సంఘ మార్గదర్శకాలు

చివరి సారిగ నవీకరించబడింది: జనవరి 2020

సృజనాత్మకతకు స్ఫూర్తినిచ్చి, సంతోషాన్ని కలిగించడమేటిక్‌టాక్ యొక్క లక్ష్యం. వినియోగదారులు ప్రమాణికతతో సృష్టించి, పంచుకోవడం, తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కనుగొని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరితో అనుసంధానం కావడం కోసం మేము ఒక గ్లోబల్ సంఘాన్ని నిర్మిస్తున్నాము. ఈ సంఘాన్ని సురక్షితంగా ఉంచడానికి కూడా మేము కట్టుబడి ఉన్నాము. మా సంఘ మార్గదర్శకాలలో మా విలువలు ప్రతిబింబిస్తాయి, ఇవి మా ప్లాట్‌ఫారమ్ యొక్క ప్రవర్తనా నియమావళిని నిర్వచిస్తాయి. మా సంఘాన్ని ఒక సురక్షితమైన ఉమ్మడి ప్రదేశంగా ఉంచడంలో ఈ మార్గదర్శకాలు సహాయపడతాయి.

టిక్‌టాక్ అనేది భావ ప్రకటన ఆధారితంగా నిర్మించిబడిన ఒక సమగ్ర వేదిక. వినియోగదారులు తమ ప్రత్యేకతలను చూపుతూనే, అటువంటి ప్రత్యేకతలను కలిగిఉన్న వర్గాన్ని కనుగొనేలా మేము వారిని ప్రోత్సహిస్తాము. మా వినియోగదారులు వివిధ రకాల జాతులు, సంస్కృతుల నుండి వస్తారు అనేదాన్ని మేము గౌరవిస్తాము మరియు మేము పని చేసే దేశాలలో ఉన్న స్థానిక సంస్కృతులు, నియమాలను మేము తప్పక పరిగణంలోకి తీసుకుంటాము.

సురక్షితమైన మరియు సహాయక వాతావరణాన్ని ఏర్పాటు చేయడం మా మొదటి ప్రాధాన్యత. అందరూ స్వేచ్ఛగా, నిరభ్యంతరంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలంటే వారికి సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించాలని మేము విశ్వసిస్తాము. అభ్యంతరకరమైన కంటెంట్‌ను, ఖాతాలను మా ప్లాట్‌ఫారమ్ నుండి తీసివేయడం ద్వారా, అందరూ సాధికారికమైన సంభాషణలు జరిగే వాతావరణాన్ని పెంపొందించడమే మా లక్ష్యం.

మా విలువలే మా సంఘ మార్గదర్శకాలకు పునాది వేస్తాయి. మా సంఘ మార్గదర్శకాలను ఉల్లంఘించే వీడియో, ఆడియో, చిత్రం, వచనం వంటి కంటెంట్‌ను మేము తీసివేస్తాము మరియు తీవ్రమైన లేదా పునరావృత ఉల్లంఘనలకు పాల్పడుతున్న ఖాతాలను నిలిపివేస్తాము లేదా నిషేధిస్తాము. కొన్ని సందర్భాలలో, మేము మా సంఘాన్ని సురక్షితంగా ఉంచడానికి మరింత జాగ్రత్త కోసం, మేము ఖాతాల గురించి సంబంధిత చట్టపరమైన సంస్థలకు నివేదిస్తాము.

టిక్‌టాక్లో ఉన్న ప్రతి ఒక్కరికి మరియు షేర్ చేయబడే ప్రతిదానికీ మా సంఘ మార్గదర్శకాలకు వర్తిస్తాయి. ప్లాట్‌ఫారమ్‌లో ఏవి అనుమతించబడతాయి, అనుమతించబడవు అన్నవి ఇవి సాధారణ ప్రేక్షకులకు తెలియజేస్తాయి. కొన్నిసార్లు పబ్లిక్‌కు విలువైన కంటెంట్‌ను మా మార్గదర్శకాల ప్రకారం తీసివేయాల్సి వస్తుందని కూడా మాకు తెలుసు. కనుక, దిగువ విభాగాలలో వివరించిన ప్రకారం కొన్ని సందర్భాలలో మేము మినహాయింపులను అనుమతిస్తాము.

సంఘ ప్రవర్తనతో అభివృద్ధి చెందడానికి, పెరుగుతున్న ప్రమాదాలను తగ్గించడానికి మరియు సృజనాత్మకత మరియు సంతోషం కోసం టిక్‌టాక్‌ను సురక్షితమైన ప్రదేశంగా ఉంచడానికి మేము ఎప్పటికప్పుడు మా కమ్యూనిటీ మార్గదర్శకాలను నవీకరిస్తాము.

