర్ణత్వానికి, వాస్తవికతకు, ఖచ్చితత్వానికి, లేదా విశ్వసనీయతను దేనినీ మేము బలపరచము, సమర్ధించము, ప్రాతినిధ్యం వహించము లేదా హామీ ఇవ్వము లేదా దాని యొక్క వ్యక్తపరచబడిన ఏవేని అభిప్రాయాలను మేము బలపరచము. సేవలను వినియోగించడం ద్వారా, అసహ్యకరమైన, హానికరమైన, ఖచ్చితంగా లేని లేదా ఇతరత్రా సరైనది కానటువంటి, లేదా కొన్ని సందర్భాలలో, తప్పుగా లేబుల్ చేయబడిన పోస్టింగులు లేదా ఇతరత్రా వంచనతో కూడిన కంటెంట్‌కు మీరు బహిర్గతం కావచ్చు. కంటెంట్‌ అంతా సదరు కంటెంట్‌ను రూపొందించిన వ్యక్తి యొక్క స్వంత బాధ్యత.

మ్యూజికల్ వర్క్స్ మరియు రికార్డింగ్ కళాకారుల కొరకు నిర్దిష్ట నియమాలు. మీరు ఒక మ్యూజికల్ వర్క్‌కు ఒక రచయిత లేదా స్వరకర్త మరియు ఒక పి.ఆర్‌.ఓ.తో సహసంబంధాన్ని కలిగి ఉంటే, మీ యూజర్ కంటెంట్‌లోని ఈ నియమాల ద్వారా మాకు మీరు జారీ చేసే రాయల్టీ రహిత లైసెన్స్ యొక్క మీ పి.ఆర్‌.ఓ.కు మీరు తప్పక తెలియజేయాలి. సంబంధిత పి.ఆర్‌.ఓ. యొక్క రిపోర్టింగ్ బాధ్యతలతో మీరు అనుగుణ్యంగా ఉండేట్లు చూసుకోవడం పూర్తిగా మీ బాధ్యతే. ఒక మ్యూజిక్ పబ్లిషర్‌కు మీరు మీ హక్కులను అప్పగించినట్లైతే, మీ యూజర్ కంటెంట్‌లోని ఈ నియమాలలో వివరించిన రాయల్టీ-రహిత లైసెన్స్‌(ల)ను మంజూరు చేసేందుకు అటుంటి మ్యూజిక్ పబ్లిషర్ యొక్క సమ్మతిని మీరు తప్పక పొందాలి లేదా సదరు మ్యూజిక్ పబ్లిషర్ మాతో ఈ షరతులను కుదుర్చుకోవాలి. కేవలం మీరు ఒక మ్యూజికల్ వర్క్‌ (ఉదాకు పాట రచించడం)ను రచించారు కాబట్టి ఈ షరతులలోని లైసెన్సులను మాకు మంజూరు చేసే హక్కు మీకు ఉందని అర్ధం కాదు. ఒక రికార్డ్ లేబుల్‌తో ఒప్పందం కింద పని చేసే రికార్డింగ్ ఆర్టిస్ట్ మీరు గనక ఐతే, అది మీ లేబుల్‌ పేరిట చెప్పబడే వంటి వాటితో సహా సేవల ద్వారా మీరు ఏవైనా కొత్త రికార్డింగులను రూపొందినట్లైతే, మీ రికార్డ్ లేబుల్‌కు బహుశా మీరు కలిగి ఉన్న ఏదైనా ఒప్పందపూర్వక బాధ్యతతో అనుగుణ్యంగా మీరు సేవలను వినియోగించుకోవడం ఉండేలా చూసుకునే పూర్తి బాధ్యత మీపై ఉంటుంది. 

త్రూ-టు-ది-ఆడియన్స్ హక్కులు. ఈ షరతులలో మీ యూజర్ కంటెంట్‌లో మీకు మంజూరు చేసే అన్నీ హక్కులు త్రూ-టు-ది-ఆడియన్స్ ఆధారంగా అందించబడినవి. అంటే, సేవల ద్వారా అటువంటి తృతీయ పక్షపు సేవ మీద పోస్ట్ చేయబడిన లేదా ఉపయోగించచబడిన యూజర్ కంటెంట్‌ కొరకు మీకు లేదా ఏదైనా ఇతర తృతీయ పక్షానికి, తృతీయ పక్షపు యజమానులు లేదా కార్యనిర్వాహకులు, ఎటువంటి ప్రత్యేకమైన బాధ్యతను కలిగి ఉండరు.

