గోప్యతా విధానం
1.మేము సేకరించే వివరాల శ్రేణి
మేము మీ గురించి దిగువ సమాచారాన్ని సేకరించి, వినియోగించవచ్చు:
- మీరు మాకందించే సమాచారం. ప్లాట్‌ఫాం కొరకు నమోదు చేసుకునేటప్పుడు మరియు/లేదా దానిని వినియోగించేటప్పుడు, మీ పేరు, వయస్సు, లింగము, చిరునామా, ఈమెయిల్ చిరునామా, సామాజిక ప్రసార మాధ్యమం (సోషల్ మీడియా) లాగిన్ వివరాలు, టెలిఫోన్ నెంబరు, ఆర్ధిక సంబంధిత మరియు క్రెడిట్ కార్డు సమాచారం మరియు మీ ఫోటోగ్రాఫ్ అలాగే మీరు ఎంచుకునే భాషతో సహా వాటికి సంబంధించిన సమాచారాన్ని మీరు మాకు అందిస్తారు. అదనంగా, మీ వినియోగదారు వివరాలు, (యూజర్ రూపొందించిన ఏదైనా సమాచారానికి మీ వంతుగా అందించే ఏవైనా పరోక్ష అంశాలతో సహా) మీరు మా ప్లాట్‌ఫాంపై చేసే వ్యాఖ్యలు, ఖాతా మరియు బిల్లింగ్ వివరాలు, నగదును చెల్లించవలసిన లేదా తీసుకొనవలసిన అవసరం ఉన్న ప్రతి చోట మీ యాపిల్, గూగుల్ లేదా విండోస్ ఖాతా, పేపాల్ లేదా ఇతర తృతీయ-పక్షపు చెల్లింపు ఛానెల్ ఖాతాలతో సహా, వీటికి మాత్రమే పరిమితం కాకుండా అన్నీ కూడా ఇందులో ఉంటాయి. మీ ప్లాట్‌ఫాం మీద ప్రసారం చేసేందుకు మీరు ఎంచుకునే యూజర్-రూపొందిత సమాచారం, ఫోటోగ్రాఫ్‌లు, వీడియో అంశాలు కూడా ఇందులో ఉంటాయి. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లేదా గూగుల్ వంటి కొన్ని సామాజిక మాధ్యమాల సైట్లకు కూడా మీ క్రెడెన్షియల్స్‌ను ఉపయోగించి మీరు నమోదు చేసుకోగలరు. మీ దేశంలోని చట్టాల ఆధారంగా సెన్సిటివ్‌గా లేదా క్రిటికల్‌గా పరిగణించబడే నిర్దిష్ట సమాచారాన్ని మీతో పంచుకునేందుకు మీరు ఎంచుకోవచ్చు. సదరు చట్టానికి అనుగుణంగా ప్రత్యేక పరిరక్షణలకు లోబడి సదరు సమాచారం ఉండవచ్చు.
- మీ సామాజిక నెట్వర్కుల నుండి పంచుకునేందుకు మీరు ఎంచుకునే సమాచారం. మీ సామాజిక నెట్వర్కును లేదా పబ్లిక్ ఫోరం ఖాతా (ఉదా: ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాం, లేదా గూగుల్)ను ప్లాట్‌ఫాంకు అనుసంధానం చేయడానికి మీరు ఎంచుకుంటే, మీ సామాజిక నెట్వర్క్ లేదా పబ్లిక్ ఫోరం ఖాతాల నుండి మీ పరిచయాల జాబితాతో సహా సమాచారాన్ని మీరు అందిస్తారు లేదా మాకు అందించేందుకు మీ సామాజిక నెట్వర్కును మీరు అనుమతిస్తారు. సదరు ప్లాట్‌ఫాంలు మరియు/లేదా సామాజిక నెట్వర్కుల మీద ప్లాట్‌ఫాంను మీరు ఉపయోగించడానికి సంబంధించిన సమాచారం వీటిలో ఉంటుంది. మీ వివరాలను సామాజిక నెట్వర్కు ఎలా మరియు ఏ ప్రయోజనం కొరకు ప్రాసెస్ చేస్తుంది వంటి తదుపరి సమాచారం కొరకు, ఈ సామాజిక నెట్వర్క్ ప్రదాతల యొక్క సంబంధిత గోప్యతా విధానాలను దయచేసి చూడండి.
- మీ గురించి మేము సేకరించే సాంకేతిక సమాచారం. మీరు ప్లాట్‌ఫాంను ఉపయోగించినప్పుడు మేము ఆటోమ్యాటిక్‌గా నిర్దిష్ట సమాచారాన్ని సేకరిస్తాము, వాటిలో ఐపి అడ్రస్, లొకేషన్ సంబంధిత వివరాలు (క్రింద విశదపరచిన విధంగా) లేదా ఇతర యునిక్ డివైస్ ఐడెంటిఫయర్లు, మీరు ఏమేమి బ్రౌజ్ చేశారు (ప్లాట్‌ఫాంలో మీరు చూసిన అంశాలతో సహా), కుకీస్ (క్రింద నిర్వచించినట్లుగా), మీ మొబైల్ వాహకం, టైంజోన్ సెట్టింగు, మీ పరికరం మోడల్, మీ స్క్రీన్ రిజల్యూషన్, ఆపరేటింగ్ సిస్టం, ప్లాట్‌ఫాంలతో సహా మొబైల్ లేదా పరికర సమాచారం, మీరు ప్లాట్‌ఫాంను వినియోగించడానికి సంబంధించిన సమాచారం ఉంటాయి.