ప్రమాదకరమైనవ్యక్తులు మరియుసంస్థలు

ఉగ్రవాదం, నేరం లేదా ఇతర రకాల హానికరమైన ప్రవర్తనలను ప్రచారం చేసే వ్యక్తులు లేదా సంస్థలను మేము మా ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించడానికి అనుమతించము. ప్రజా భద్రతకు నమ్మదగిన ముప్పుఉన్నపుడు, మేము ఆ ఖాతాను నిషేధించి, ఆ విషయాన్ని సంబంధిత చట్టసంస్థలకు నివేదించి, వారికి సహకరిస్తాము.

ఉగ్రవాదాలు, ఉగ్రవాద సంస్థలు

రాజకీయాలు, మతం, జాతి లేదా భావజాలం ఆధారంగా ప్రజలు, ప్రభుత్వం లేదా అంతర్జాతీయ సంస్థలను బెదిరించడం లేదా భయపెట్టడం కోసం సాధారణ వ్యక్తులకు హాని కలిగించేలా ముందుగా ప్రణాళిక రచించిన హింసకు పాల్పడే లేదా హానులను కలిగించే అనధికారిక వ్యక్తులను ఉగ్రవాదులు మరియు ఉగ్రవాద సంస్థలు అని అంటారు. 

ఇతర హానికరమైన వ్యక్తులు, సంస్థలు

నేరాలకు పాల్పడే లేదా ఇతర రకాల తీవ్రమైన హానులను కలిగించే వారిని మేము ప్రమాదకరమైన వ్యక్తులు మరియు సంస్థలు అని అంటాము. ఇటువంటి సంస్థలు మరియు నేరాలలో ఈ క్రిందివిఉన్నాయి, కానీ వీటికి మాత్రమే పరిమితం కాదు:

 • ద్వేషపూరిత సమూహాలు
 • హింసాత్మకమైన తీవ్రవాద సంస్థలు
 • ప్రాణనష్టం
 • మనుషుల అక్రమ రవాణా
 • అవయవాల అక్రమ రవాణా
 • ఆయుధాల అక్రమ రవాణా
 • మత్తుపదార్థాల అక్రమ రవాణా
 • అపహరణ
 • బలవంతపు వసూలు
 • బెదిరింపులు
 • అక్రమ నగదు లావాదేవీలు
 • మోసం 
 • సైబర్ నేరం

వీటిని పోస్ట్ చేయవద్దు:

 • ప్రమాదకరమైన వ్యక్తులు మరియు/లేదా సంస్థలకు సంబంధించిన పేర్లు, గుర్తులు, లోగోలు, జండాలు, నినాదాలు, దుస్తులు, సంజ్ఞలు, బొమ్మలు లేదా ఇతర వస్తువులు
 • ప్రమాదకరమైన వ్యక్తులు మరియు/లేదా సంస్థలకు మద్దతుగా, ప్రోత్సాహకంగా లేదా సహాయకరంగా ఉండే కంటెంట్
 • మినహాయింపులు: ప్రమాదకరమైన వ్యక్తులు మరియు/లేదా సంస్థల వల్ల కలుగుతున్న హానుల వ్యతిరేకంగా లేదా వాటి పట్ల అవగాహన కల్పించడం కోసం అని స్పష్టంగా తెలిసే విధంగా ఉన్న విద్య, చరిత్ర, వ్యంగ్యం, కళాత్మకం మరియు ఇతర రకాల కంటెంట్


చట్టవిరుద్ధ కార్యకలాపాలు, నిషేధిత వస్తువులు

నేరపూరితమైన పనులను చూపడం లేదా ప్రచారం చేయడంతో పాటు కొన్ని నిషేధిత వస్తువుల వర్తకం, విక్రయం, ప్రచారం లేదా వినియోగాన్ని మేము నిషేధించాము. కొన్ని రకాల చర్యలు లేదా వస్తువులకు స్థానిక చట్టాల ప్రకారం అనుమతి ఉన్నా కూడా, ప్రపంచంలోని చాలా భాగాలు లేదా ప్రాంతాలలో చట్టవ్యతిరేకంగా భావించే చర్యలు లేదా నిషేధించిన వస్తువులకు సంబంధించిన కంటెంట్‌ను మేము తీసివేస్తాము. ప్రజలకుఉపయోగపడే విద్య, విజ్ఞానం, కళ, వార్తలకు సంబంధించిన విషయాలను తెలియజేసే కంటెంట్‌కు మినహాయింపు ఉంటుంది.