యూజర్ కంటెంట్‌కు హక్కుల మినహాయింపు. సేవలకు లేదా సేవల ద్వారా యూజర్ కంటెంట్‌ను పోస్ట్ చేయడం ద్వారా, అటువంటి యూజర్ కంటెంట్‌కు సంబంధించి ఏదైనా వాణిజ్య లేదా ప్రచార సంబంధిత మెటీరియల్‌ను ముందస్తుగా తనిఖీ చేసే లేదా ఆమోదించే ఏవైనా హక్కులను మీరు మినహాయిస్తున్నారు. గోప్యత, పబ్లిసిటీల ఏవైనా లేదా అన్నీ హక్కులు లేదా మీ యూజర్ కంటెంట్‌ లేదా దానిలోని ఏదైనా భాగంతో సంబంధం ఉన్న అటువంటి ఏవైనా ఇతర హక్కులను కూడా మీరు తొలగిస్తున్నారు. ఎటువంటి నైతిక హక్కులు బదిలీ చేయదగవు లేదా అప్పగించదగవు అనే దాని మేరకు, సేవలకు లేదా సేవల ద్వారా మీరు పోస్ట్ చేసే ఏదైనా యూజర్ కంటెంట్‌కు సంబంధించి లేదా సదరు యూజర్ కంటెంట్‌లో మీరు కలిగి ఉండగల ఏవైనా నైతిక హక్కుల ఆధారంగా ఏదైనా చర్యను సమర్ధించే, నిర్వహించే లేదా అనుమతించేందుకు లేదా అన్నీ లేదా ఏదైనా నైతిక హక్కును మీరు ఇందుమూలంగా ఎప్పటికీ వదులుకుంటూ, అంగీకరిస్తున్నారు.

మా సేవలకు మీరు పోస్ట్ చేసిన లేదా అప్‌లోడ్ చేసిన ఏదైనా యూజర్ కంటెంట్‌ తమ మేథాశక్తి హక్కులను ఉల్లంఘిస్తున్నట్లు లేదా వారి గోప్యతా హక్కును ఉల్లంఘిస్తున్నట్లుగా దావా వేసే ఏదైనా తృతీయ పక్షానికి మీ గుర్తింపుని వెల్లడించే హక్కు కూడా మాకు ఉంది.

మేము, లేదా అధీకృత తృతీయ పక్షాలు, మా లేదా తమ స్వంత నిర్ణయం మేరకు మీ కంటెంట్‌ను కట్‌ చేసే, క్రాప్ చేసే, సవరించే లేదా ప్రచురించేందుకు తిరస్కరించే హక్కును కలిగి ఉంటాము. పైన “మా సేవలకు మీ ప్రవేశ సౌలభ్యత మరియు వాటి వినియోగం” లో వివరించిన కంటెంట్ ప్రమాణాలతో అనుగుణ్యంగా మీ పోస్ట్ లేదని మేము అభిప్రాయపడితే, మా సేవల మీద మీరు చేసే పోస్టింగులను వేటినైనా తొలగించే, నిరాకరించే, నిరోధించే లేదా తీసివేసే హక్కు మాకు ఉంది. అదనంగా, మా స్వంత నిర్ణయం మేరకు (i) ఈ నిబంధనలను ఉల్లంఘించేదిగా మేము పరిగణించే, లేదా (ii) మీకు ఎటువంటి నష్టం కలగకుండా, తెలిపిగానీ, తెలియజేయకుండా గానీ, తృతీయ పక్షాలు లేదా ఇతర యూజర్ల నుండి అందుకున్న ఫిర్యాదులకు సంబంధించిన ఎటువంటి యూజర్ కంటెంట్‌నైనా తొలగించే, నిరాకరించే, నిరోధించే లేదా తీసివేసేందుకు మాకు హక్కు ఉంటుంది కానీ అది మా బాధ్యత కాదు. ఫలితంగా, మీ వ్యక్తిగత పరికరం(ల)లో సేవలకు మీరు పోస్ట్ చేసే ఏదేని యూజర్ కంటెంట్‌కు శాశ్వత ప్రవేశ సౌలభ్యత మీకు ఉండేలా నిర్ధారించుకోవాలని మీరు అనుకుంటే, వాటి యొక్క నకళ్ళను భద్రపరచుకోవలసిందిగా మేము సిఫారసు చేస్తున్నాము. ఏదేని యూజర్ కంటెంట్‌ యొక్క ఖచ్చితత్వం, సమగ్రత, ఇమిడిక లేదా నాణ్యతకు మేము హామీ ఇవ్వము మరియు ఎటువంటి పరిస్థితులలోనూ ఏదేని యూజర్ కంటెంట్‌ కొరకు మేము ఏ రకంగానూ బాధ్యులము కాదు.

 సేవల మీది మీ యూజర్ కంటెంట్‌ను సేవల మీది ఇతర యూజర్లందరికీ బహిరంగంగా అందుబాటులో ఉంచాలా లేదా మీరు అనుమతించే కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉంచాలా అనే దానిని మీరు నియంత్రించవచ్చు.

 యూజర్లు సమర్పించిన మరియు మాచే లేదా అధీకృత తృతీయ పక్షాల చేత ప్రచురించబడిన ఏదైనా కంటెంట్‌కు సంబంధించి మేము ఎలాంటి బాధ్యతను స్వీకరించము.

