చట్టపరం

గోప్యతా విధానం

చివరగా నవీకరించబడిన తేదీ: ఫిబ్రవరి 2020        


టిక్‌టాక్ (“ప్లాట్‌ఫాం”) కు స్వాగతం. 21, హెండర్‌సన్ రోడ్#06-22, Apex@Henderson, సింగపూర్ 159545 (“టిక్‌టాక్”, “మేము” లేదా “మాకు”) వద్ద నమోదు చేసుకున్న టిక్‌టాక్ పిటిఇ. లిమిటెడ్ వారి ద్వారా ఈ ప్లాట్‌ఫాం అందించబడింది లేదా నియంత్రించబడుతుంది.

మీ గోప్యతను కాపాడేందుకు, గౌరవించేందుకు మేము కట్టుబడి ఉన్నాము. మేము మీ నుండి సేకరించిన లేదా మీరు మాకు అందించిన వ్యక్తిగత వివరాలకు సంబంధించిన మా ఆచరణలను ఈ విధానం వివరిస్తుంది. మీరు ఈ విధానంతో అంగీకరించనట్లైతే, మీరు మా ప్లాట్‌ఫాంను ఉపయోగించరాదు.

మేము మీ వ్యక్తిగత వివరాలను ఎలా ఉపయోగిస్తాము అనే దాని గురించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, privacy@tiktok.com ను దయచేసి సంప్రదించండి.

సారాంశం

మేము మీ గురించిన ఏ సమాచారాన్ని సేకరిస్తాము?

ప్లాట్‌ఫాం మీద మీరు మీ ఖాతాను రూపొందించినప్పుడు, కంటెంట్‌ను అప్‌లోడ్ చేసినప్పుడు మీరు మాకందించే సమాచారాన్ని మేము సేకరించి, ప్రాసెస్ చేస్తాము. ఇందులో ప్లాట్‌ఫాంను మీరు ఉపయోగించడం గురించిన సాంకేతిక మరియు ప్రవర్తనా సంబంధిత సమాచారం ఉంటుంది. మీరు ఖాతాను రూపొందించకుండా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ప్లాట్‌ఫాంతో ఇంటరాక్ట్ చేసినట్లైతే, మీ గురించిన సమాచారాన్ని కూడా మేము సేకరిస్తాము. 

మీ గురించిన సమాచారాన్ని మేము ఎలా ఉపయోగిస్తాము?

మీకు ప్లాట్‌ఫాంను అందించేందుకు, దానిని అడ్మినిస్టర్ చేసేందుకు మేము మీ సమాచారాన్ని ఉపయోగిస్తాము. మిగిలిన అంశాలలో, ‘మీ కోసం’ ఫీడ్‌లో మీకు సలహాలను చూపించేందుకు, ప్లాట్‌ఫాంను మెరుగుపరచి, అభివృద్ధి చేసేందుకు, మీ సురక్షతను నిర్ధారించుకునేందుకు, మేము మీ సమాచారాన్ని ఉపయోగిస్తాము. తగిన చోట, లక్షిత అడ్వర్టైజింగ్‌ను మీకు అందించేందుకు మరియు ప్లాట్‌ఫాంను ప్రమోట్ చేసుకునేందుకు కూడా మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగిస్తాము.

మేము మీ సమాచారాన్ని ఎవరితో పంచుకుంటాము?

మేము మీ వివరాలను, మాకు ప్లాట్‌ఫాంను అందించే క్లౌడ్ స్టోరేజీ ప్రదాతలు వంటి వారితో పంచుకుంటాము. వ్యాపార భాగస్వాములు, టిక్‌టాక్ వంటి అదే సమూహంలోని ఇతర కంపెనీలు, కంటెంట్ మోడరేషన్ సేవలు, మెజర్‌మెంట్ ప్రదాతలు, ప్రకటనదారులు, మరియు అనలిటిక్స్ ప్రదాతలతో కూడా మేము మీ సమాచారాన్ని పంచుకుంటాము. చట్ట ప్రకారం అవసరమైనప్పుడల్లా, అవసరమైన చోటల్లా, చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు లేదా రెగ్యులేటర్లతో మరియు చట్టప్రకారం అనివార్యమైన కోర్టు ఆదేశాల ప్రకారం తృతీయ పక్షాలతో మేము మీ సమాచారాన్ని పంచుకుంటాము.

మేము మీ సమాచారాన్ని ఎంతకాలం ఉంచుకుంటాము?

మీకు సేవను అందించే అవసరం ఉన్నంతకాలం మేము మీ సమాచారాన్ని ఉంచుకుంటాము. మీకు సేవను అందించే నిమిత్తం మీ సమాచారం మాకు అవసరం లేని చోట, వివరాలను ఉంచుకోవాలి అనే చట్టబద్ధ నియమాలకు మేము లోబడి ఉన్న చోట లేదా అటువంటి వివరాలను ఉంచుకోవలసిన న్యాయబద్ధమైన వ్యాపార ప్రయోజనం మాకు ఉన్నంతకాలం మాత్రమే మేము దానిని ఉంచుకుంటాము. చట్టబద్ధమైన దావాల ఏర్పాటు, అమలు లేదా పరిహారము కొరకు ప్రస్తుతం లేదా భవిష్యత్తులో అవసరం అవుతుందని మేము అనుకుంటే కూడా మేము మీ వివరాలను ఉంచుకుంటాము.

ఈ విధానానికి ఏవైనా మార్పులు జరిగితే మేము మీకు ఎలా తెలియజేస్తాము?

మా ప్లాట్‌ఫాంలోని ఒక నోటీసు ద్వారా ఈ పాలసీకి చేసే ఏవేనీ మెటీరియల్ మార్పులను గురించి మేము సాధారణంగా మా యూజర్లు అందరికీ తెలియజేస్తాము. అయితే, జరిగిన ఏవైనా మార్పుల కొరకు మీరు ఈ పాలసీని క్రమం తప్పకుండా చెక్ చేస్తూ ఉండాలి. ఈ పాలసీ పైన, “చివరగా నవీకరించిన తేదీ”ని కూడా మేము నవీకరిస్తాము, అది అటువంటి పాలసీ అమలు అయ్యే ఆరంభ తేదీని సూచిస్తుంది. ప్లాట్‌ఫాంను యాక్సెస్ చేయడం ద్వారా లేదా ఉపయోగించడం ద్వారా, మీరు ఈ పాలసీని చదివారని, మీ వ్యక్తిగత వివరాలకు సంబంధించిన మీ హక్కులను మరియు మేము వాటిని ఎలా సేకరిస్తాము, వినియోగిస్తాము మరియు ప్రాసెస్ చేస్తాము అన్నది మీరు అర్ధం చేసుకున్నారని మీరు అంగీకరిస్తున్నారు.