నేరపూరిత కార్యకలాపాలను ప్రచారం చేయడం

దొంగతనం, దాడి, మనుషుల పట్ల దుష్ప్రవర్తన మరియు ఇతర హానికరమైన ప్రవర్తనతో పాటు చట్టప్రకారం శిక్షించగల అన్ని రకాల చర్యలను మేము నేరపూరితమైన పనులుగా భావిస్తాము. అటువంటి ప్రవర్తనను సాధారణంగా లేదా నాటకీయంగా చూపడం సాధ్యం కాదని మేము భావిస్తాము కనుక నేరపూరితమైన పనులను ప్రచారం చేసే కంటెంట్‌ను తొలగిస్తాము.
వీటిని పోస్ట్ చేయవద్దు: 

 • దొంగతం లేదా అపహరణ వంటి భౌతిక దాడులను ప్రచారం చేసే కంటెంట్
 • స్వాటింగ్ వంటి ప్రాంక్‌లతో పాటు ఇతరుల భద్రతకు హాని కలిగించే కంటెంట్
 • మనుషుల పట్ల దుష్ప్రవర్తన లేదా జంతువుల అక్రమ రవాణాను ప్రోత్సహించే కంటెంట్
 • చట్టవిరుద్ధంగా సంపాదించిన వస్తువుల కొనుగోలు, విక్రయం లేదా వర్తకాన్ని అందించే కంటెంట్
 • నేరపూరితమైన పనులను ఎలా చేయాలో సూచనలు అందించే కంటెంట్

ఆయుధాల విక్రయం లేదా వినియోగం

మా సంఘాన్ని రక్షించడం కోసం, సాధారణంగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు, తుపాకులు లేదా బాంబులు వంటి వాటిని చూపడానికి, విక్రయించడానికి లేదా ప్రచారం చేయడానికి మేము అనుమతించము. ఆ ఆయుధాలను ఎలా తయారు చేయాలో చూపించే సూచనలను కూడా మేము నిషేధించాము. కింది సందర్భాలలో మాత్రం అటువంటి ఆయుధాలు లేదా ఇతర రకాల పేలుడు పదార్థాలను చూపే కంటెంట్కు మేము మినహాయింపు ఇవ్వవచ్చు: ఒక కల్పిత నేపధ్యంలో, మ్యూజియం సేకరణలో భాగంగా, ఒక పోలీసు అధికారి చేత, సైనిక కవాతులో లేదా షూటింగ్ పరిధి వంటి సురక్షితమైన మరియు నియంత్రిత వాతావరణంలో ఉపయోగించినప్పుడు.
వీటిని పోస్ట్ చేయవద్దు: 

 • పేలుడు పదార్థాలు, ఆయుధాలు, తుపాకులు లేదా బాంబులు వంటి వాటిని చూపించే కంటెంట్
 • పేలుడు పదార్థాలు, వాటి విడిభాగాలు, తూపాకులను అందించే, విక్రయించే, వ్యాపారం చేసే లేదా ప్రచారం చేసే లేదా వాటిని తయారు చేయడాన్ని నేర్పించే కంటెంట్ 

మత్తుపదార్థాలు మరియు నియంత్రిత పదార్థాలు

మా సంఘాన్ని రక్షించడం కోసం, మత్తుపదార్థాలు లేదా ఇతర నియంత్రిత పదార్థాల వినియోగం లేదా వ్యాపారాన్ని చూపించే కంటెంట్‌ను మేము అనుమతించము.
వీటిని పోస్ట్ చేయవద్దు: 

 • మత్తుపదార్థాలను, వాటి వినియోగాన్ని లేదా మత్తుపదార్థాలు లేదా ఇతర నియంత్రిత పదార్థాల తయారీ, వినియోగం లేదా వ్యాపారాన్ని ప్రోత్సహించే కంటెంట్
 • మత్తుపదార్థాలు లేదా ఇతర నియంత్రిత పదార్థాల తయారీ, వినియోగం లేదా వ్యాపారాన్ని ప్రోత్సహించే కంటెంట్
 • చట్టవిరుద్ధమైన లేదా నియంత్రిత పదార్థాలను ఎలా కొనుగోలు చేయాలిఅనేటువంటి సమాచారాన్ని అందించే కంటెంట్

మోసాలుమరియు స్కామ్‌లు

ప్రజలను మోసం చేయడం లేదా వారి ఆస్తులను దొంగిలిచేటువంటి పధకాలు వంటి వాటిని, ఇతరులకు హాని కలిగించడానికి మేము మా ప్లాట్ఫారమ్లో ఎవ్వరినీ అనుమతించము. చట్టవ్యతిరేకమైన ఆర్థిక ప్రయోజనాలను పొందడం కోసం ఇతరులను ఉద్దేశపూర్వకంగా మోసం చేసే కంటెంట్‌ను మేము తొలగిస్తాము.
వీటిని పోస్ట్ చేయవద్దు:

 • ఫిషింగ్‌ను ప్రచారం చేసే కంటెంట్
 • పాంజి లేదా పిరమిడ్ పధకాలను ప్రచారం చేసే కంటెంట్
 • ఫిక్స్డ్ బెట్టింగ్, త్వరగా డబ్బు సంపాదన పధకాలు లేదా ఇతర రకాల స్కామ్‌లను ప్రచారం చేసే కంటెంట్


హింసాత్మకమైన మరియు గ్రాఫిక్ కంటెంట్

హింసను లేదా చిత్రవధను ప్రచారం చేసే లేదా ప్రోత్సహించే విధంగా ఉన్న జుగుప్సాకరమైన లేదా షాకింగ్ కంటెంట్‌ను మేము అనుమతించము. మేము కొన్ని సందర్భాలకు మినహాయింపులను అనుమతిస్తాము, ఉదాహరణకు, సమస్యలకు సంబంధించిన వార్తలను చూపడం లేదా సమస్యల గురించి అవగాహన పెంచడానికి ఉద్దేశించిన కంటెంట్. హింస లేదా ప్రజా భద్రతకు ప్రమాదం ఏర్పడుతుందని మేము గుర్తించినప్పుడు, మేము ఆ ఖాతాను నిషేధించిమరియు అవసరమైన విధంగాసంబంధిత చట్ట సంస్థలతో సహకరిస్తాము.

హింసాత్మకమైన మరియు గ్రాఫిక్ కంటెంట్: మనుషులు

వీటిని పోస్ట్ చేయవద్దు:

 • తీవ్రమైన షాకింగ్, శాడిస్టిక్ లేదా ప్రత్యేకించిన గ్రాఫిక్ కంటెంట్లో ఇవి ఉన్నాయి కానీ వీటికే పరిమితం కాదు:
  • నిజమైన వ్యక్తులతో కూడిన హింసాత్మక లేదా ప్రమాదవశాత్తు జరిగిన మరణాలను చూపడం 
  • విచ్ఛిన్నమైన, తొలగించబడిన, కాలిన మచ్చలు లేదా కాలిపోయిన మానవ అవశేషాలను చూపడం 
  • తీవ్రమైన గాయం లేదా దెబ్బను ప్రధానంగా చూపే హత్యలను చూపడం
  • తీవ్రమైన శారీరక హింసను చూపడం. 
  • మినహాయింపులు:ప్రదర్శించిన లేదా వృత్తిపరమైన పోరాటం, సాంప్రదాయ యుద్ధ కళలు లేదా కల్పిత నేపధ్యంలో పోరాటం

హింసాత్మకమైన మరియు గ్రాఫిక్ కంటెంట్: జంతువులు

వీటిని పోస్ట్ చేయవద్దు:

 • తీవ్రమైన షాకింగ్, శాడిస్టిక్ లేదా ప్రత్యేకించిన గ్రాఫిక్ కంటెంట్లో ఇవి ఉన్నాయి కానీ వీటికే పరిమితం కాదు:
  • నిజమైన జంతువులను చంపడాన్ని చూపడం
  • జంతువులవిచ్ఛిన్నమైన, తొలగించబడిన, కాలిన మచ్చలు లేదా కాలిపోయిన అవశేషాలను చూపడం 
  • జంతువుల పట్ల క్రూరత్వాన్ని చూపడం


ఆత్మహత్య, స్వీయ-హాని, హానికరమైన చర్యలు

హాని కలిగించే చర్యలలో పాల్గొనడాన్ని మేము ప్రోత్సహించము. ప్రమాదకరమైన కార్యకలాపాల్లో పాల్గొనడానికి ఇతరులను ప్రోత్సహించడానికి మేము వినియోగదారులను అనుమతించము. స్వీయ-హాని లేదా ఆత్మహత్యను ప్రచారం చేసే కంటెంట్‌ను మేము అనుమతించము, కానీ ఇటువంటి సమస్యల పట్ల అవగాహనను పెంచడం కోసం తమ అనుభవాలను పంచుకోవడానికి వినియోగదారులను అనుమతిస్తాము.

స్వీయ-హాని లేదా ఆత్మహత్య ఆలోచనలతో బాధపడుతున్నవినియోగదారులను  లేదా ఆత్మహత్య చేసుకోవాలని తీవ్రంగా ఆలోచిస్తున్నవారి గురించి తెలిసినవారిని తక్షణమే చట్ట సంస్థలను లేదా ఆత్మహత్య నివారణ హాట్‌లైన్‌ను సంప్రదించాలని మేము ప్రోత్సహిస్తాము. 