- మీరు సమాచారాన్ని వినియోగించడం గురించి మేము సేకరించే వివరాలు సేవలను మీరు వినియోగించడానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మేము సేకరిస్తాము, ఉదాహరణకు మా ప్లాట్‌ఫాం మీద మీ వ్యాఖ్యలు లేదా మా ప్లాట్‌ఫాం ద్వారా రూపొందించి, ప్రసారం చేసే యూజర్-రూపొందిత ఇతర అంశాలు మరియు వీడియో అంశాలు ఏవైనా సరే. అదనంగా, మీ ఈమెయిల్ లేదా సామాజిక మాధ్యమ లాగిన్ వివరాలను ఉపయోగించి, మీ పరికరాలన్నింటిలో మా ప్లాట్‌ఫాం మీద మీరు చేసే కార్యకలాపాలతో మీ సంప్రదింపును లేదా సబ్‌స్క్రైబర్ సమాచారాన్ని మేము అనుసంధానం చేస్తాము. మేము ఎంగేజ్మెంట్ స్కోర్లను (లైక్‌లు, వ్యాఖ్యలు, పునఃవీక్షణలు వంటివి) మరియు సంబంధిత యూజర్లను ప్లాట్‌ఫాం మీద మీ నడవడి ఆధారంగా సేకరిస్తాము. మీరు మా ప్లాట్‌ఫాంను ఉపయోగించినప్పుడు, దాని మీద వ్యాఖ్య చేయకపోయినా లేదా దాని మీద ఎటువంటి విషయాన్ని అప్లోడ్ చేయకుండా, ఊరికే దాని మీద బ్రౌజ్ చేస్తూ ఉన్నప్పుడు సైతం, వీక్షణా సమాచారాన్ని లేదా సాధారణ నడవడి సంబంధిత ప్యాటర్న్‌లను మేము సేకరిస్తాము. చివరగా, ఎంపికలు, కమ్యూనికేషన్ ప్రాధాన్యతలను సేకరిస్తాము.
- లొకేషన్ వివరాలు. ఒక మొబైల్ పరికరం మీద మీరు ప్లాట్‌ఫాంను ఉపయోగిస్తున్నప్పుడు, మేము మీరు ఉన్న ప్రాంతాన్ని గురించిన సమాచారాన్ని సేకరించవచ్చు. మీ సమ్మతితో, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జిపిఎస్) వివరాలు, మొబైల్ పరికరం ఉన్న ప్రాంతం సమాచారాన్ని కూడా మేము సేకరించవచ్చు.
- తృతీయ పక్షాల నుండి సమాచారం. మేము ఆపరేట్ చేసే ఇతర వెబ్సైట్లు లేదా మేము అందించే ఇతర సేవలలో వేటినైనా మీరు ఉపయోగించినట్లైతే, తృతీయ పక్షాల నుండి మీ గురించిన సమాచారాన్ని మేము పొందుతాము. (అడ్వర్టైజింగ్ నెట్వర్కులు, విశ్లేషణా ప్రదాతలు వంటి) తృతీయ పక్షాల నుండి మరియు బిజినెస్ డైరెక్టరీలు మరియు వాణిజ్యపరంగా లేదా బహిరంగంగా అందుబాటులో ఉన్న ఇతర వనరులతో సహా, ఇతర వనరులు అన్నింటి నుండి కూడా మేము సమాచారాన్ని పొందుతాము.
- మీ పోన్ మరియు ఫేస్బుక్ పరిచయాలు. (i) మీ ఫోన్ పరిచయాల ద్వారా గానీ లేదా (ii) ఫేస్బుక్ పరిచయాల ద్వారా గానీ ప్లాట్‌ఫాం మీది ఇతర యూజర్లను కనుగొనేందుకు మీరు ఎంచుకోవచ్చు. మీ ఫోన్ పరిచయాల ద్వారా ఇతర యూజర్లను కనుగొనేందుకు గనక మీరు ఎంచుకొని ఉంటే, పేర్లు, ఫోన్ నెంబర్లు, చిరునామాలు మరియు ప్లాట్‌ఫాం మీద ప్రస్తుతం ఉన్న యూజర్లతో వారిని మ్యాచ్ చేయడం ద్వారా వారు ప్లాట్‌ఫాంను ఉపయోగిస్తున్నారా అన్నది నిర్ధారించుకునే నిమిత్తం మీ పరిచయాల గురించి మీ ఫోన్లో మీరు భద్రపరచిన ఏదైనా ఇతర సమాచారంతో సహా మేము మీ ఫోన్లోని పరిచయాలను సేకరిస్తాము. మీ ఫేస్బుక్ పరిచయాల ద్వారా ఇతర యూజర్లను మీరు కనుక్కోవాలనుకుంటే, మీ ఫేస్బుక్ ఖాతా యొక్క బహిరంగ సమాచారాన్ని, అలాగే మీ ఫేస్బుక్ పరిచయాల పేర్లు, ప్రొఫైల్స్‌ను మేము సేకరిస్తాము.
- సందేశాలు. మా సేవల మెసేజింగ్ ఫంక్షనాలిటీని ఉపయోగించి, సందేశాలను (అంటే కంటెంట్, అలాగే సందేశం ఎప్పుడు పంపించబడింది, అందుకోబడింది మరియు/లేదా చదవబడింది మరియు సదరు కమ్యూనికేషన్లో ఎవరెవరు ఉన్నారు అనే వాటి గురించిన సమాచారాన్ని) రూపకల్పన చేయడంలో, పంపడంలో, లేదా అందుకునే విషయంలో ఏదైనా వ్యక్తిగత సమాచారంతో సహా మీరు అందించే సమాచారాన్ని మేము సేకరించి, ప్రాసెస్ చూస్తాము (ఇందులో స్కాన్ చేయడం, విశ్లేషించడం ఉంటాయి). మా సేవను వినియోగించుకునే ఇతర యూజర్లకు పంపిన సందేశాలకు ఆయా ఇతర యూజర్లు ప్రవేశ సౌలభ్యాన్ని కలిగి ఉంటారు మరియు ఆయా యూజర్లు సందేశాలను ఏ విధంగా ఉపయోగిస్తారు లేదా వెల్లడిస్తారు అనే విషయంలో మేము బాధ్యత వహించమని దయచేసి గ్రహించండి.