ఇతర యూజర్ల చేత అప్‌లోడ్ చేయబడిన సమాచారం మరియు ఏదైనా మెటీరియల్స్ గురించి మీరు ఫిర్యాదు చేయాలనుకుంటే, దయచేసి మమ్మల్ని mailto:feedback@tiktok.com వద్ద సంప్రదించండి.

ఏదైనా ఉల్లంఘిత మెటీరియల్‌ గురించి మాకు సమాచారం వస్తే, మా సేవల నుండి దానిని తక్షణమే తొలగించేందుకు సహేతుకమైన చర్యలను టిక్‌టాక్ తీసుకుంటుంది. తగిన పరిస్థితులలో, తమ నిర్ణయం మేరకు, ఇతరుల కాపీరైట్లు లేదా మేథాశక్తిని మళ్ళీ మళ్ళీ ఉల్లంఘించే యూజర్ల ఖాతాలను నిలిపివేయడం లేదా రద్దు చేయడం అనేది టిక్‌టాక్ వారి పాలసీ.

మా స్వంత ఉత్పత్తి ఐడియాలు, విశేషాంశాలను అభివృద్ధి చేసి, విశ్లేషించడం మీద మా సిబ్బంది నిరంతరంగా పనిచేస్తుండగా, యూజర్ల సామాజిక వర్గం నుండి మేము పొందే ఆసక్తులు, అభిప్రాయాలు, వ్యాఖ్యాలు మరియు సలహాలపై మేము బాగా శ్రద్ధ వహించడం మాకు గర్వకారణం. ఉత్పత్తుల కొరకు ఏవైనా ఐడియాలను, సేవలు, విశేషాంశాలు, సవరణలు, మెరుగుదలలు, కంటెంట్, సంస్కరణలు, సాంకేతికతలు, కంటెంట్ ఆఫరింగులు (ఆడియో, విజువల్ గేమ్స్, లేదా కంటెంట్ యొక్క ఇతర రకాలు వంటివి), ప్రచారాలు, వ్యూహాలు, లేదా ఉత్పత్తి/విశేషాంశం పేర్లు, లేదా ఏదైనా సంబంధిత పత్రీకరణ, ఆర్ట్‌వర్క్, కంప్యూటర్ కోడ్, చిత్రాలు లేదా ఇతర మెటీరియల్స్ (సమిష్టిగా “అభిప్రాయ సేకరణ”)ను మాకు లేదా మా ఉద్యోగులకు పంపి, మాకు తోడ్పడాలని మీరు ఎంచుకుంటే, మీరు సహకరించే కమ్యూనికేషన్ ఏమి చెబుతుంది అన్న దానితో సంబంధం లేకుండా, దిగువ షరతులు వర్తిస్తాయి, కాబట్టి భవిష్యత్తులో అపార్ధాలు రాకుండా చూసుకోవచ్చు. తదనుగుణంగా, మాకు అబిప్రాయాలను పంపించడం ద్వారా, మీరు వీటికి అంగీకరిస్తున్నారు:

i. ఏ కారణం చేతనైనా మీ అభిప్రాయాన్ని పూర్తిగా గానీ లేదా అందులోని కొంత భాగాన్ని గానీ మీకు తిరిగి ఇచ్చేందుకు లేదా మీ అభిప్రాయాన్ని సమీక్షించి, పరిగణించి, లేదా అమలుచేసేందుకు టిక్‌టాక్‌కి ఎటువంటి బాధ్యతా ఉండదు.

ii. గోప్యతా-రహిత ఆధారంగా అభిప్రాయాలు ఇవ్వబడతాయి, మరియు మీరు పంపే ఏదైనా అభిప్రాయాన్ని రహస్యంగా ఉంచేందుకు లేదా ఏవిధంగానైనా దానిని ఉపయోగించడం లేదా వెల్లడించడం నుండి నిరోధించేందుకు మేము ఏ రకంగా బద్ధులము కాము; మరియు

iii. అభిప్రాయాన్ని పూర్తిగా గానీ లేదా అందులో కొంత భాగాన్ని గానీ, మరియు ఇచ్చింది ఇచ్చినట్లుగా లేదా సవరించినట్లుగా అమలు చేసేందుకు లేదా చేర్చేందుకు వాణిజ్య ఉత్పత్తులు మరియు సేవలను నిర్వహించడానికి, ఉపయోగించడానికి, విక్రయించడానికి, విక్రయాలను అందించడానికి, దిగుమతి చేసుకోవడానికి, ప్రచారం చేయడంతో సహా ఎటువంటి నిర్బంధాలు లేకుండా, ఉచితంగా మరియు ఏ తరహా ఆరోపణ లేకుండా మరియు ఎటువంటి ప్రయోజనార్ధం అభిప్రాయాన్ని మరియు దాని నుండి ఉత్పన్నమైన వాటిని పునరుత్పత్తి చేసేందుకు, పంపిణీ చేసేందుకు, ఉత్పాదిత పనులను రూపొందించడానికి, సవరించేందుకు, బహిరంగంగా ప్రదర్శించేందుకు (త్రూ-టు-ది-ఆడియన్స్ ఆధారంగా సహా), ప్రజలకు కమ్యూనికేట్ చేసేందుకు, అందుబాటులో ఉంచేందుకు, బహిరంగంగా ప్రదర్శించేందుకు మరియు ఇతరత్రా ఉపయోగించి, స్వలాభానికి వినియోగించేందుకు ఎడతెగని, అపరిమిత అనుమతిని మాకు తిరుగులేకుండా మంజూరు చేస్తున్నారు.