ఆత్మహత్య

ఆత్మహత్యాయత్నం లేదా స్వీయ-హాని కలిగించే మరణానికి దారితీసే చర్యలకు పాల్పడే లేదా చేయాలనుకునే వ్యక్తిని చూపించే కంటెంట్ కూడా ఇందులో ఉంటాయి. ఆత్మహత్యకు మద్దతిచ్చే, సహాయపడే లేదా ప్రోత్సహించే లేదా ఆత్మహత్య ఎలా చేసుకోవాలో నేర్పించే కంటెంట్‌ను మేము నిషేధించాము.
వీటిని పోస్ట్ చేయవద్దు:

 • ఆత్మహత్య ఎలా చేసుకోవాలో నేర్పించే కంటెంట్
 • ఆత్మహత్యకు మద్దతిచ్చే, సహాయపడే లేదా ప్రోత్సహించే కంటెంట్
 • ఆత్మహత్య సవాళ్లు
 • మినహాయింపులు: ఆత్మహత్య చేసుకోవాలనుకునే వ్యక్తులకు మద్దతు, వనరులు లేదా అధిగమించే పద్ధతులను అందించే కంటెంట్

స్వీయ-హాని

స్వీయ-హాని చేసుకోవడాన్ని మామూలు విషయం లాగా చేయడం, ప్రోత్సహించడం లేదాస్వీయ-హానిచేసుకునేలా రెచ్చగొట్టడాన్ని నివారించడం కోసం, వినియోగదారు ఉద్దేశం ఏదైనా కూడా, అటువంటి ప్రవర్తనను చూపించే చిత్రాలను మేము అనుమతించము. స్వయంగా చేసుకునే శారీరక గాయానికి దారితీసే చర్యలను ప్రోత్సహించే విధంగా లేదా ప్రోత్సహించే కంటెంట్‌ను మేము తీసివేస్తాము. అనారోగ్యానికి దారితీసే ఆహార అలవాట్లను ప్రచారం చేసే కంటెంట్‌కు కూడాప్లాట్‌ఫారమ్‌లో అనుమతి లేదు.
వీటిని పోస్ట్ చేయవద్దు:

 • స్వీయ-గాయాలను చూపించే కంటెంట్
 • స్వీయ-హాని ఎలా చేసుకోవాలో నేర్పించే కంటెంట్
 • బరువు తగ్గడం కోసం ప్రొ-యానా లేదా ఇతర ప్రమాదకరమైన అలవాట్లకు మద్దతిచ్చే కంటెంట్
 • మినహాయింపులు: అస్తవ్యస్తమైన ఆహారపుఅలవాట్లు కలిగిన వ్యక్తులకు లేదా స్వీయ-హాని చేసుకోవాలనుకునే వ్యక్తులకు మద్దతు, వనరులు లేదా అధిగమించేపద్ధతులను అందించే కంటెంట్

ప్రమాదకరమైన చర్యలు

ప్రమాదకరమైన పనులు లేదా ఇతర ప్రమాదకరమైన ప్రవర్తనలను నిపుణుల సహాయం లేకుండా లేదా అవసరమైన నైపుణ్యాలు లేకుండా చేయడం వల్ల వినియోగదారు లేదా పబ్లిక్‌కు తీవ్రమైన గాయం లేదా మరణానికి దారితీయవచ్చు. అపరిపక్వ స్టంట్‌లు లేదా ప్రమాదకరమైన సవాళ్లతో పాటు అటువంటి ప్రవర్తనను ప్రోత్సహించే, ప్రచారం చేసే లేదా మద్దతిచ్చే కంటెంట్‌ను మేము అనుమతించము.
వీటిని పోస్ట్ చేయవద్దు:

 • ప్రమాదకరమైన సాధనాలను అనుచితంగా ఉపయోగించడాన్ని చూపించే కంటెంట్
 • అనుమతి లేని పానీయాలను తాగుతున్నట్లు లేదా పదార్థాలను తింటున్నట్లు చూపించే కంటెంట్ 
 • గాయాలు కావడానికి దారితీసే ప్రమాదకరమైన సవాళ్లు
 • చట్టబద్ధమైన వయస్సు కంటే తక్కువ వయస్సుగల పిల్లలు మోటర్ వాహనాలను నడుపుతున్నట్లు చూపుతున్న కంటెంట్


ద్వేషపూరిత ప్రసంగం 

రక్షిత ప్రమాణాల ఆధారంగా వ్యక్తులు లేదా సమూహాల పట్ల దాడులు లేదా హింసను ప్రోత్సహించే కంటెంట్‌ను మేము అనుమతించము. ద్వేషపూరిత ప్రసంగాన్ని కలిగిన కంటెంట్‌ను మేము అనుమతించము, దానిని మా ప్లాట్‌ఫారమ్ నుండి తీసివేస్తాము. ద్వేషపూరిత ప్రసంగం ఉల్లంఘనలకు పునరావృతంగా పాల్పడే ఖాతాలను కూడా మేము నిలిపివేస్తాము. 