***********************************************************************************************

1. మేము ఉపయోగించే వ్యక్తిగత వివరాల రకాలు

మేము మీ గురించిన దిగువ సమాచారాన్ని సేకరించి, ఉపయోగిస్తాము:

మీ ప్రొఫైల్ సమాచారం. మీరు ప్లాట్‌ఫాం మీద నమోదు చేసుకున్నప్పుడు, మీ యూజర్‌పేరు, పుట్టిన తేదీ (వర్తించే చోట), ఇమెయిల్ చిరునామా మరియు/లేదా టెలిఫోన్ నెంబరు, మీ యూజర్ ప్రొఫైల్‌లో మీరు వెల్లడించే సమాచారం, మరియు మీ ఫోటోగ్రాఫ్ లేదా ప్రొఫైల్ వీడియోలతో సహా మీరు మాకందించే సమాచారం. 

యూజర్ కంటెంట్ మరియు ప్రవర్తనా సంబంధిత సమాచారం. మీరు సెట్ చేసే ప్రాధాన్యతలు (ఎంచుకున్న భాష వంటివి), మీరు అప్‌లోడ్ చేసే ఫోటోగ్రాఫులు మరియు వీడియోలు మరియు మీరు చేసే వ్యాఖ్యలు (“యూజర్ కంటెంట్”)లతో సహా ప్లాట్‌ఫాం మీద మీరు జెనరేట్ చేసే కంటెంట్‌ను మేము ప్రాసెస్ చేస్తాము. యూజర్ కంటెంట్ అప్‌లోడ్ స్పీడును మెరుగుపరచే క్రమంలో అప్‌లోడ్‌ను ధృవీకరించేందుకు “పోస్ట్ చేయండి”ని క్లిక్ చేయడానికి ముందు, ఆడియో, వీడియోలను ముందస్తుగా అప్‌లోడ్ చేసేందుకు ఒక ముందస్తు లోడ్ సేవను మేము అందిస్తాము. ఏదైనా ఇతర కారణాల వలన కంటెంట్‌ను అప్‌లోడ్ చేయడంలో మీరు విఫలమైనా లేదా రద్దు చేసినా, మేము మా సర్వరు నుండి సంబంధిత ఆడియో, వీడియోను డిలీట్ చేస్తాము. మీరు పాల్గొనే సర్వేలు, సవాళ్ళు, పోటీల ద్వారా మేము సమాచారాన్ని సేకరిస్తాము. మీ ప్లాట్‌ఫాం వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మేము సేకరిస్తాము, ఉదా. మేము మీకు చూపించే కంటెంట్‌తో మీరు ఎలా ఇంటరాక్ట్ అవుతారు, మీరు చూసే ప్రకటనలు, మీరు వీక్షించే వీడియోలు, ఎదుర్కున్న సమస్యలు, మీరు లైక్ చేసే కంటెంట్, ‘నా ఫేవరెట్లు’కు మీరు సేవ్ చేసే కంటెంట్ మరియు మీరు ఫాలో అయ్యే యూజర్లతో సహా ప్లాట్‌ఫాంతో మీరెలా గడుపుతారు అనేవి. మేము మీ ప్రాధాన్యతలను ఊహిస్తాము కూడానూ, ఇందులో కంటెంట్‌ను వ్యక్తిగతీకరించేందుకు మీ ఆసక్తులు, లింగం, వయస్సు ఉంటాయి. ఇతర యూజర్లకు మీ కంటెంట్‌ను ప్రమోట్ చేసే మరియు సహకారం కొరకు తదనంతర అవకాశాలను మీ ప్రొఫైల్ ప్రదర్శిస్తుందా అన్నది అన్వేషించే ప్రయోజనార్ధం మేము మిమ్మల్ని ఫాలో చేసేవారి గురించి, మీరు అందుకునే లైక్‌ల గురించి, మీరు అప్‌లోడ్ చేసే కంటెంట్‌కు ప్రతిస్పందనలను ప్రాసెస్ చేస్తాము. తగిన చోట్ల, వ్యక్తిగతీకరించబడిన అడ్వర్టైజింగ్ అందించే, కొత్త సేవలు మరియు అవకాశాల గురించి మీరు తెలిపే ప్రయోజనార్ధం కూడా మేము ఈ సమాచారాన్ని ఉపయోగిస్తాము.

తృతీయ పక్షాల నుండి సమాచారం. మీ ప్లాట్‌ఫాం వినియోగం ద్వారా లేదా తృతీయ పక్షాల నుండి మాతో నిర్దిష్ట వివరాలను పంచుకునేందుకు మీరు ఎంచుకోవచ్చు, అటువంటి తృతీయ పక్ష వివరాలను మేము సేకరించవచ్చు. తృతీయ పక్షాల నుండి మేము అందుకునే సమాచారం మీద తదనంతర వివరాలను మేము దిగువన బయల్పరచాము: 

వ్యాపార భాగస్వాములు

మీ సోషల్ నెట్వర్క్ అకౌంట్ వివరాలు (ఉదా. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాం, గూగుల్) ఉపయోగించి, ప్లాట్‌ఫాంను ఉపయోగించడానికి నమోదు చేసుకునేందుకు మీరు ఎంచుకున్నట్లైతే, మీ యూజర్‌పేరు, పబ్లిక్ ప్రొఫైల్‌ను మాకు అందించేందుకు మీ సోషల్ నెట్వర్క్‌కు అనుమతిని ఇస్తున్నారు లేదా మాకు అందిస్తున్నారు. ఆవిధంగా మీ సోషల్ నెట్వర్క్‌తో నిర్దిష్ట సమాచారాన్ని మేము పంచుకుంటాము, యాప్ ఐడి, యాక్సెస్ టోకెన్, సూచించే URL వంటివి. మీ ఫేస్‌బుక్ పరిచయాల జాబితాను మాతో పంచుకోవడం మీది తదనంతర సమాచారం కొరకు, ఇతర యూజర్లను కనుగొని, మీ స్నేహితులను ఆహ్వానించండి ని దయచేసి చూడండి. 