8. నష్టపరిహారం

ఈ షరతుల క్రింద మీ విధులు, ప్రాతినిధ్యం మరియు వారంటీల ఉల్లంఘన నుండి తలెత్తే లేదా ఈ షరతులు కలిగిన మీ ఖాతాను ఉపయోగించే ఎవరైనా యూజర్‌ గానీ మీరు గానీ ఉల్లంఘించిన కారణంగా తలెత్తే అటార్నీ వారి రుసుము మరియు ఖర్చులు మాత్రమే కాకుండా ఇంకా మరిన్నింటితో సహా ఏవైనా మరియు అన్నీ క్లెయింలు, లయబిలిటీలు, ధరలు, మరియు ఖర్చుల నుండి టిక్‌టాక్, దాని మూలాలు, సహాయకులు, మరియు అనుబంధకాలు మరియు వారి సంబంధిత అధికారులు, డైరెక్టర్లు, ఉద్యోగులు, ఏజెంట్లు మరియు సలహాదారులు ప్రతి ఒక్కరినీ కాపాడేందుకు, నష్టపరిహారం చెల్లించేందుకు మరియు హానిరహితంగా ఉంచేందుకు మీరు అంగీకరిస్తున్నారు.

9. వారంటీల మినహాయింపు

ఈ షరతులలో మీరు ఒప్పందప్రకారంగా అంగీకరించలేని లేదా మాఫీ చేయలేనిది ఏదీ కూడానూ శాసనబద్ధ హక్కులను వేటినీ ప్రభావితం చేయదు మరియు ఒక వినియోగదారుగా మీరు ఎల్లప్పుడూ చట్టపరంగా అర్హతను కలిగి ఉంటారు. సేవలు “ఉన్నవి ఉన్నట్లుగా” అందించబడతాయి మరియు వాటికి సంబంధించి ఎట్టువంటి వారంటీని గానీ, ప్రాతినిధ్యాన్ని గానీ మేము చేయము. క్రింది వాటి పట్ల ప్రత్యేకంగా ఎటువంటి ప్రాతినిధ్యాన్ని గానీ వారంటీని గానీ మేము మీకు చేయము.

 • సేవలను మీరు వినియోగించుకుంటే మీ అవసరాలు తీరతాయి;
 • సేవల మీ వినియోగం నిరంతరాయంగా, కాలానుగుణంగా, సురక్షతంగా లేదా లోపాలు లేకుండా ఉంటుంది; సేవలను మీరు వినియోగించుకోవడం ద్వారా మీరు పొందిన ఏదైనా సమాచారం ఖచ్చితంగా లేదా విశ్వసనీయంగా ఉంటుంది; మరియు
 • సేవలలో భాగంగా మీకు ఇవ్వబడిన ఏదైనా సాఫ్ట్‌వేర్‌లోని ఫంక్షనాలిటీ లేదా ఆపరేషన్‌లోని లోపాలు సరి చేయబడతాయి.

షరతులలో స్పష్టంగా బయల్పరచబడిన మేరకు తప్ప సేవలకు ఎటువంటి షరతులు, వారంటీలు లేదా (సంతృప్తికరమైన నాణ్యత, వివరణతో అనుగుణ్యత లేదా ప్రయోజనార్ధం సరైనది అనే అంతర్నిహిత షరతులతో సహా) ఇతర షరతులు వర్తించవు. ముందుగా చెప్పకుండా ఏ సమయంలోనైనా వ్యాపార మరియు ఆపరేషనల్ కారణాల కొరకు మా ప్లాట్‌ఫాంలోని అన్నీ లేదా ఏదైనా భాగాన్ని అందుబాటులో ఉంచడాన్ని మేము మార్చవచ్చు, నిలిపివేయవచ్చు, ఉపసంహరించుకోవచ్చు లేదా నిర్బంధించవచ్చు

10. ఉత్తరదాయిత్వ పరిధి

వర్తించే చట్టం ద్వారా బహుశా చట్టపరంగా పరిమితం చేయలేని లేదా మినహాయించలేని నష్టాల కొరకు మా ఉత్తరదాయిత్వాన్ని ఈ షరతులు ఏవీ పరిమితం చేయవు లేదా మినహాయించవు. వీటిలో మా నిర్లక్ష్యం కారణంగా లేదా మా ఉద్యోగులు, ఏజెంట్లు లేదా సబ్‌కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా జరిగిన మరణానికి లేదా వ్యక్తిగత గాయానికి మరియు మోసం లేదా వంచనతో కూడిన వక్రీకరణ కొరకు తీసుకునే బాధ్యత ఉంటాయి.