- మెటాడేటా. ప్లాట్‌ఫాంలో మీరు ఒక వీడియోను అప్లోడ్ చేసినప్పుడు (“యూజర్ కంటెంట్”), యూజర్ కంటెంట్‌తో అనుసంధానంగా ఉండే నిర్దిష్ట మెటాడేటాను మీరు ఆటోమ్యాటిక్‌గా అప్లోడ్ చేస్తారు. ముఖ్యంగా, మెటాడేటా అనేది ఇతర వివరాలను విశదపరిచి, మీ యూజర్ కంటెంట్ గురించిన సమాచారాన్ని అందిస్తుంది, అది ఎప్పుడూ వీక్షించేవారికి వ్యక్తం కాదు. మీ వీడియోతో అనుసంధానంగా ఉండే మెటాడేటా, సదరు యూజర్ కంటెంట్ ఎలా, ఎప్పుడు, ఎవరి ద్వారా సేకరించబడింది మరియు ఆ కంటెంట్ ఎలా ఫార్మాట్ చేయబడింది అనే దానిని విశపరచగలదు. దానిలో ఇంకా మీ ఖాతా పేరు వంటి సమాచారం కూడా ఉంటుంది, తద్వారా ఇతర యూజర్లు వీడియో ద్వారా మీ యూజర్ ఖాతా జాడ కనుగొనగలరు. మెటాడేటాలో ఇంకా వీడియోతో బాటుగా అందించేందుకు మీరు ఎంచుకున్న అదనపు వివరాలు కూడా ఉంటాయి, ఉదాహరణకు, వీడియోకు కీలక పదాలను మార్క్ చేసేందుకు ఉపయోగించే ఏవైనా హ్యాష్‌ట్యాగ్‌లు లేదా వ్యాఖ్యలు వంటివి.
- లావాదేవీ వివరాలు. ఇన్-యాప్ కొనుగోళ్ళ ద్వారా కాయిన్ ప్యాక్‌లను కొనుగోలు చేసేందుకు మీరు ఎంచుకోవచ్చు. పరోక్ష బహుమతులను కొనుగోలు చేసి, ఇతర యూజర్లను తమ ఛానెళ్ళలో లేదా ప్రత్యక్ష ప్రసారాల సమయంలో సపోర్ట్ చేసేందుకు, వాటిని వారికి పంపించడానికి ఈ కాయిన్లను మీరు ఉపయోగించవచ్చు. కాయిన్లను కొనడానికి మీరు ఎంచుకున్నప్పుడు, కొనుగోలును పూర్తి చేయడానికి మీ మొబైల్ పరికరంలో మీ యాప్ స్టోర్‌కు మీరు బదిలీ చేయబడతారు. ఈ కొనుగోలుతో అనుసంధానంగా, మేము మీ నుండి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తాము. అంతే కాకుండా, మీ యాపిల్ ఐట్యూన్స్ లేదా గూగుల్ ప్లే ఖాతాను ఉపయోగించి గిఫ్ట్ పాయింట్ విధానానికి అనుగుణంగా మీరు ఏవైనా గిఫ్ట్ పాయింట్లను కొనుగోలు చేస్తే, చెల్లింపు నిర్ధారణను మేము ప్రాసెస్ చేసి, మీ ఖాతాను క్రెడిట్ చేస్తాము.
2.కుకీస్
ప్లాట్‌ఫాంను ఉపయోగించడంలో మీ అనుభవాన్నిమరింత పెంపొందించేందుకు, మా సేవలను మెరుగుపరచేందుకు లక్షిత అడ్వర్టైజింగ్ను మీకు అందించేందుకు కుకీస్ మరియు అటువంటి ఇతర సాంకేతికతలను (ఉదా. వెబ్ బెకాన్స్, ఫ్లాష్ కుకీస్, మొదలైనవి) మేము ఉపయోగిస్తాము. కుకీస్ అనేవి చిన్న ఫైల్స్, వీటిని మీ పరికరంలో ఉంచినప్పుడు, నిర్దిష్ట విశేషాంశాలు, ఫంక్షనాలిటీని అందించడంలో అవి మాకు తోడ్పడతాయి. ప్లాట్‌ఫాంను, బైట్‌డ్యాన్స్ ద్వారా అందించబడిన ఇతర ప్లాట్‌ఫాంను లేదా ఉత్పత్తులను, బైట్‌డ్యాన్స్ ఉత్పత్తులను ఉపయోగించే ఇతర కంపెనీల ద్వారా అందించబడిన వెబ్సైట్లు మరియు యాప్‌లను మీరు సందర్శించినప్పుడు, మేము మీ పరికరంలో కుకీస్ ఉంచుతాము
మేము క్రింది కుకీస్ ఉపయోగిస్తాము:
- ఖచ్చితంగా అవసరమైన కుకీస్. ప్లాట్‌ఫాం నిర్వహణ కొరకు అవసరమైన కుకీస్ ఇవి. ఉదాహరణకు, ప్లాట్‌ఫాం యొక్క సురక్షత ప్రదేశాలలోకి మీరు లాగిన్ కావడంలో తోడ్పడే కుకీస్ వీటిలో ఉంటాయి.
- ఫంక్షనాలిటీ కుకీస్. ప్లాట్‌ఫాంకు మీరు తిరిగి వచ్చినప్పుడు మిమ్మల్ని గుర్తించేందుకు ఈ కుకీస్ ఉపయోగించబడతాయి. మీ కోసం మీ కంటెంట్‌ను వ్యక్తిగతీకరించడంలో, మిమ్మల్ని మీ పేరున ఆహ్వానించడంలో, మీ ప్రాధాన్యతలను గుర్తుంచుకోవడంలో (ఉదాహరణకు, మీరు ఎంచుకున్న భాష లేదా ప్రాంతం) మాకు సహాయపడుతుంది. ప్లాట్‌ఫాంలో లాగిన్ ఫంక్షన్‌ను ఈ కుకీస్ 90 రోజుల పాటూ సపోర్ట్ చేస్తాయి.
- సామాజిక మాధ్యమ కుకీస్. తమ ప్రస్తుత లాగిన్ ఉపయోగించి ఇతర సేవల (ఉదాహరణకు ఫేస్బుక్, గూగుల్ మొదలైనవి) కొరకు ప్లాట్‌ఫాం మీద ఒక ఖాతాను రూపొందించడంలో యూజర్లకు ఈ కుకీస్ తోడ్పడతాయి.