ప్రకటనదారులు, ప్రకటనలు అందించే నెట్‌వర్కులు

మీ సంభావ్య ఆసక్తులను ఊహించి, మరింత సహసంబంధ ప్రకటనలను అందించేందుకు మీ నుండి సేకరించిన సమాచారాన్ని, ప్లాట్‌ఫాంతో, ఇతర తృతీయ పక్ష సైట్లతో మీ ఇంటరాక్షన్‌ను మేము ఉపయోగిస్తాము. మీరు సందర్శించిన వెబ్‌సైట్లు, మీరు డౌన్‌లోడ్ చేసుకున్న యాప్‌లు, మీరు చేసిన కొనుగోళ్ళను గురించి ఈ సమాచారం మాకు చెబుతుంది, తద్వారా భవిష్యత్తులో మీకేమి ఆసక్తిగా ఉండవచ్చు అనేది, మా ప్లాట్‌ఫాం మీద ప్రకటనలు చేయడం ఎంత ప్రభావవంతంగా ఉంటుంది అన్నది మేము ముందుగా భావించగలుగుతాము. మా యాప్‌మీద కుకీలను, అటువంటి సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా మరియు మా ప్లాట్‌ఫాం మీద ప్రకటనలు చేసే తృతీయ పక్షాల నుండి, మీరు సందర్శించే సైట్ల నుండి పొందిన అటువంటి సమాచారం నుండి ఈ సమాచారాన్ని మేము సేకరిస్తాము.

మేము మీ గురించి సేకరించే సాంకేతిక సమాచారం. అకౌంట్ లేకుండా యాప్‌ను మీరు ఉపయోగించినప్పడుతో సహా మా ప్లాట్‌ఫాంను మీరు ఉపయోగించినప్పుడు మేము మీ నుండి నిర్దిష్ట సమాచారాన్ని ఆటోమ్యాటిక్‌గా సేకరిస్తాము. అటువంటి సమాచారంలో మీ ఐపి చిరునామా, బ్రౌజింగ్ చరిత్ర (ప్లాట్‌ఫాం మీద మీరు వీక్షించిన కంటెంట్), మొబైల్ వాహకం, టైం జోన్ సెట్టింగులు, ప్రకటనా ప్రయోజనాల కోసం ఐడెంటిఫయర్‌ మరియు మీరు ఉపయోగించే యాప్ వర్షన్‌ ఉంటాయి. ప్లాట్‌ఫాంను యాక్సెస్ చేసేందుకు మీరు ఉపయోగించే డివైజ్‌కి సంబంధించి, మీ డివైజ్ మోడల్, డివైజ్ సిస్టం, నెట్‌వర్క్ టైప్, డివైజ్ ఐడి, మీ స్క్రీన్ రిజల్యూషన్, ఆపరేటింగ్ సిస్టం వంటి సమాచారాన్ని కూడా మేము సేకరిస్తాము. బహుళ డివైజ్‌ల నుండి మీరు లాగిన్ అయిన చోట్ల, డివైజ్‌ల వ్యాప్తంగా మీ కార్యకలాపాలను గుర్తించేందుకు మీ ప్రొఫైల్ సమాచారాన్ని మేము ఉపయోగించగలుగుతాము.

లొకేషన్. లొకేషన్ ఆధారిత సేవలను మేము అందించే సందర్భాలలో మేము (మీ సమ్మతి ఉన్న చోట్ల) జిపిఎస్‌ను సేకరిస్తాము, తక్కిన చోట్ల మీ టిక్‌టాక్ అనుభవాన్ని అనుకూలీకరించేందుకు సెట్టింగులలో మీరు ఎంచుకున్న ‘రీజియన్’ను మేము ఉపయోగిస్తాము

ఇతర యూజర్లను కనుగొని, మీ స్నేహితులను ఆహ్వానించండి. ‘స్నేహితులను కనుగొనండి’ అనే మా ఫంక్షన్‌ను ఉపయోగించి ప్లాట్‌ఫాం మీది ఇతర యూజర్లను కనుగొనడాన్ని మీరు ఎంచుకోవచ్చు. మీ టెలిఫోన్‌లోని పరిచయాల జాబితా నుండి లేదా ఫేస్‌బుక్ స్నేహితుల జాబితా నుండి మీ స్నేహితులు ఎవరెవరు ప్లాట్‌ఫాంను ఉపయోగిస్తున్నారు అన్నది చూసేందుకు ఈ ఫంక్షనాలిటీ మిమ్మల్ని అనుమతిస్తుంది, వారిని ఫాలో అయ్యే ఆప్షన్‌ను కూడా అందిస్తుంది. ప్లాట్‌ఫాం మీద మీతో జాయిన్ అయ్యేందుకు మీ పరిచయాలను ఆహ్వానించేందుకు కూడా మీరు ఈ ఫంక్షన్‌ను ఉపయోగించవచ్చు. మీ టెలిఫోన్‌లోని పరిచయాల జాబితా నుండి గానీ లేదా ఫేస్‌బుక్ స్నేహితుల జాబితా నుండి గానీ ఆ వ్యక్తి గురించి మీ వద్ద ఉన్న సంప్రదింపు సమాచారాన్ని మేము ఉపయోగించి, వారికి ఎస్‌ఎంఎస్‌ ద్వారా గానీ, ఇమెయిల్ ద్వారా గానీ లేదా తృతీయ పక్ష సందేశం (వాట్సప్, ఫేస్‌బుక్, (ఫేస్‌బుక్ మెసెంజర్‌తో సహా) లేదా ట్విట్టర్ వంటివి) పంపి, మీ టిక్‌టాక్ ప్రొఫైల్‌ను వీక్షించేందుకు వారిని ఆహ్వానించే ఆప్షన్‌ను మీకు ఇస్తాము.