రక్షిత సమూహాలపై దాడులు

ద్వేషపూరిత ప్రసంగం అంటే రక్షిత లక్షణాల ఆధారంగా వ్యక్తులు లేదా సమూహాల పట్ల దాడి, బెదిరింపు, హింస లేదా అవమానవీయ పనులకు పాల్పడటం లేదా అందుకు రెచ్చగొట్టడం, క్రింది రక్షిత లక్షణాల ఆధారంగా వ్యక్తులు లేదా సమూహాల పట్ల మౌఖికం లేదా భౌతికంగా హింసాత్మక బెదిరింపులు లేదా హానిని చూపడానికి కూడా అనుమతించము.:

 • జాతి 
 • జాతీయత
 • జాతి మూలం 
 • మతం
 • కులం 
 • లైంగిక దృక్పథం
 • శృంగారం
 • లింగం
 • లింగం గుర్తింపు
 • తీవ్రమైన వ్యాధి లేదా వైకల్యం
 • ఇమ్మిగ్రేషన్ స్టేటస్

వీటిని పోస్ట్ చేయవద్దు:

 • ఎగువ ఉన్న లక్షణాలతో పాటు ఇతర అంశాల ఆధారంగా వ్యక్తులు లేదా సమూహాలను అమానవీయంగా చూపడం లేదా వారి పట్ల హింసను లేదా ద్వేషాన్ని రెచ్చగొట్టడం: 
  • వారి పట్ల భౌతికంగా లేదా నైతికంగా బలహీనం అని పేర్కొనడం
  • వారి పట్ల హింసను రెచ్చగొట్టడం లేదా మద్దతివ్వడం
  • వారిని నేరస్తులు అని చెప్పడం 
  • వారిని జంతువులు, పనికిరాని వస్తువులు లేదా జీవం లేని వస్తువులు అని ప్రతికూలంగా       పేర్కొనడం 
  • వారిని దూరంగా, బహిష్కరించడం లేదా వివక్ష చూపడాన్ని ప్రచారం చేయడం లేదా సమర్థించడం

స్లర్‌లు

స్లర్‌లు అంటే జాతి మూలం, జాతి లేదా ఎగువ పేర్కొన్న ఇతర లక్షణాల ఆధారంగా ఉపయోగించే అవమానకరమైన పదాలు. మేము అభ్యంతరకరమైన పదాలను ఉపయోగించి ద్వేషాన్ని రెచ్చగొట్టడానికి అంగీకరించము కనుక మా ప్లాట్‌ఫారమ్‌లో వాటికి అనుమతి లేదు. అయితే, కొన్నిసార్లు స్లర్‌లను స్వీయ-సూచనగా లేదా సందర్భానికి తగ్గట్లు ఉపయోగించవచ్చు అని మాకు తెలుసు. కనుక పాటలో లేదా స్వీయ-సూచనగా వ్యంగ్యంగా మరియు/లేదా ఇతర సముచిత సందర్భంలో ఉపయోగించినప్పుడు మేము మినహాయింపులు ఇస్తాము. 
వీటిని పోస్ట్ చేయవద్దు

 • అనుమతి లేని స్లర్‌లను రెచ్చగొట్టే కంటెంట్

ద్వేషపూరితమైన భావజాలం

మా ప్లాట్‌ఫారమ్ అందించే ఇన్‌క్లూజివ్, సపోర్టివ్ సంఘంలో ద్వేషపూరిత భావజాలాలకు స్థానము లేదు. ద్వేషపూరితమైన భావజాలాలను ప్రచారం చేసే కంటెంట్‌ను మేము తీసివేస్తాము. 
వీటిని పోస్ట్ చేయవద్దు

 • ఈ భావజాలాలకు సంబంధించిన వ్యక్తుల యొక్క లోగోలు, గుర్తులు, జెండాలు, నినాదాలు, దుస్తులు, సెల్యూట్‌లు, బొమ్మలు, చిత్రాలు లేదా చిత్రాలను సానుకూలంగా చూపడం కోసం ద్వేషపూరిత భావజాలాలను ప్రచారం చేసే కంటెంట్ 
 • బలమైన సాక్ష్యాలను కలిగిన, హింసాత్మక ఘటనలు జరగలేదని వాదించే కంటెంట్
 • ద్వేషపూరితమైన భావజాలాలను ప్రచారం చేసే సంగీతం లేదా సాహిత్యం 


వేధింపు, బెదిరింపు

వినియోగదారులు తమను ఇతరులు అవమానిస్తారని, బెదిరిస్తారని, భయపడెతారని లేదా వేధిస్తారని భయపడకుండా తమ భావాలను వ్యక్తం చేయాలి. దుర్భాషల కారణంగా ఎటువంటి మానసిక ఒత్తిడి పడుతుందో మాకు బాగా తెలుసు కనుక మా ప్లాట్‌ఫారమ్‌లో దుర్భాషలను లేదా చెడు ప్రవర్తనలను అనుమతించము. 