- పెర్ఫార్మెన్స్ కుకీస్. ప్లాట్‌ఫాంకు మీరు వెళ్ళిన సందర్భాలు, మీరు చూసిన పేజీలు, మీరు ఫాలో అయిన లింకులు, ఇతర వెబ్సైట్లు లేదా అప్లికేషన్లతో మీ పరస్పర క్రియలతో సహా అన్నింటిని గురించిన సమాచారాన్ని సేకరించేందుకు ఈ కుకీస్ ఉపయోగించబడతాయి. ప్లాట్‌ఫాం పనితీరును మెరుగుపరచేందుకు ఈ సమాచారాన్ని మేము ఉపయోగిస్తాము.
- మార్కెటింగ్ కుకీస్. ప్లాట్‌ఫాం మీద ప్రకటనలను డెలివర్ చేసి, మీ అభిరుచులకు మరింత సహసంబంధంగా ప్రకటనలను ప్రదర్శించేందుకు ఈ కుకీస్ ఉపయోగించబడతాయి. ప్రకటన సంబంధిత ప్రచారాల సామర్ధ్యాన్ని ట్రాక్ చేయడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఈ ప్రయోజనార్ధం తృతీయ పక్షాలతో మేము ఈ సమాచారాన్ని పంచుకోవచ్చు. ఇతర వెబ్సైట్లు, అప్లికేషన్ల మీద లక్షిత ప్రకటనలను మీకు అందించేందుకు మా ప్లాట్‌ఫాంతో మీ పరస్పర ప్రక్రియల గురించిన సమాచారాన్ని కూడా మా సేవా ప్రదాతలు ఉపయోగించవచ్చు.
- అనలిటిక్స్ కుకీస్. మీరు ఏ వెబ్‌పేజీల మీద క్లిక్ చేస్తారు మరియు మీరు ప్లాట్‌ఫాంను ఎలా ఉపయోగిస్తారు అనే దానిని అంచనా వేయడంలో మాకు సహాయపడేందుకు, మా సేవల కొరకు మేము ఉపయోగించే స్టాటిస్టికల్ ఆడియన్స్ మెజరింగ్ సిస్టం, ఈ అనలిటికల్ కుకీస్ (మరిన్ని వివరాల కొరకు క్రింద చూడండి).
ఏదైనా కారణం చేత మీరు కుకీస్ ప్రయోజనాలను తీసుకోకూడదనుకుంటే, మీ బ్రౌజర్లోని సెట్టింగులను మార్చడం ద్వారా మీరు కుకీస్‌ను డిజేబుల్ చేయవచ్చు. అయితే, మీరలా చేసినట్లైతే, ప్లాట్‌ఫాంను మీరు ఆస్వాదించడం పై అది ప్రభావం చూపుతుంది మరియు వ్యక్తిగతీకరించిన కంటెంట్‌ను మీకు మేము ఇక పై ఏ మాత్రమూ అందివ్వలేము. మీరు కుకీస్‌ను వద్దనుకుంటే తప్పించి, కుకీస్ వినియోగించడం మీకు సమ్మతమే అని మేము భావిస్తాము.
“ట్రాక్-చేయవద్దు” అనే సిగ్నల్స్, తృతీయ పక్షపు వెబ్సైట్లు లేదా ఆన్లైన్ సేవల వ్యాప్తంగా తమ కార్యకలాపాలు ఎలా ట్రాక్ చేయబడుతున్నాయో అన్నది పరిమితం చేసేందుకు వారి వెబ్ బ్రౌజర్ మీద యూజర్లు సెట్ చేయగలిగన ప్రాధాన్యతలు. మీ వెబ్ బ్రౌజర్లో “ట్రాక్-చేయవద్దు” సిగ్నల్స్‌కు ప్లాట్‌ఫాం ప్రతిస్పందించదు.
విశ్లేషణాత్మక సమాచారం
మా ప్లాట్‌ఫాం మీద, సేవల వినియోగ ప్యాటర్న్‌ను మరియు ట్రాఫిక్‌ను కొలవడంలో మాకు సహాయపడేందుకు తృతీయ-పక్షపు విశ్లేషణాత్మక టూల్స్‌ను మేము ఉపయోగిస్తాము. వివిధ వివరాల ప్రవాహం చుట్టూతా సేవల మీది యూజర్లు జరిపే కార్యకలాపాలను ట్రాఫిక్ సూచిస్తుంది. ఈ టూల్స్, ఉదాహరణకు, మీరు చూసే పేజీలు, యాడ్-ఆన్లు, మరియు సేవను మెరుగ్గా అందించడంలో మాకు సహకరించే ఇతర సమాచారంతో సహా మీ పరికరం లేదా మా సేవల ద్వారా పంపబడిన సమాచారాన్ని సేకరించడం వంటివి చేస్తాయి. ఈ కార్యకలాపాలతో అనుగుణంగా సేవలను అందించేందుకు ప్లాట్‌ఫాం యూజర్‌గా మీ కార్యకలాపాలు మరియు ప్యాటర్న్‌లను నివేదించి, మదింపు చేసేందుకు సమాచారం ఉపయోగించబడుతుంది.