కాయిన్లను కొనండి. ఇన్-యాప్ కాయిన్ కొనుగోళ్ళను అందించే నిర్దిష్ట న్యాయపరిధులలో మీరు నివశిస్తున్నట్లైతే, మా పరోక్ష ఐటెంల పాలసీ నిబంధనలను దయచేసి గమనించండి. మీ యాపిల్ ఐట్యూన్స్ లేదా గూగుల్ ప్లే అకౌంట్ ద్వారా మీ కొనుగోళ్ళు చేయబడతాయి. అటువంటి లావాదేవీ కొరకు సంబంధించి మీ నుండి ఎటువంటి ఆర్ధిక సంబంధిత లేదా బిల్లిగ్ సమాచారాన్ని మేము సేకరించము. అటువంటి వివరాల నిర్వహణకు సంబంధించి సంబంధిత యాప్ స్టోర్ల నియమాలు మరియు గమనికలను దయచేసి సమీక్షించండి. తద్వారా మీ అకౌంట్‌ నుండి కాయిన్లలో సరైన విలువను మేము క్రెడిట్ చేయగలుగుతాము, మీరు చేసే కొనుగోళ్ళు, ఈ కొనుగోళ్ళను మీరు చేసిన సమయం మరియు వెచ్చించిన మొత్తంకు సంబంధించి ఒక రికార్డును  మేము నిర్వహిస్తాము.

2. కుకీస్

మేము, మా వెండర్లు, సేవా ప్రదాతలు కుకీస్‌ను మరియు అటువంటి ఇతర సాంకేతికతలను (ఉదా, వెబ్ బెకాన్స్, ఫ్లాష్ కుకీస్, మొ.) (“కుకీస్”) ఉపయోగించి సమాచారాన్ని సేకరించి, మీరు ఏ వెబ్‌పేజీలను క్లిక్ చేశారు, ప్లాట్‌ఫాంను ఎలా ఉపయోగిస్తారు అన్నది మెజర్ చేసి, విశ్లేషించి, ప్లాట్‌ఫాంను ఉపయోగించే మీ అనుభవాన్ని మెరుగుపరచి, మా సేవలను మెరుగుపరచి, ప్లాట్‌ఫాం మీద మరియు ఎక్కడెక్కడ ఉన్న మీ వివిధ డివైజ్‌లలో లక్షిత ప్రకటనలను మీకు అందిస్తారు. కుకీస్ అనేవి చిన్న ఫైళ్ళు, మీ డివైజ్‌లో ఉంచినప్పుడు అవి నిర్దిష్ట ఫీచర్లు, ఫంక్షనాలిటీలను అందించే అవకాశాన్ని ప్లాట్‌ఫాంకు కల్పిస్తాయి. వెబ్ బెకాన్లు అనేవి చాలా చిన్న చిత్రాలు లేదా చిన్న చిన్న మొత్తాలలో డేటాను ఇమిడ్చిన చిత్రాలు, వీటినే “పిక్సెల్ ట్యాగ్‌లు” లేదా “స్పష్టమైన GIFలు” అని కూడా అంటారు, ఇవి కుకీస్‌ను, పేజీని వీక్షించిన తేదీ, సమయం, పిక్సెల్ ట్యాగ్‌ను ఉంచిన పేజీ వివరణను, మరియు మీ కంప్యూటర్ లేదా డివైజ్‌ నుండి అదేరకమైన సమాచారాన్ని గుర్తించగలవు. ప్లాట్‌ఫాంను ఉపయోగించి, మా కూకీస్‌ల వినియోగానికి మీరు అంగీకరిస్తున్నారు.

అదనంగా, కుకీస్ ద్వారా మా ఆన్‌లైన్ కార్యకలాపాలను గురించిన సమాచారాన్ని సేకరించేందుకు మేము మా వ్యాపార భాగస్వాములను, అడ్వర్టైజింగ్ నెట్‌వర్కులను మరియు ఇతర అడ్వర్టైజింగ్ వెండర్లను మరియు (అనలిటిక్స్ వెండర్లు, సేవా ప్రదాతలతో సహా) సేవా ప్రదాతలను అనుమతిస్తాము. మీ ఇమెయిల్ లేదా ఇతర లాగిన్ లేదా డివైజ్ సమాచారాన్ని ఉపయోగించి, మీ డివైజ్‌లు అన్నింటిలో మా ప్లాట్‌ఫాం మీది మీ కార్యకలాపంతో మీ సంప్రదింపు లేదా సబ్‌స్క్రైబర్ సమాచారాన్ని మేము లింక్ చేస్తాము. మా ప్లాట్‌ఫాం మరియు ఇతర ఆన్‌లైన్లో మీ ఆసక్తులు, ప్రాధాన్యతలు, స్వభావాలకు అనుకూలంగా ప్రకటనలను ప్రదర్శించేందుకు ఈ సమాచారాన్ని ఈ తృతీయ పక్షాలు ఉపయోగించవచ్చు. ఈ తృతీయ పక్షాల గోప్యతా ఆచరణలకు మేము బాధ్యులము కాదు మరియు ఈ తృతీయ పక్షాల సమాచార ఆచరణలు ఈ పాలసీలో కవర్ చేయబడిలేవు.