అభ్యంతరకరమైన ప్రవర్తన

మనుషుల శరీరం, తెలివి, వ్యక్తిత్వం, అలవాట్లు, శుభ్రత గురించి హింసాత్మక బెదిరింపులు, లైంగిక వేధింపులు, చౌకబారు ప్రకటనలతో పాటు అన్ని రకాల దుర్భాషలను మేము అనుమతించము.
వీటిని పోస్ట్ చేయవద్దు:

 • వ్యక్తుల పట్ల హింసను ప్రేరేపించే కంటెంట్
 • ఇతరుల మరణం, తీవ్రమైన అనారోగ్యం, భౌతిక లేదా ఇతర హానిని కోరుకునే కంటెంట్
 • హింస లేదా ప్రణాళికను కలిగిన వేధింపు రెచ్చగొట్టే కంటెంట్
 • తమ లైంగిక కార్యకలాపాల ఆధారంగా ఇతర వినియోగదారుల పట్ల చౌకబారు ప్రకటనలు చేసే లేదా అవాంఛిత లైంగిక సంపర్కాలు చేసే కంటెంట్
 • తెలివి, శరీరం, వ్యక్తిగత అలవాట్లు లేదా శుభ్రత వంటి లక్షణాల ఆధారంగా వ్యక్తుల పట్ల చౌకబారు వ్యాఖ్యలు చేసే కంటెంట్
 • భయానక దుర్ఘటనలను పొగుడుతున్న మరియు వాటి బాధితుల పట్ల చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్న కంటెంట్
 • ఇతర వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని దుర్భాషలతో కూడిన కంటెంట్‌ను సృష్టించడం కోసం TikTokలోని డ్యూయెట్, రియాక్షన్ లేదా ఎఫెక్ట్‌ ఫీచర్‌లను ఉపయోగించిన కంటెంట్

ఇతరుల గోప్యతను ఉల్లంఘించడం

వ్యక్తిగతంగా గుర్తించగల సమాచారాన్ని బయటపెట్టడం లేదా బయటపెడతామని బెదిరించడం వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడి ఏర్పడి, దాని కారణంగా నిజమైన జీవితంలో హాని కలగవచ్చు. మేము దీనిని దుర్వినియోగంగా భావిస్తాము, కనుక TikTokలో అనుమతించము.
వీటిని పోస్ట్ చేయవద్దు: 

 • నివాస చిరునామా, ప్రైవేట్ ఇమెయిల్ చిరునామా, ప్రైవేట్ ఫోన్ నంబర్, బ్యాంక్ స్టేట్‌మెంట్, సామాజిక భద్రతా సంఖ్య లేదా పాస్‌వర్ట్ సంఖ్య వంటి వ్యక్తిగతంగా గుర్తించగల సమాచారాన్ని బయటపెట్టిన లేదా బయటపెడతామని బెదిరించిన కంటెంట్
 • లైంగిక చిత్రాలు లేదా సమ్మతి లేకుండా పాల్గొన్న శృంగార చిత్రాలను బయటపెడతామని బెదిరింపులు


పెద్దల నగ్నత్వం, లైంగిక కార్యకలాపాలు

లైంగికంగా రెచ్చగొట్టే లేదా గ్రాటిఫయింగ్ కంటెంట్‌తో పాటు ఇటువంటి యానిమేటెడ్ కంటెంట్‌ను TikTokలో అనుమతించము. లైంగిక కంటెంట్ కారణంగా అనేక ప్రమాదాలు ఏర్పడవచ్చు, అంటే కొన్ని న్యాయస్థాన పరిధులలో చట్టపరమైన జరిమానాలు చెల్లించాల్సి రావడం, సమ్మతి లేకుండా తీసిన శృంగార చిత్రాలు (ఉదాహరణకు, రివెంజ్ పోర్న్) ద్వారా ఇతర వినియోగదారులకు హాని కలిగించడం. అలాగే, కొన్ని సంప్రదాయాల ప్రకారం బాహాటంగా శృంగార కంటెంట్‌ను చూపడం వల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చు. విద్య, డాక్యుమెంటరీ, శాస్త్రీయం లేదా కళాత్మక అవసరాల కోసం నగ్నత్వం, శృంగారభరితమైన కంటెంట్‌కు మేము మినహాయింపులు ఇస్తాము. ఉదాహరణకు, శస్త్ర చికిత్స ద్వారా స్తనమును తొలగించినప్పుడు ఏర్పడిన చారల గురించి చర్చిండం వంటివి అనుమతించబడతాయి.