గూగుల్, ఇంక్ (1600 యాంఫిథియేటర్ పార్క్‌వే మౌంటెయిన్ వ్యూ, సిఎ 94043, యుఎస్ఎ) ద్వారా అందించబడిన గూగుల్ అనలిటిక్స్ అనేది మా తృతీయ పక్షపు విశ్లేషణాత్మక టూల్. కుకీస్, అక్షరాలు అంకెలతో కూడిన అక్షరాల సముదాయాన్ని కలిగి ఉండే చిన్న టెక్స్ట్ ఫైల్స్‌ను గూగుల్ అనలిటిక్స్ ఉపయోగిస్తుంది, అవి మీ కంప్యూటర్లో నిల్వ చేయబడి ఉంటాయి. మా సేవా వినియోగం మీది గణాంకాలను సమకూర్చేందుకు లేదా పైన విశదపరచిన విధంగా ఇతర సంబంధిత సేవలను అందించేందుకు ట్రంకేట్ చేయబడిన (కత్తిరించబడిన) మీ ఐపి అడ్రస్‌తో సహా ఈ సమాచారాన్ని గూగుల్ ఉపయోగిస్తుంది. మీ గురించిన సమాచారాన్ని గూగుల్ ఎనలిటిక్స్ ఎలా సేకరిస్తుంది, ఎలా ప్రాసెస్ చేస్తుంది మరియు మీ నుండి గూగుల్ సమాచారం సేకరించకుండా ఉండేందుకు బయటకు వచ్చేయడం ఎలా అనే వాటి మీద మరింత సమాచారం కొరకు, దయచేసి
ఫేస్బుక్ ఇంక్, 1 హ్యాకర్ వే, మెన్లో పార్క్, సిఎ 94025, యుఎస్ఎ (“ఫేస్బుక్”) వారి “ఫేస్బుక్ పిక్సెల్”ను కూడా మేము ఉపయోగిస్తాము. ఫేస్బుక్ మీద మీరు మా ప్రకటనను చూసారా అన్నది వెల్లడి చేసే నిమిత్తం ప్రకటనా సంబంధిత ప్రయోజనాల కొరకు ఈ టూల్ ఉపయోగించబడుతుంది. ఫేస్బుక్ మీ గురించి విశదపరచబడిన సమాచారాన్ని సేకరించకూడదని మీరు అనుకుంటే, మీరు
3. మీ సమాచారాన్ని మేము ఉపయోగించేది ఎలా
మీ గురించి మేము సేకరించే సమాచారాన్ని దిగువ మార్గాలలో మేము ఉపయోగిస్తాము:
- ప్లాట్‌ఫాం నిర్వహణ (అంటే, మీకు మా సేవలను అందించేందుకు) మరియు సమస్యా పరిష్కారం, వివరాల విశ్లేషణ, పరీక్షించడం, పరిశోధన, గణాంక సంబంధిత మరియు సర్వే ప్రయోజనాలతో సహా అంతర్గత కార్యకలాపాల కొరకు (అంటే, ప్లాట్‌ఫాం స్థిరత్వం, భద్రత హామీకి) మరియు మీ అభిప్రాయ సేకరణను కోరేందుకు.
- ప్లాట్‌ఫాం యొక్క పారస్పరిక విశేషాంశాలలో మిమ్మల్ని పాల్గొనేలా చేసేందుకు, దాని కోసం మీరు ఎంచుకున్నప్పుడు;
- మీరు పొందే కంటెంట్‌ను వ్యక్తీకరించి, మీకు నచ్చిన లొకేషన్-సంబంధిత సమాచారంతో సహా వ్యక్తీకరించిన కంటెంట్‌ను మీకు అందించేందుకు;
- మా ప్లాట్‌ఫాంను మెరుగుపరచి, అభివృద్ధి చేసి, ప్రొడక్ట్ డెవలప్మెంటును నిర్వహించేందుకు;
- మీకు మరియు ఇతరులకు మేము అందించే ప్రకటనా ప్రభావికతను కొలిచి, అర్ధం చేసుకునేందుకు;
- మీరు ఎంచుకున్న దేశం సెట్టింగుల ఆధారంగా, మీకు సేవలను అందించేందుకు, ప్రకటనలు మరియు దేశం సెట్టింగులకు సంబంధించిన ఇతర కంటెంట్ వంటివి;
- మీకు మరియు ప్లాట్‌ఫాం మీది ఇతర యూజర్లకు, మీకు లేదా వారికి నచ్చగల వస్తువులు లేదా సేవల గురించి సలహాలను, సిఫారసులను చేసేందుకు;
- సేవను వినియోగించుకునే యూజర్‌గా “ఇతర మిత్రలను కనుగొనండి” అనే ఫంక్షన్ ద్వారా మిమ్మల్ని ఇతర యూజర్లు గుర్తించగలిగేందుకు, మీరు ఇతర యూజర్లను కనుగొనేలా చేసి, మిమ్మల్ని ప్లాట్‌ఫాం మీద వారితో కనెక్ట్ చేసేందుకు మరియు సేవల యొక్క సోషలైజింగ్ ఫంక్షన్‌ను సపోర్ట్ చేసేందుకు;
- మీరు ఎంచుకునే వారెవరికైనా పంపేందుకు మీ ప్రొపైల్ సమాచారాన్ని మీకు అందించేందుకు, ప్లాట్‌ఫాం మీద మీరు పాల్గొనడంలో సహాయపడేందుకు, ఇతర యూజర్లతో పరస్పరం చర్చించేందుకు;
- సంబంధిత సమాచారం కొరకు మీరు ఎంచుకున్న గోప్యతా సెట్టింగులకు అనుగుణంగా ఇతర యూజర్లకు మీ సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు;
- మీరు లైక్ చేసిన లేదా (కంటెంట్‌ను చూడడం మరియు/లేదా దాని మీద వ్యాఖ్య రాయడం ద్వారా) ఇంటరాక్ట్ చేసినటువంటి కంటెంట్, మీ ప్రాంతానికి చెందిన కంటెంట్, అలాగే మీరు ఫాలో చేసే యూజర్ల నుండి వచ్చే కంటెంట్‌ను మీకు చూపేందుకు;
- మీకు సంబంధించిన ప్రకటనలను మీకు చూపేందుకు;
- సేవలను ప్రచారం చేసేందుకు మరియు మీరు మాకు ఇచ్చే సమాచారాన్ని ఉపయోగించేందుకు, ప్లాట్‌ఫాంను ప్రచారం చేసుకునేందుకు మా ప్రకటనా సంబంధిత, వాణిజ్య సంబంధిత ప్రచారాలలో భాగంగా మా ప్లాట్‌ఫాం మీద ప్రసారం చేయడానికి మీరు ఎంచుకోగల వీడియో కంటెంట్ మరియు యూజర్ కంటెంట్ వంటివి;
- మా మెసెంజర్ సేవ పనిచేసేలా చేసేందుకు (అయినా ఈ ఫంక్షన్‌ను ఉపయోగించేందుకు మీరు ఎంచుకున్నప్పుడు మాత్రమే ఈ సమాచారం ప్రాసెస్ చేయబడుతుంది) మరియు ప్లాట్‌ఫాం సెట్టింగుల లోపల క్లియర్ క్యాషె ఫంక్షన్ ద్వారా మీ వ్యక్తిగత నిర్ణయం మేరకు దీనికి సంబంధించి ఏదైనా సమాచారాన్ని తొలగించేందుకు మీరు ఎంచుకోవచ్చు;
- ప్రకటనలు, ఆఫర్లు మరియు మీ కొరకు స్పాన్సర్ చేయబడిన ఇతర కంటెంట్‌ను ఎంచుకుని, వ్యక్తీకరించేందుకు;
- ప్లాట్‌ఫాం మీద దుర్వినియోగ, మోసపూరిత, మరియు చట్టవిరుద్ధ కార్యక్రమాలను గుర్తించడంలో మాకు సహాయపడేందుకు;
- మా సేవలను ఉపయోగించుకునేంత వయస్సు మీకు ఉన్నదని నిర్ధారించుకునేందుకు ప్రయత్నించడానికి (చట్టపరంగా అవసరమైనట్లుగా).