పై పేరాకు లోబడి, మేము క్రింది వాటి విషయంలో మీకు బాధ్యులము కాము:

 • (I) లాభానికి వాటిల్లిన ఏదైనా కొరత (ప్రత్యక్షంగా భరించినదైనా లేదా పరోక్షంగా భరించినదైనా); (II) ప్రతిష్టకు కలిగిన ఏదైనా భంగం; (III) అవకాశాలు కోల్పోవడం; (IV) మీరు భరించిన ఏదైనా సమాచార నష్టం; లేదా (V) మీరు బహుశా భరించిన ఏవైనా పరోక్ష లేదా పరిణామ నష్టాలు. మరేదైనా ఇతర నష్టం, గత 12 నెలలలో టిక్‌టాక్‌కు మీరు చెల్లించిన మొత్తానికి పరిమితమై ఉంటుంది.
 • క్రింది వాటి ఫలితంగా మీరు బహుశా భరించిన ఏదైనా నష్టం లేదా హాని:
 • మీకు మరియు సర్వీస్ మీద ఎవరిదైతే ప్రకటన కనిపిస్తుందో సదరు అడ్వర్టైజర్‌ లేదా స్పాన్సర్‌కు మధ్య ఏదైనా సంబంధం లేదా లావాదేవీ ఫలితంగా లేదా ఏదైనా ప్రకటన యొక్క పరిపూర్ణత, ఖచ్చితత్వం లేదా ఉనికి మీద మీరు ఉంచిన ఏదైనా భరోసా;
 • సేవలకు మేము బహుశా చేసే ఏవైనా మార్పులు, లేదా సేవలను అందించడంలో (లేదా సేవలలోని ఏవైనా విశేషాంశాల) ఏదైనా శాశ్వత లేదా తాత్కాలిక నిలిపివేత కొరకు;
 • మీరు సేవలను వినియోగించడం ద్వారా లేదా వాటి ద్వారా ప్రసారం చేయబడిన లేదా నిర్వహించబడిన ఏదైనా కంటెంట్ లేదా ఇతర కమ్యూనికేషన్స్ డేటాను తొలగించడం, పాడవడం లేదా స్టోర్ చేసేందుకు విఫలం కావడం;
 • మరొక యూజర్ యొక్క నడవడి లేదా ఏదైనా చర్య;
 • ఖచ్చితమైన ఖాతా సమాచారాన్ని మాకు అందించడంలో మీ వైఫల్యం;
 • లేదా మీ పాస్‌వర్డ్‌ను లేదా ఖాle వివరాలను భద్రంగా, గోప్యంగా ఉంచుకోవడంలో మీ వైఫల్యం.

జాతీయమరియుప్రైవేట్వినియోగానికిమాత్రమేమాప్లాట్‌ఫాంనుమేముఅందిస్తామనిదయచేసిగమనించండి. ఎటువంటివాణిజ్యలేదావ్యాపారప్రయోజనాలకొరకుమాప్లాట్‌ఫాంనుఉపయోగించరనిమీరుఅంగీకరిస్తున్నారు, లాభాలనుకోల్పోవడం, వ్యాపారంలోదివాలాతీయడం, ప్రతిష్ఠాభంగంలేదావ్యాపారకీర్తిప్రతిష్ఠలనుకోల్పోవడం, వ్యాపారంలోఅంతరాయం, లేదావ్యాపారఅవకాశాన్నికోల్పోవడంవంటివాటికొరకుమేముమీకుబాధ్యులంకాదు.

సహేతుకమైన జాగ్రత్త మరియు నైపుణ్యాన్ని ఉపయోగించడంలో మా వైఫల్యం కారణంగా మేము సప్లై చేసిన దోషపూరిత డిజిటల్ కంటెంట్ ఒక పరికరాన్ని లేదా మీకు సంబంధించిన డిజిటల్ కంటెంట్‌ను పాడు చేస్తే, మేము ఆ డ్యామేజీని రిపైర్ చేస్తాము లేదా నష్టపరిహారం చెల్లిస్తాము. అయితే, మీకు ఉచితంగా అందించబడిన నవీకరణను అప్లై చేయమని మేము ఇచ్చిన సూచనను పాటించకపోవడం వలన జరిగిన డ్యామేజీకి లేదా ఇన్స్టలేషన్ సూచనలను సరిగ్గా పాటించడంలో లేదా మేము సూచించిన కనీస సిస్టం ఆవశ్యకతలను సరిగ్గా ఉంచుకోవడంలో మీరు విఫలం కావడం వలన జరిగిన డ్యామేజీకి మేము బాధ్యులం కాదు.