మీ బ్రౌజర్ సెట్టింగులను అడ్జస్ట్ చేయడం ద్వారా మీరు కుకీస్‌ను తిరస్కరించగలగవచ్చు లేదా నిష్క్రియాత్మకం చేయగలగవచ్చు. ప్రతి బ్రౌజర్ ఒకేలా ఉండదు కాబట్టి, మీ బ్రౌజర్ ద్వారా అందించబడిన సూచనలను దయచేసి సంప్రదించండి. కొన్ని రకాల కుకీస్‌ను తిరస్కరించేందుకు లేదా నిష్క్రియాత్మకం చేసేందుకు మీరు అదనపు స్టెప్‌లను తీసుకోవలసి రావచ్చు. ఉదాహరణకు, బ్రౌజర్లు, మొబైల్ యాప్ ఫంక్షన్లు ఎలా పని చేస్తాయి అనే విషయంలోని వ్యత్యాసాల కారణంగా , ఒక బ్రౌజర్‌లో లక్షిత అడ్వర్టైజింగ్‌ కొరకు ఉపయోగించబడ్డ కుకీస్‌ను వద్దనుకునేందుకు మీరు వివిధ స్టెప్స్ తీసుకోవలసి రావచ్చు. అదనంగా, మీరు వద్దనుకున్నప్పుడు, మీరు ఉపయోగిస్తున్న నిర్దిష్ట బ్రౌజర్ లేదా డివైజ్‌కు ప్రత్యేకించి మీ ఆప్‌-ఔట్ ఎంపిక ఉంటుంది. కుకీస్‌ను తిరస్కరించేందుకు, నిష్క్రియాత్మకం చేసేందుకు లేదా తొలగించేందుకు మీరు ఎంచుకుంటే, ప్లాట్‌ఫాంలోని కొంత ఫంక్షనాలిటీ మీకు ఇకపై అందుబాటులో ఉండకపోవచ్చు.

3. మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తాము

మేము మీ గురించి సేకరించే సమాచారాన్ని మేము క్రింది విధాలుగా ఉపయోగిస్తాము:

 • మా సేవలలో మార్పుల గురించి మీకు తెలియజేసేందుకు;
 • మీకు యూజర్ సపోర్టును అందించేందుకు;
 • మీరు పొందే కంటెంట్‌ను వ్యక్తిగతీకరించి, మీకు ఆసక్తిగా ఉండగల అనుకూలిత కంటెంట్‌ను మీకు అందించేందుకు;
 • యూజర్ కంటెంట్‌ను పంచుకుని, ఇతర యూజర్లతో ఇంటరాక్ట్ చేసే అవకాశాన్ని మీకు ఇస్తుంది;
 • ఈ ఫంక్షన్‌ను ఉపయోగించేందుకు మీరు ఎంచుకుంటే, మా మెసెంజర్ సేవ ఫంక్షన్ అయ్యేలా చేసేందుకు;
 • పరోక్య ఐటెంల ప్రోగ్రాంలో మిమ్మల్ని పాల్గొనేలా చేసేందుకు; 
 • మీతో కమ్యూనికేట్ చేసేందుకు; 
 • ప్లాట్‌ఫాం మీద దుర్వినియోగ, మోసపూరిత, వంచనతో కూడిన, స్పామ్ మరియు చట్టవిరుద్ధ కార్యక్రమాలను గుర్తించడంలో మాకు సహాయపడేందుకు;
 • మా కమ్యూనిటీ మార్గదర్శకాలు మరియు ఇతర అనుచిత కంటెంట్‌ను ఉల్లంఘించడం గురించి యూజర్ కంటెంట్‌ను, సందేశాలను, అనుబంధిత మెటాడేటాను సమీక్షించడంతో సహా మీ భద్రతా మరియు సురక్షతను నిర్ధారించుకోవడం;
 • మీకు, మీ డివైజ్‌ కొరకు అత్యంత ప్రభావవంతమైన విధంగా కంటెంట్‌ ప్రదర్శించబడేలా నిర్ధారించుకునేందుకు;
 • ప్లాట్‌ఫాంను మెరుగుపరచి, ప్రమోట్ చేసి, అభిృద్ధి చేసేందుకు, ప్లాట్‌ఫాం మీద ప్రసిద్ధ అంశాలు, హ్యాష్‌ట్యాగ్‌లు మరియు ప్రచారాలను ప్రోత్సహించేందుకు;
 • ప్లాట్‌ఫాం స్థిరత్వం, భద్రతను నిర్ధారించుకునేందుకు, డేటా విశ్లేషణ చేసి, ప్లాట్‌ఫాంను పరీక్షించడం; 
 • ప్లాట్‌ఫాం మీది ఇంటరాక్టివ్ ఫీచర్లలో పాల్గొనడానికి మిమ్మల్ని అనుమతించేందుకు;
 • ప్లాట్‌ఫాం మీద నలుగురితో మిమ్మల్ని కలిసేలా చేసేందుకు, ఉదాహరణకు, “ఇతర మిత్రలను కనుగొనండి” అనే ఫంక్షన్ ద్వారా లేదా తమ ఫోన్ పరిచయాల ద్వారా మిమ్మల్ని ఇతర యూజర్లు గుర్తించగలిగేలా చేయడం ద్వారా;  
 • మా ప్లాట్‌ఫాంను ఉపయోగించుకునేందుకు తగినంత వయస్సు మీకు ఉన్నదని నిర్ధారించుకునేందుకు ప్రయత్నించడానికి (చట్టపరంగా అవసరమైనట్లుగా).
 • వ్యక్తిగతీకరించిన అడ్వర్టైజింగ్‌ను మీకు అందించేందుకు;
 • లొకేషన్-ఆధారిత సేవలను మీకు అందించేందుకు (మీ న్యాయపరిధిలో ఆ సేవలు అందుబాటులో ఉన్న చోట);
 • మా నియమనిబంధనలను, పాలసీలను అమలు చేసేందుకు; మరియు
 • సమస్యా పరిష్కారంతో సహా ప్లాట్‌ఫాంను అడ్మినిస్టర్ చేసేందుకు.

4. మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎలా పంచుకుంటాము

దిగువన ఎంచుకోబడ్డ తృతీయ పక్షాలతో మేము మీ వివరాలను పంచుకుంటాము:

వ్యాపార భాగస్వాములు

మీరు మీ సోషల్ నెట్‌వర్క్ అకౌంట్ వివరాలను (ఉదా, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, గూగుల్) ఉపయోగించి ప్లాట్‌ఫాంను ఉపయోగించేందుకు నమోదు చేసుకునేందుకు మీరు ఎంచుకుంటే, మీ యూజర్‌పేరు, పబ్లిక్ ప్రొఫైల్‌ను మీరు మాకు అందిస్తారు లేదా మీ సోషల్ నెట్‌వర్క్‌ వాటిని మాకు అందించేందుకు అనుమతినిస్తారు. ఆవిధంగామీ యాప్ ఐడి, యాక్సెస్ టోకెన్ మరియు చూస్తున్న URL వంటి వాటిని సంబంధిత సోషల్ నెట్‌వర్క్‌తో నిర్దిష్ట సమాచారాన్ని పంచుకుంటాము.

సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల మీద కంటెంట్‌ను పంచుకునేందుకు మీరు ఎంచుకున్న చోట్ల, వీడియో, యూజర్‌పేరు మరియు దానితో ఉన్న టెక్స్ట్‌లు ప్లాట్‌ఫాం మీద పంచుకోబడతాయి, వాట్సప్ వంటి ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాంల ద్వారా పంచుకుంటున్న సందర్భంలో, కంటెంట్‌కు లింక్ పంచుకోబడుతుంది.

చెల్లింపు ప్రదాతలు

కాయిన్లను కొనుగోలు చేసేందుకు మీరు ఎంచుకుంటే, ఈ లావాదేవీ సౌకర్యాన్ని కల్పించేందుకు సంబంధిత చెల్లింపు ప్రదాతతో డేటాను మేము పంచుకుంటాము. మీరు చెల్లింపు చేసిన మీదట మిమ్మల్ని గుర్తించి, కాయిన్లలో సరైన విలువతో మీ ఖాతాను క్రెడిట్ చేసేలా మమ్మల్ని చేసేందుకు ఒక లావాదేవీ ఐడిని మేము పంచుకుంటాము.

సేవా ప్రదాతలు

ప్లాట్‌ఫాం సురక్షతమైనది, ఆస్వాదించదగిన ప్రదేశం అని నిర్ధారించుకునేందుకు, క్లౌడ్ సేవా ప్రదాతలు మరియు కంటెంట్ ఆధునీకరణా సేవా ప్రదాతలు వంటి మా వ్యాపారానికి సహకరించే సేవా ప్రదాతలకు మేము సమాచారాన్ని, కంటెంట్‌ను అందిస్తాము.

అనలిటిక్స్ ప్రదాతలు

ప్లాట్‌ఫాం ఆప్టిమైజేషన్, మెరుగుదలలో మాకు సహాయపడేందుకు అనలిటిక్స్ ప్రదాతలను మేము ఉపయోగిసతాము. లక్షిత ఉద్దేశ్యాలను అందించడంలో కూడా మా తృతీయ పక్ష అనలిటిక్స్ ప్రదాతలు మాకు సహాయపడతారు

ప్రకటనదారులు మరియు ప్రకటనలు అందించే నెట్‌వర్కులు

ప్లాట్‌ఫాం మీది ఏఏ యూజర్లు, ఎంతమంది యూజర్లు ఒక ప్రకటనను చూశారు లేదా దాని మీద క్లిక్ చేశారు అనేది చూపించేందుకు ప్రకటనదారులతో మరియు తృతీయ పక్ష మెజర్‌మెంట్ కంపెనీలతో మేము సమాచారాన్ని పంచుకుంటాము. మేము మీ డివైజ్ ఐడిని మెజర్‌మెంట్ కంపెనీలతో పంచుకుంటాము, తద్వారా ప్లాట్‌ఫాం మీది మీ కార్యకలాపాన్ని ఇతర వెబ్‌సైట్ల మీది మీ కార్యకలాపంతో మేము లింక్ చేయవచ్చు; ఆపై బహుశా మీకు ఆసక్తిగా ఉండగల ప్రకటనలను మీకు చూపేందుకు మేము ఈ సమాచారాన్ని ఉపయోగిస్తాము.

మా కార్పొరేట్ సమూహం

చట్టవిరుద్ధ వినియోగాన్ని నివారించి, యూజర్లకు సహకరించేందుకు, ప్లాట్‌ఫామను మెరుగుపరచి, ఆప్టిమైజ్‌ చేయడంతో సహా ప్లాట్‌ఫాంకు అందించేందుకు, ఇతర సభ్యులు, సబ్సిడరీలు, లేదా మా కార్పొరేట్ సమూహ అనుబంధీకులకు కూడా మేము మీ సమాచారాన్ని పంచుకుంటాము.

చట్టం అమలు

చట్టాన్ని అమలుచేసే ఏజెన్సీలు, ప్రభుత్వ అధికారులు లేదా అలా చేసేందుకు చట్టరీత్యా అవసరమైతే లేదా అటువంటి వినియోగం కింది వాటికి సహేతుకంగా అవసరమైతే, ఇతర సంస్థలతో మేము మీ సమాచారాన్ని పంచుకుంటాము:

 • చట్టపరమైన బాధ్యత, ప్రక్రియ లేదా అభ్యర్ధనకు అనుగుణంగా;
 • మా సేవా నియమాలు, ఇతర ఒప్పందాలు, పాలసీలు మరియు ప్రమాణాలు, వాటికి చేసిన ఏదేనీ సంభావ్య ఉల్లంఘన మీది విచారణతో సహా అమలు చేసేందుకు;
 • భద్రత, మోసపూరిత లేదా సాంకేతికత సమస్యలను గుర్తించేందుకు, నివారించేందుకు లేదా ఇతరత్రా అడ్రస్ చేసేందుకు; లేదా 
 • చట్టపరంగా అవసరమైనట్లుగా లేదా అనుమతించినట్లుగా మా యొక్క, మా యూజర్ల యొక్క, ఒక తృతీయ పక్ష లేదా ప్రజల బహిరంగ హక్కులు, ఆస్తులు లేదా భద్రతను రక్షించేందుకు (ఇతర కంపెనీలు మరియు సంస్థలతో మోసాల నుండి సంరక్షణ మరియు క్రెడిట్ రిస్క్ తగ్గించే ప్రయోజనాల కొరకు సమాచార మార్పిడితో సహా).