- మా సేవలలో మార్పుల గురించి మీకు తెలియజేసేందుకు;
- మీతో కమ్యూనికేట్ చేసేందుకు.
- మీకు యూజర్ సపోర్టును అందించేందుకు;
- మా నియమ నిబంధనలు, విధానాలను అమలు చేసేందుకు;
- సేవా నియమాల క్రింద లేదా అవసరమైతే, ఒక ప్రత్యేక ప్రీమియం కంటెంట్ సృష్టికర్త ఒప్పందం క్రింద అనుబంధ నియమాలు – పరోక్ష అంశాలు పాలసీలో బయల్పరచిన డైమండ్ మరియు ఫ్లేమ్ నిబంధనలకు అనుగుణంగా మీ నుండి చెల్లింపులను పొందేందుకు మరియు/లేదా మీకు చెల్లింపులు చేసేందుకు.
4.మీ సమాచారాన్ని మేము ఏ విధంగా పంచుకుంటాము
మీ ప్రొఫైల్ సమాచారం, మీ టైం జోన్ మరియు భాష, మీరు మీ ఖాతాను ఎప్పుడు రూపొందించారు, మీ వీడియోలు మరియు మీరు ఉపయోగించే ప్లాట్‌ఫాం యొక్క అప్లికేషన్ మరియు వర్షన్, తేదీ, సమయం వంటి మీ కార్యకలాపం గురించిన నిర్దిష్ట సమాచారంతో సహా ప్లాట్‌ఫాం మీద దాదాపుగా జరిగే కార్యకలాపం అంతా బహిరంగంగానే ఉంటుంది.
దిగువ ఎంచుకున్న తృతీయ పక్షాలతో మీ సమాచారాన్ని మేము పంచుకుంటాము:
- మా వ్యాపార భాగస్వాములు, తద్వారా ప్లాట్‌ఫాం ద్వారా మీకు ప్రత్యేక ఆఫర్లను మేము అందించగలుగుతాము;
- మీకు మరియు ఇతరులకు యాడ్వర్టులను ఎంచుకుని, అందించేందుకు సమాచారం అవసరమైనటువంటి అడ్వర్టైజింగ్ నెట్వర్కులు మరియు అడ్వర్టైజర్లు.;
- మీరు అందించే సమాచారాన్ని భద్రపరచేందుకు మరియు విపత్తుల నుండి పునరుద్ధరించే సేవల కొరకు, అలాగే మేము మీతో చేసుకునే ఏదైనా ఒప్పందం యొక్క పనితీరు కొరకు క్లౌడ్ భద్రతా ప్రదాతలు;
- ప్లాట్‌ఫాంను అనుకూలీకరించి, మెరుగుపరచడంలో మాకు సహాయపడే విశ్లేషణలు, శోధనా ఇంజన్ ప్రదాతలు; మరియు
- ఐటి సేవా ప్రదాతలు;
- మా డేటా సెంటర్ మరియు మా హోస్ట్ ప్రదాతల యొక్క సర్వర్లు;
- బహిరంగ సమాచారంగా మీకు తెలియజేయబడిన నిర్దిష్ట సమాచారం విషయంలో సాధారణ ప్రజానీకానికి - ఇందులో మీ యూజర్పేరు, బహిరంగ ప్రేక్షకులతో మీరు పంచుకునే ఏదైనా సమాచారం, ఇతర యూజర్లు పంచుకునే మీకు చెందిన ఏదైనా సమాచారం, మీ పబ్లిక్ ప్రొఫైల్ మీది సమాచారం, మొదలైనవి.
చట్టవిరుద్ధమైన యూజర్లను నివారించేందుకు, యూజర్ల సంఖ్యను పెంచేందుకు, సమాచార అభివృద్ధి, ఇంజనీరింగ్ మరియు విశ్లేషణ లేదా మా అంతర్గత వ్యాపార ప్రయోజనాల (మేము మీ సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తాము) కొరకు, ప్లాట్‌ఫాంను మెరుగుపరచి, అనుకూలీకరించడంలో సహకరించేందుకు, పైన విశదపరచిన ప్రయోజనాల కొరకు మాత్రమే, ఎవరైనా సభ్యుడు, సబ్సిడరీ, తల్లి లేదా తండ్రి లేదా మా కార్పొరేట్ గ్రూప్ యొక్క అనుబంధితులతో కూడా మీ సమాచారాన్ని మేము పంచుకుంటాము.
చట్టాన్ని అమలుచేసే ఏజెన్సీలతో, ప్రజాధికారులతో లేదా ఇతర ఆర్గనైజేషన్లతో మీ సమాచారాన్ని పంచుకోవడం చట్టపరంగా అవసరమైనట్లైతే, లేదా అటువంటి వినియోగం సహేతుకంగా క్రింది వాటి కొరకు అవసరమైతే, వారితో మేము మీ సమాచారాన్ని పంచుకుంటాము.