తలెత్తుతున్న అటువంటి ఏ నష్టాల సంభావ్యత గురించి మాకు తెలిసినా తెలియకున్నా లేదా మేము మీకు సలహాలు అందించినా అందించకున్నా మా బాధ్యత మీది ఈ పరిమితులు మీకు వర్తిస్తాయి.

మా సేవను మీరు వినియోగించుకున్నప్పుడు బహుశా వర్తించే ఎటువంటి మొబైల్ ఛార్జీలనైనా మీరే భరించాలి. వీటిలో టెక్స్ట్-సందేశాలు మరియు డేటా ఛార్జీలు ఉంటాయి. ఆ ఛార్జీలు ఏమై ఉండవచ్చు అన్నది మీకు ఖచ్చితంగా తెలియకపోతే, సేవను ఉపయోగించడానికి ముందు మీ సేవా ప్రదాలను మీరు అడగాలి.

పరిమితుల ద్వారా కాకుండా, ఉదాహరణ మార్గంతో సహా, సేవలను మీరు వినియోగించడం ద్వారా తలెత్తేటటువంటి ఏదైనా తృతీయ పక్షంతో మీ వివాదం, చట్టం అనుమతించిన మేరకు, మీకు మరియు అటువంటి తృతీయ పక్షానికి మధ్య నేరుగా ఉన్న ఏదైనా వాహకం, కాపీరైట్ యజమాని లేదా ఇతర యూజర్‌ ఎవరైనా, మరియు మీరు, అటువంటి వివాదాల ద్వారా తలెత్తిన లేదా వాటితో ఏ రకంగానైనా అనుసంధానమై ఉన్నటువంటి, తెలిసిన, తెలియని దావాలు అన్నీ లేదా అన్నింటి నుండి, సహజ మరియు అన్నీ రకాల డిమాండ్లు, (వాస్తవ మరియు పరిణామపూర్వక) డ్యామేజీల నుండి మమ్మల్ని మరియు మా అనుబంధకులను మీరు శాశ్వతంగా విముక్తులను చేస్తున్నారు.

11. ఇతర షరతులు

a. వర్తించే చట్టం మరియు న్యాయపరిధి. న్యాయపరిధి నిర్దిష్ట అనుబంధిత షరతులకు లోబడి- ఈ షరతులు, వాటి అంశాలు, వాటి నిర్మాణం, భారత చట్టాల చేత నడిపించబడతాయి. ఈ నియమాల ఉనికి, వ్యాలిడిటీ లేదా రద్దుకు సంబంధించిన ఏదైనా ప్రశ్నతో సహా ఈ నియమాల నుండి లేదా వీటితో తలెత్తే ఏదైనా వివాదం, ఆర్బిట్రేషన్న్ అండ్ కన్సిలియేషన్ చట్టం, 1996 మరియు ఎప్పటికప్పుడు దానికి చేసే ఏవేని సవరణల ప్రకారంగా ఆర్బిట్రేషన్‌కి సూచించబడి, చివరగా వారి ద్వారా పరిష్కరించబడవలెను, అటువంటి ఆర్బిట్రేషన్ యొక్క వేదిక ఢిల్లీ కావలెను.

b. ఓపెన్ సోర్స్. ప్లాట్‌ఫాంలో నిర్ధిష్ట ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ ఉంటుంది. ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌లోని ప్రతి అంశం తమకు స్వంతంగా వర్తించే లైసెన్స్ నియమాలకు అనుగుణంగా ఉంటుంది. దీనిని మీరు ఓపెన్‌ సోర్స్ పాలసీ వద్ద చూడవచ్చు.

cపూర్తి ఒప్పందం. ఈ నియమాలు (క్రింది అనుబంధిత నియమాలతో కూడి) మీకు మరియు టిక్‌టాక్‌కు మధ్య పూర్తి చట్టబద్ధమైన ఒప్పందాన్ని కుదురుస్తాయి మరియు మీ సేవల ఉపయోగాన్ని నడిపిస్తాయి మరియు సేవలకు సంబంధించి మీకు మరియు టిక్‌టాక్‌కు మధ్య ఉన్న గత ఒప్పందాలను వేటినైనా పూర్తిగా రిప్లేస్ చేస్తాయి.