బహిరంగ ప్రొఫైల్స్

మీ ప్రొఫైల్ పబ్లిక్ ఐతే, ప్లాట్‌ఫాం మీద ఉన్న ఎవరికైనా మీ సమ్మతి కనబడుతుంది, మీ స్నేహితులు, ఫాలోయర్లు అలాగే శోధనా ఇంజన్లు, కంటెంట్ అగ్రిగేటర్లు మరియు వార్తా సైట్ల వంటు తృతీయ పక్షాల ద్వారా కూడా యాక్సెస్ చేయబడవచ్చు లేదా పంచుకోబడవచ్చు అని దయచేసి గమనించండి. మీరు ఒక వీడియోను అప్‌లోడ్ చేసిన ప్రతిసారీ ఎవరు ఆ వీడియోను చూడవచ్చు అన్న దానిని మీరు మార్చవచ్చు. ప్రత్యామ్నాయంగా, “నా అకౌంట్‌ను నిర్వహించండి” సెట్టింగులు లో ‘ప్రైవేట్ అకౌంట్’ కు మీ సెట్టింగులను మార్చడం ద్వారా మీరు మీ ప్రొఫైల్‌ను డీఫాల్ట్‌ ప్రైవేట్‌కు మార్చవచ్చు.. 

విక్రయం లేదా విలీనం

మేము మీ సమాచారాన్ని తృతీయ పక్షాలకు కూడా వెల్లడిస్తాము:

 • ఏదైనా వ్యాపారం లేదా ఆస్తులను (లిక్విడేషన్, దివాలా లేదా ఇతరత్రా దేని వల్లైనా) మేము అమ్మినా లేదా కొన్నప్పుడు, అటువంటి వ్యాపారం లేదా ఆస్తులను కొనుగోలు చేయబోయే లేదా విక్రయించబోయే వారికి మీ వివరాలను మేము వెల్లడిస్తాము;
 • ఇతర కంపెనీలు లేదా వ్యాపారాలకు మేము విక్రయించినా, వారి నుండి కొన్నా, వారితో విలీనం ఐనా, వారి స్వాధీనంలోకి వెళ్ళినా, లేదా మా ఆస్తులను అన్నింటినీ లేదా కొన్నింటిని అమ్మినా. అటువంటి లావాదేవీలలో, బదిలీ చేయబడిన ఆస్తులలో యూజర్ సమాచారం కూడా ఉండవచ్చు.

5. మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎక్కడ భద్రపరుస్తాము

మేము మీ నుండి సేకరించే వ్యక్తిగత సమాచారం మీరు నివశించే దేశానికి వెలుపల, సింగపూర్ లేదా యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్న ఒక సర్వర్‌లో భద్రపరచబడవచ్చు. మీకు మా సేవలను అంతర్జాతీయంగా, నిరంతరంగా అందించేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన సర్వర్లను మేము నిర్వహిస్తాము.

6. మీ ఛాయీస్‌లు

టిక్‌టాక్‌లోకి సైన్‌ఇన్ చేసి దాదాపుగా మీ ప్రొఫైల్ సమాచారం అంతటినీ మీరు యాక్సెస్ చేసి, సవరించవచ్చు. మీరు అప్‌లోడ్ చేసిన యూజర్ కంటెంట్‌ను మీరు తొలగించవచ్చు. మిగిలిన వారిలో మీ వీడియోలను ఎవరు చూడవచ్చు, మీ వీడియోలను ఎవరు చూడవచ్చు, ఎవరు మీకు సందేశాలు పంపవచ్చు, లేదా మీ వీడియోలకు వ్యాఖ్యలను పోస్ట్ చేయవచ్చు అనే వాటిని నియంత్రించేలా మీకు అనుమతించేందుకు సెట్టింగులలో ఎన్నో టూల్స్ కూడా మేము మీకు అందిస్తాము. మీరు కావాలనుకుంటే, సెట్టింగులలో మీ అకౌంట్ మొత్తాన్ని మీరు బహుశా తొలగించవచ్చు. ఆ టూల్స్‌ ఎలా ఉపయోగించాలి అనే దాని మీద మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, లేదా మీరు నివశిస్తున్న దేశంలో మీకు బహుశా ఉండగల ఏవేనీ హక్కుల గురించి తెలుసుకోవాలనుకుంటే, దయచేసి మమ్మల్ని privacy@tiktok.com వద్ద సంప్రదించండి,. 

7. మీ వ్యక్తిగత వివరాల భద్రత

మీ సమాచారం సురక్షతంగా, ఈ పాలసీతో అనుగుణంగా పరిగణించబడేలా నిర్ధారించుకునేందుకు మేము చర్యలు తీసుకుంటాము. దురదృష్టవశాత్తు, ఇంటర్నెట్ ద్వారా సమాచార ప్రసారం పూర్తిగా సురక్షతం కాదు. అయినప్పటికీ ఉదాహరణకు, ఎన్క్రిప్ట్ చేయడం ద్వారా, మేము మీ వ్యక్తిగత వివరాలను మేము సంరక్షిస్తాము, ప్లాట్‌ఫాం ద్వారా ప్రసారం చేయబడిన మీ సమాచార భద్రతకు మేము హామీ ఇవ్వలేము; ఏదేనీ ప్రసారం మీ స్వంత రిస్క్ మీదనే ఉంటుంది.

మీ యొక్క, ఇతర యూజర్ల యొక్క హక్కులు మరియు స్వేచ్ఛల కొరకు మారుతూ ఉండే సంభావ్యత మరియు తీవ్రతల రిస్కుకు తగిన విధంగా భద్రతా స్థాయిని నిర్ధారించుకునేందుకు తగిన సాంకేతికత మరియు నిర్మాణాత్మక ప్రమాణాలను మేము కలిగి ఉన్నాము. ఈ సాంకేతిక మరియు నిర్మాణాత్మక ప్రమాణాలను మేము నిర్వహించి, మా సిస్టంల సమగ్ర భద్రతను మెరుగుపరచేందుకు ఎప్పటికప్పుడు మేము వాటిని సవరిస్తాము.

మేము ఎప్పటికప్పుడు మా భాగస్వామ్య నెట్‌వర్కులు, ప్రకటనదారులు మరియు అనుబంధీకుల వెబ్‌సైట్లకు లేదా నుండి లింకులను చేరుస్తాము. ఈ వెబ్‌సైట్లకు వేటికైనా ఉన్న లింకును మీరు ఫాలో అయితే, ఈ వెబ్‌సైట్లు వాటి స్వంత గోప్యతా విధానాలను కలిగి ఉంటాయని, ఈ పాలసీలకు ఎటువంటి బాధ్యతను గానీ లేదా ఉత్తరదాయిత్వాన్ని గానీ మేము అంగీకరించమని దయచేసి గమనించండి. ఈ వెబ్‌సైట్లకు ఏదైనా సమాచారాన్ని మీరు సమర్పించే ముందు ఈ పాలసీలను దయచేసి చెక్ చేసుకోండి.