- చట్టపరమైన విధి, ప్రక్రియ లేదా అభ్యర్ధనతో అనగుణంగా వ్యవహరించేందుకు;
- మా సేవా నియమాలు మరియు ఇతర ఒప్పందాలు, విధానాలు మరియు ప్రమాణాలు, వాటి యొక్క ఏదైనా సంభావ్య అతిక్రమణ దర్యాప్తుతో సహా అన్నింటినీ అమలు చేసేందుకు;
- భద్రత, మోసం లేదా సాంకేతిక సమస్యలను గుర్తింతి, నివారించి, అవసరమైతే పరిష్కరించేందుకు; లేదా
- మా యొక్క, మా యూజర్ల యొక్క, ఒక తృతీయ పక్షం లేదా చట్టపరంగా అవసరమైనట్లుగా లేదా అనుమతించిన విధంగా (మోసం జరగకుండా కాపాడడం మరియు క్రెడిట్ రిస్క్ తగ్గింపు ప్రయోనాల కొరకు ఇతర కంపెనీలు మరియు ఆర్గనైజేషన్లతో సమాచార మార్పిడితో సహా) ప్రజల యొక్క హక్కులు, ఆస్తి లేదా భద్రతను పరిరక్షించేందుకు.
తృతీయ పక్షాలకు మేము మీ సమాచారాన్ని క్రింది సందర్భాలలో వెల్లడి చేస్తాము:
- ఏదైనా వ్యాపారాన్ని లేదా ఆస్తులను మేము అమ్మినప్పుడు లేదా కొనుగోలు చేసినప్పుడు, ఈ సందర్భంలో సదరు వ్యాపారం లేదా ఆస్తులను విక్రయించే లేదా కొనుగోలు చేసే ఉత్తరాధికారికి మీ వివరాలను మేము వెల్లడి చేస్తాము; లేదా
- ఇతర కంపెనీలు లేదా వ్యాపారాలత ద్వారా అక్వైర్ చేయబడినా లేదా వారితో భాగస్వామ్యం కలిగి ఉన్న వాటిని మేము అమ్మినా, కొనుగోలు చేసినా, వాటితో విలీనం అయినా, లేదా మా ఆస్తులన్నింటినీ లేదా కొన్నింటిని అమ్మినా, లేదా మూసివేయడం, దివాలా తీయడం వంటి వ్యవహారాలతో ప్రమేయం ఉన్నా. అటువంటి లావాదేవీలలో, బదిలీ చేయబడిన ఆస్తులలో యూజర్ సమాచారం కూడా ఉంటుంది.
5.మీ హక్కులు
ప్రవేశ సౌలభ్యం మరియు నవీకరణ
ఒక ఖాతా కోసం గనక మీరు నమోదు చేసుకున్నట్లైతే, మీ ఆన్లైన్ ఖాతాలోకి లాగిన్ అయి, అక్కడ అందుబాటులో ఉన్న విశేషాంశాలు, ఫంక్షనాలిటీలను ఉపయోగించి, మీరు మాకు అందించిన నిర్దిష్ట వ్యక్తిగత సమాచారాన్ని చూసి, నవీకరించవచ్చు, మీరు మీ గుర్తింపును వెరిఫై చేయలేకపోయినా లేదా మీ ఖాతాతో ఏదైనా అనుమానాస్పద కార్.కలాపం ముడిపడి ఉన్న సందర్భాలలో ఇలా చేయడం నిషేధించబడవచ్చు.
ప్రాధాన్యతల నిర్వహణ
ఇక్కడ క్లిక్ చేసి, http://www.networkadvertising.org/managing/opt_out.asp మరియు
కమ్యూనికేషన్లను వద్దనుకోవడం
మా నుండి మీరు అందుకునే మార్కెటింగ్ లేదా అడ్వర్టైజింగ్ ఈమెయిల్స్‌లో ప్రకటించిన విధానం ద్వారా లేదా “అన్‌సబ్‌స్క్రైబ్”(unsubscribe) లింకును ఉపయోగించి, మార్కెటింగ్ లేదా అడ్వర్టైజింగ్ ఈమెయిల్స్‌ను మీరు వద్దనుకోవచ్చు.
మీ జిపిఎస్ లేదా మొబైల్ పరికర సమాచారాన్ని మాతో పంచుకోకూడదనుకుంటే, మీరు మీ మొబైల్ పరికరంలోని లొకేషన్ సమాచార ఫంక్షనాలిటీని నిలిపివేయవచ్చు.
6.మీ సమాచార భద్రత
ఈ విధానానికి లోబడి, మీ సమాచారం భద్రంగా వ్యవహరించబడేలా నిర్ధారించుకునేందుకు మేము అన్నీ జాగ్రత్తలూ తీసుకుంటాము. దురదృష్టవశాత్తు, అంతర్జాలంలో సమాచార ప్రసారం పూర్తిగా సురక్షతం కాదు. అయినప్పటికీ, ఉదాహరణకు, ఎన్‌క్రిప్ట్ చేయడం ద్వారా మేము మీ సమాచారాన్ని సంరక్షించేందుకు మా శాయశక్తులా ప్రయత్నిస్తాము. ప్లాట్‌ఫాం గుండా ప్రసరించే మీ సమాచార భద్రతకు మేము హామీ ఇవ్వలేము; అది మీ స్వంత రిస్క్ మీద ఆధారపడి ఉంటుంది.
మీ మరియు మీ వంటి ఇతర ఉపభోక్తల హక్కులు, స్వేచ్ఛల కొరకు, మారుతూ ఉండే సంభావ్యత మరియు తీవ్రతల రిస్కుకు తగినట్లుగా, భద్రతా స్థాయిని నిర్ధారించుకునేందుకు, తగిన సాంకేతిక మరియు సంస్థాగత ప్రమాణాలను మేము కలిగి ఉన్నాము. ఈ సాంకేతిక మరియు సంస్థాగత ప్రమాణాలను మెయింటైన్ చేస్తూ, మా సిస్టంల యొక్క సమగ్ర భద్రతను ఎప్పటికప్పుడు మెరుగుపరచేందుకు మేము వాటిని సవరిస్తాము.