d. లింకులు. మా ప్రతిష్ఠకు భంగం వాటిల్లనీయకుండా లేదా దాన్ని అదునుగా తీసుకోకుండా, న్యాయంగా, చట్టపరమైన మార్గంలో మీరు మా హోం పేజీకి లింకు చేసుకోగలిగితే చేసుకోవచ్చు. అసోసియేషన్, మా వైపు నుండి అనుమతి లేదా ఆమోదం వంటివి లేని వాటిని వేటినైనా సూచించే విధంగా మీరు లింకును రూపొందించకూడదు. మీ స్వంతం కానటువంటి ఏదేని వెబ్‌సైట్‌లో మా సేవలకు ఒక లింకును మీరు రూపొందించరాదు. పైన ఉన్న “మా సేవలకు మీ ప్రవేశ సౌలభ్యత మరియు వాటి వినియోగం” లో బయల్పరచిన కంటెంట్ ప్రమాణాలతో అన్ని విధాలా మీరు ఏ వెబ్‌సైట్‌లో లింక్ చేస్తున్నారో అది అనుగుణంగా ఉండాలి. ముందుగా తెలియజేయకుండా లింక్ చేసే అనుమతిని ఉపసంహరించుకునే హక్కు మా ప్రత్యేకం.

e. వయో పరిమితి. 13 సంవత్సరాలు మరియు అంతకు పైబడిన వారికి మాత్రమే (న్యాయపరిధి నిర్దిష్ట – అనుబంధిత షరతులలో బహుశా పేర్కొన్న అదనపు పరిమితులతో) సేవలు. సేవలను ఉపయోగించడం ద్వారా, ఇక్కడ నిర్దేశించిన సంబంధిత వయస్సుకన్నా పై బడిన వారేనని మీరు నిర్ధారిస్తున్నారు. పైన నిర్దేశించబడిన సంబంధిత వయస్సు కన్నా క్రింది వారెవరైనా సేవలను వినియోగిస్తున్నారని మాకు తెలిస్తే, యూజర్ ఖాతాను మేము రద్దు చేస్తాము.

f. ఎటువంటి మాఫీ లేదు. ఈ నియమాలలోని నిబంధనను దేన్నైనా అమలు చేయడంలో లేదా పట్టుబట్టడంలో మా వైఫల్యం ఏదేని నిబంధన లేదా హక్కును వదులుకున్నట్లుగా చిత్రించబడరాదు.

g. భద్రత. మా సేవలు సురక్షతమైనవని లేదా బగ్స్ లేదా వైరస్‌లు లేనివని మేము హామీ ఇవ్వము. మా సేవలను యాక్సెస్ చేసేందుకు ప్లాట్‌ఫాంను, కంప్యూటర్ ప్రోగ్రాంలను మరియు మీ సమాచార సాంకేతికతను కాన్ఫిగర్ చేసుకోవడం, మీ బాధ్యత. మీ స్వంత వైరస్ ప్రొటెక్షన్ సాఫ్ట్‌వేర్‌ను మీరు ఉపయోగించరాదు.

h. వేరుపరచగలగడం. ఈ విషయంలో నిర్ణయించేందుకు న్యాయపరిధి కలిగిన ఏదైనా న్యాయస్థానం ఈ షరతుల యొక్క ఏదైనా నిబంధన చెల్లుబాటయ్యేది కాదని శాసిస్తే, మిగిలిన షరతులను ప్రభావితం చేయకుండా షరతుల నుండి సదరు నిబంధన తొలగించబడుతుంది, మరియు షరతులలోని మిగిలిన నిబంధనలు చెల్లుబాటు అయ్యేవిగా, అమలు చేయవలసినవిగా కొనసాగుతాయి.

భారతదేశంలో గ్రీవెన్స్ అధికారి

మా ప్రొడక్టు వినియోగదారు ఎదుర్కున్న ఏదేని ఫిర్యాదు లేదా ఇతర సమస్యను ఇమెయిల్ ద్వారా క్రింది చిరునామాకు బహుశా సమర్పించవచ్చు. ఫిర్యాదులో ఇవి ఉండాలి: (i) సంబంధిత ఖాతాదారు యొక్క యూజర్‌పేరు (ii) ఆందోళన చెందిస్తున్న నిర్దిష్ట కంటంట్/వీడియో మరియు (iii) అటువంటి తీసుకున్న అభ్యర్ధన కొరకు కారణం(లు).

సమాచార సాంకేతికత చట్టం 2000 మరియు దాని క్రింద చేయబడిన నియమాలతో అనుగుణంగా, గ్రీవెన్స్ అధికారి యొక్క సంప్రదింపు వివరాలు దిగువన ఇవ్వబడ్డాయి:

శ్రీ అనూజ్ భాటియా

ఇమెయిల్: mailto:grievance.officer@tiktok.com

ప్రత్యామ్నాయంగా, ఉల్లంఘపరిచే ఏదేని కంటెంట్ మీదనైనా యాప్‌లోని కంటెంట్‌ను ఫిర్యాదు చేయండిని ఉపయోగించి కూడా మీరు కంటెంట్‌ను ఫిర్యాదు చేయవచ్చు.