8. మేము మీ వ్యక్తిగత వివరాలను ఎంతకాలం ఉంచుకుంటాము

మీకు సేవను అందించవలసిన అవసరమున్నంత కాలం మేము మీ సమాచారాన్ని ఉంచుకుంటాము. మీకు సేవను అందించే క్రమంలో మీ సమాచారం మాకు అవసరం లేని చోట్ల, అటువంటి వివరాలను  ఉంచుకునేందుకు చట్టబద్ధమైన వ్యాపార ప్రయోజనం మాకు ఉన్నంత కాలం మాత్రమే మేము దానిని ఉంచుకుంటాము. అయితే, మా చట్టబద్ధమైన నియమాలకు అనుగుణంగా లేదా చట్టబద్ధమైన దావాల ఏర్పాటు, అమలు లేదా పరిహారం కొరకు అవసరమైన చోట్ల ఈ వివరాలను ఎక్కువ కాలం మేము ఉంచుకోవలసి ఉండే సందర్భాలు ఉన్నాయి.

మీరు మా ప్లాట్‌ఫాంను వినియోగించడం నిలిపివేసిన తరువాత, మేము మీ సమాచారాన్ని సముచ్చిత మరియు అనామక ఫార్మాట్‌లో భద్రపరుస్తాము.

9. చిన్నపిల్లలకు సంబంధించిన సమాచారం

13 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు కలిగిన చిన్నారులకు టిక్‌టాక్ నిర్దేశించబడలేదు. కొన్ని సందర్భాలలో, స్థానిక నియంత్రణా ఆవశ్యకతల కారణంగా ఈ వయో పరిమితి ఎక్కువగా ఉండవచ్చు, మరింత సమాచారం కొరకు స్థానిక గోప్యతా విధానాన్ని దయచేసి చూడండి. సంబంధిత వయస్సు కన్నా తక్కువ వయస్సు కలిగిన వారి నుండి వ్యక్తిగత సమాచారం సేకరించినట్లుగా లేదా వారి గురించిన వ్యక్తిగత సమాచారం మా వద్ద ఉన్నట్లుగా మీకు అనిపిస్తే, mailto:privacy@tiktok.com వద్ద దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

10. ఫిర్యాదులు

మేము మీ వ్యక్తిగత వివరాలను ఎలా ప్రాసెస్ చేస్తాము అనే దాని గురించి మీరు ఏదైనా ఫిర్యాదు చేయాలనుకున్న సందర్భంలో, ముందుగా privacy@tiktok.com వద్ద దయచేసి మమ్మల్ని సంప్రదించండి, మీ అభ్యర్ధనతో వీలైనంత త్వరగా వ్యవహరించేందుకు మేము ప్రయత్నిస్తాము. సంబంధిత డేటా ప్రొటెక్షన్ అథారిటీతో దావా వేసేందుకు మీ హక్కులపై ప్రతికూల ప్రభావాన్ని చూపదు.

11. మార్పులు

ఈ పాలసీకి చేసే ఏవేనీ మెటీరియల్ మార్పుల గురించి ప్లాట్‌ఫాం ద్వారా అందించబడిన ఒక నోటీసు ద్వారా యూజర్లు అందరికీ మేము సాధారణంగా తెలియజేస్తాము. అయితే, ఏవేని మార్పులు జరిగాయేమో  అన్న దాని కోసం మీరు క్రమవారీగా ఈ పాలసీని చెక్ చేసుకోవాలి.  ఈ పాలసీ పై భాగంలో “చివరగా నవీకరించబడిన తేదీ”ని కూడా మేము నవీకరిస్తాము, అది అటువంటి పాలసీ అమలు అయ్యే ఆరంభ తేదీని సూచిస్తుంది. నవీకరించబడిన పాలసీ తేదీ తరువాత ప్లాట్‌ఫాం మీద మీరు చేసే నిరంతర యాక్సెస్ లేదా ప్లాట్‌ఫాం వినియోగం, నవీకరించబడిన పాలసీకి మీ సమ్మతిని తెలుపుతుంది. నవీకరించబడిన పాలసీని మీరు అంగీకరించనట్లైతే, ప్లాట్‌ఫాంను యాక్సెస్ చేయడం లేదా వినియోగించడాన్ని మీరు నిలిపివేయాలి.

12. సంప్రదింపు

ఈ పాలసీకి సంబంధించి ప్రశ్నలు, వ్యాఖ్యలు, అభ్యర్ధనలను privacy@tiktok.com కు రాయాలి.

అనుబంధక నియమాలు– న్యాయపరిధి-నిర్దిష్టమైనవి

సేవలను మీరు యాక్సెస్ చేసే లేదా ఉపయోగించే ప్రాంతంలోని మీ న్యాయపరిధికి సంబంధించిన అనుబంధక నియమాలు –న్యాయపరిధి-నిర్దిష్టమైన నిబంధనలు మరియు మిగిలిన పాలసీకి మధ్య ఏదేని విభేదం ఉన్న సందర్భంలో, సంబంధిత న్యాయపరిధి యొక్క అనుబంధిత నియమాలు – న్యాయపరిధి-నిర్దిష్టమైనవి అమలు అవుతాయి మరియు నియంత్రిస్తాయి.

భారతదేశం. మీరు మా సేవలను భారతదేశంలో ఉపయోగిస్తున్నట్లైతే, ప్లాట్‌ఫాంను బైట్‌డ్యాన్స్ (ఇండియా) టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అందిస్తుంది. సేవలను అందించి, ప్రమోట్ చేసే మా బ్రాండు టిక్‌టాక్. భారతదేశం నుండి ఈ సేవలను ఉపయోగించేటప్పుడు, బేట్‌డ్యాన్స్ (ఇండియా) టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్‌కు సూచించేందుకు ఈ పాలసీలో “టిక్‌టాక్”, “మేము” లేదా “మాకు” దయచేసి అనుగుణంగా చదవండి.