మా భాగస్వామ్య నెటవర్కులు, అడ్వర్టైజర్లు, స్వీకృత వెబ్సైట్లకు మరియు సదరు వెబ్సైట్ల నుండి లింకులను ఎప్పటికప్పుడు మేము జోడిస్తాము. ఈ వెబ్సైట్లకు వేటికైనా ఒక లింకును మీరు అనుసరిస్తే, ఈ వెబ్సైట్లు తమ స్వంత గోప్యతా విధానాలను కలిగి ఉంటాయని, ఈ విధానాలకు మేము ఎటువంటి బాధ్యులము కామని లేదా ఉత్తరదాయిత్వాన్ని కలిగి ఉండమని దయచేసి గమనించండి. ఈ వెబ్సైట్లకు ఏ సమాచారాన్నైనా సమర్పించే ముందు, ఈ విధావాలను దయచేసి చెక్ చేయండి.
మీరు ప్లాట్‌ఫాంలో మొదటిసారి ఒక వీడియోను అప్లోడ్ చేసినట్లైతే, బహిరంగ ఖాతా మీది ఒక ప్లాట్‌ఫాంను మీరు ఉపయోగిస్తున్నారనేది మీకు తెలియచేయబడుతుందని గమనించండి, అంటే యూజర్‌తో మీకు కనెక్షన్ ఉన్నా లేకున్నా ప్లాట్‌ఫాం మీది ప్రతి యూజర్ కూడా మీరు పోస్ట్ చేసే వీడియోను వీక్షించగలరు అని అర్ధం. సమాచార విండోలో నిర్దేశించిన విధంగా, మీ గోప్యతా సెట్టింగులలో ప్లాట్‌ఫాంకు మీరు పోస్ట్ చేసే సమాచారంలో చేర్చిన సమాచారానికి ప్రవేశ సౌలభ్యతను కలిగి ఉండే ప్రేక్షకులను మీరు పరిమితం చేయవచ్చు. ప్లాట్‌ఫాం మీద గోప్యతా సెట్టింగులలో చేసే మార్పులు తక్షణమే వర్తిస్తాయి, పైగా మీరు గతంలో పోస్ట్ చేసిన సమాచారానికి కూడా అవి వర్తిస్తాయి. సంబంధిత యుజివి లేదా ప్రసారం చేసే కంటెంట్ లేదా మీ ప్రొఫైల్‌లో మీరు అందించిన ఇతర సమాచారాన్ని తొలగించేందుకు మీరు నిర్ణయించుకుంటే ప్లాట్‌ఫాంను మీరు వినియోగించడం నుండి మీ సమాచారాన్ని మేము తొలగిస్తాము.
7.మేము మీ సమాచారాన్ని ఎంత కాలం ఉంచుకుంటాము
మీ సమాచారాన్ని మేము ఎంతకాలం భద్రపరుస్తామన్నది నిర్ధారించేందుకు దిగువ క్రైటీరియాని మేము ఉపయోగిస్తాము:
- సదరు సమాచారానికి సంబంధించి మా ఒప్పందాత్మక నియమాలు, హక్కులు;
- నిర్దిష్ట కాల వ్యవధి కొరకు వివరాలను ఉంచుకునేందుకు వర్తించే చట్టం(లు), నిబంధనల క్రింద చట్టపరమైన నియమాలు;
- వర్తించే చట్టం(లు) క్రింద పరిమితుల చట్టం;
- మా శాసనబద్ధ వ్యాపార ప్రయోజనాలు; మరియు
- అవకతవకలు లేదా సంభావ్య అవకతవకలు.
మా సేవలను మీరు వినియోగించుకోవడాన్ని మీరు ఆపేసిన తరువాత, ఒక సముచ్ఛిత, అనామక ఆకృతిలో మీ సమాచారాన్ని మోము భద్రపరచవచ్చు. గడిచిపోయినదైనప్పటికునీ, వివాదాలను మేము పరిష్కరించగలిగేందుకు, ఎదుర్కొనగలిగేందుకు, మరియు మా ఒప్పందాలను అమలుచేసేందుకు, మా చట్టపరమైన విధులతో అనుగుణ్యంగా సహేతుకంగా అవసరమైనట్లుగా, ఏదైనా వ్యక్తిగత సమాచారాన్ని కూడా మేము ఉంచుకుంటాము.
8.చిన్నపిల్లలకు సంబంధించిన సమాచారం
13 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు కలిగిన చిన్నారులకు ఈ కార్యక్రమం నిర్దేశించబడలేదు. 13 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు కలిగిన వారి నుండి వ్యక్తిగత సమాచారం సేకరించబడినట్లుగా మాకు తెలిసినట్లైతే, మేము ఈ సమాచారాన్ని తొలగించి, సదరు వ్యక్తి ఖాతాను రద్దు చేస్తాము. 13 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు కలిగిన వారి నుండి సమాచారాన్ని మేము సేకరించబడినట్లుగా మీకు అనిపిస్తే,
9.మార్పులు
ఈ పాలసీ యొక్క ప్రస్తుత తాజా వర్షన్ మీ వివరాలను మేము ప్రాసెస్ చేయడాన్ని నిర్దేశిస్తుంది. నవీకరించబడిన పాలసీ తేదీ తరువాత సేవలకు ప్రవేశ సౌలభ్యాన్ని కలిగి ఉండడాన్ని, వినియోగించడాన్ని మీరు కొనసాగిస్తున్నారు అంటే దానర్ధం, నవీకరించబడిన పాలసీని మీరు అంగీరిస్తున్నట్లు. నవీకరించబడిన పాలసీకి మీరు అంగీకరించనట్లైతే, సేవలకు ప్రవేశ సౌలభ్యాన్ని కలిగి ఉండడాన్ని, వినియోగించడాన్ని మీరు తప్పక ఆపేయాలి. ఈ పాలసీకి చేయబడిన ఏవైనా ముఖ్యమైన మార్పుల గురించి మేము మా ప్లాట్‌ఫాం మీద ప్రకటించి, సాధారణంగా యూజర్లందరికీ తెలియజేస్తాము. అయినప్పటికీ, ఏవైనా మార్పులు జరిగాయేమో చెక్ చేసేందుకు, మీరు ఈ పాలసీని క్రమవారీగా చూడాలి. ఈ పాలసీ పై భాగంలో “చివరగా నవీకరించబడిన” తేదీని కూడా మేము నవీకరిస్తాము, ఇది సదరు పాలసీ అమలు అయ్యే తేదీని సూచిస్తుంది.