అనుబంధిత షరతులు – న్యాయపరిధి నిర్దిష్టమైనవి

భారతదేశం. మీరు మా సేవలను భారత్‌లో ఉపయోగిస్తున్నట్లైతే, క్రింది అదనపు షరతులు వర్తిస్తాయి. క్రింది అదనపు షరతులు మరియు ఈ షరతుల ప్రధాన సంఘ నిబంధనల మధ్య ఏదైనా విభేదం ఏర్పడితే, దిగువ షరతులు అమలు కావలెను.

 • షరతులను అంగీకరించడం. ఈ షరతులను అంగీకరించడం ద్వారా, మా సేవలను వినియోగించం లేదా యాక్సెస్ చేయడం ద్వారా, ఈ షరతులను మీరు చదివి, అర్ధం చేసుకున్నారని మీరు అంగీకరిస్తున్నారు, ఈ షరతులు మరియు మా గోప్యతా విధానం మరియు కమ్యూనిటీ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండేందుకు మీ సమ్మతిని అందిస్తున్నారు.
 • మా సేవలకు మీ ప్రవేశ సౌలభ్యత మరియు వినియోగం. క్రింది ఎటువంటి యూజర్ కంటెంట్‌నైనా అప్‌లోడ్ చేసేందుకు, ప్రసారం చేసేందుకు, పంపిణీ చేసేందుకు, భద్రపరచేందుకు లేదా ఇతరత్రా (కంటెంట్‌ను రూపొందించి మరియు/లేదా స్ట్రీం చేసే ప్రయోజనాలతో సహా) ఏ విధంగానూ అందుబాటులో ఉంచేందుకు సేవలను మీరు బహుశా ఉపయోగించరు.
  • అశ్లీల, బూతువ్రాతలతో కూడిన, పేడోఫిలిక్ కంటెంట్;
  • మనీలాండరింగ్ లేదా జూదం లేదా చట్ట విరుద్ధమైన ఇతరత్రా ఏదేనీ కార్యకలాపానికి సంబంధించిన లేదా ప్రోత్సహించే కంటెంట్;
  • మైనర్లకు హాని కలిగించగల కంటెంట్;
  • సహజంగా ప్రమాదకరమైన లేదా న్యాయవిరుద్ధమైన ఏదేనీ సమాచారాన్ని కమ్యూనికేట్ చేసే లేదా అటువంటి సందేశాల మూలం గురించి చిరునామాదారును తప్పుదోవ పట్టించే లేదా వంచించే కంటెంట్; లేదా
  • భారతదేశ ఐక్యతను, సమగ్రతను, సంరక్షణను, భద్రతను లేదా సర్వాధికారాన్ని, విదేశీ రాష్ట్రాలతో స్నేహ సంబంధాలను, లేదా పబ్లిక్ ఆర్డర్‌ను భపెట్టే, లేదా ఏదైనా కేసుపెట్టదగిన నేరాన్ని నడిపించేదుకు ప్రేరేపణనిచ్చే, లేదా ఏదేని నేర విచారణను సంరక్షించే లేదా ఏదైనా ఇతర దేశాన్ని అవమానపరచే కంటెంట్.
 • యూజర్–రూపొందించిన కంటెంట్.  (భారతీయ) కాపీరైట్ చట్టం, 1957లోని సెక్షన్ 30 ఎ నిబంధనల క్రింద లేదా ఇతర వర్తించే చట్టాల క్రింద ఏదేని హక్కుతో సహా, ఈ షరతుల క్రింద మాకు కేటాయించబడిన లేదా లైసెన్స్ ఇవ్వబడిన హక్కులకు సంబంధించి ఏదేనీ కాపీరైట్ బోర్డుతో సహా ఏదేని అధికార వర్గం ముందర ఏదేనీ అభ్యంతరాన్ని లేదా ఇతర క్లెయింను లేవనెత్తే ఏదైనా హక్కును మీరు ఇందుమూలంగా తిరుగులేకుండా వదులుకుంటున్నారు. టిక్‌టాక్ మరియు వారి కంపెనీల సమూహం, అనుబంధకులు, ప్రస్తుత లేదా భవిష్యత్తులో ఎప్పుడైనా హక్కులో మరియు ఇంటరెస్ట్‌లో ఉత్రాధుకారులు అందరి అనుకూల పక్షమున పై మాఫీ మా ద్వారా మంజూరు చేయబడింది., 
 • నష్టపూర్తి. ఈ షరతుల ప్రకారం లేదా న్యాయ స్థానం ద్వాా ఇవ్వబడిన ఏదైనా ఆదేశం లేదా తీర్పు ప్రకారం మీరు మాకు నష్టపూర్తి చేయవలసిన పక్షంలో, మాకు ఇచ్చే అటువంటి మొత్త యొక్క రెమిటెన్స్ కొరకు నియంత్రణాధికారుల నుండి అన్నీ అవసరమైన ఆమెదాలు మరియు సమ్మతులు మీరు పొందుతారు.