లైంగిక దాడి

బలహీనత, అధికారం లేదా నమ్మకాన్ని లైంగిక అవసరాల కోసం దుర్వినియోగం చేయడం లేదా అందుకు ప్రయత్నించడంతో పాటు లైంగిక దాడి కారణంగా ఆర్థిక, సామాజిక లేదా రాజకీయ ప్రయోజనాన్ని పొందడాన్ని లైంగిక దాడి లాగా పరిగణిస్తారు.
వీటిని పోస్ట్ చేయవద్దు: 

 • సమ్మతి లేని శృంగార కార్యక్రమాలను చూపించే, ప్రచారం చేసే లేదా ప్రస్తావించే కంటెంట్
 • లైంగిక చర్చలు లేదా లైంగిక దాడులను చేసే, ప్రచారం చేసే లేదా దానిని సమర్థించే కంటెంట్

పెద్దల అశ్లీలత, నగ్నత్వం

సెక్సువల్ గ్రాటిఫికేషన్ కోసం లైంగిక అవయవాలు మరియు/లేదా కార్యకలాపాలను బహిరంగంగా ప్రదర్శించడాన్ని అశ్లీలత అంటారు. 
వీటిని పోస్ట్ చేయవద్దు: 

 • పెనిట్రేషన్, నాన్-పెనిట్రేటివ్ సెక్స్ లేదా ఓరల్ సెక్స్ వంటి లైంగిక కార్యకలాపాలను చూపించే కంటెంట్
 • మర్మాంగాలు, స్త్రీల చనుమొనలు లేదా పిరుదులను చూపించే కంటెంట్
 • లైంగిక ఉద్రేకాన్ని చూపించే కంటెంట్
 • లైంగిక వాంఛను చూపించే కంటెంట్ 


పిల్లల భద్రత

పిల్లల భద్రత మాకు చాలా ముఖ్యం, కనుక పిల్లల్ని ఇబ్బంది పెట్టడం లేదా వారిపై లైంగిక దాడి చేయడానికి మేము అస్సలు అంగీకరించము. పిల్లలపై లైంగిక దాడి, పిల్లల నగ్నత్వం లేదా లైంగిక దుర్వినియోగాన్ని డిజిటల్ ఫార్మాట్‌లో అయినా, నిజ జీవితంలో అయినా చూపించే లేదా ప్రసారం చేసే కంటెంట్‌ను అనుమతించము మరియు అటువంటి కంటెంట్ గురించి మేము సంబంధిత చట్టాన్ని అమలు చేసే సంస్థలకు నివేదిస్తాము. పిల్లలను నేరపూరిత కార్యకలాపాలలో చూపడానికి కూడా మేము అనుమతించము. 

TikTokను ఉపయోగించడానికి వినియోగదారులు తప్పక కనీస నిర్దిష్ట వయస్సును కలిగి ఉండాలి (మా సేవా నిబంధనలులో దీనిని పేర్కొన్నాము). పిల్లల ఖాతాలను గుర్తించినప్పుడు, మేము మా ప్లాట్‌ఫారమ్ నుండి ఆ ఖాతాలను తీసివేస్తాము మరియు ఏదైనా ప్రాంతంలో అందుబాటులో ఉంటే, వారికి మరింత సముచితమైన యాప్ అనుభవాన్ని సూచిస్తాము.

పిల్లల నగ్నత్వం, లైంగిక దాడి 

వ్యక్తిగత శరీర అవయవాలను చూపుతున్న నగ్నత్వాన్ని కలిగిన కంటెంట్, బలహీనత, అధికారం లేదా నమ్మకాన్ని లైంగిక అవసరాల కోసం దుర్వినియోగం చేయడం లేదా అందుకు ప్రయత్నించడంతో పాటు లైంగిక దాడి కారణంగా ఆర్థిక, సామాజిక లేదా రాజకీయ ప్రయోజనాన్ని పొందడాన్ని లైంగిక దాడి లాగా పరిగణిస్తారు.
వీటిని పోస్ట్ చేయవద్దు: 

 • పిల్లల వ్యక్తిగత శరీర అవయవాలను చూపుతున్న కంటెంట్
 • పిల్లల పట్ల లైంగిక దాడిని చూపుతున్న కంటెంట్
 • పిల్లలు ఉన్న పెనిట్రేషన్, నాన్-పెనిట్రేటివ్ సెక్స్ లేదా ఓరల్ సెక్స్ వంటి లైంగిక కార్యకలాపాలను చూపించే కంటెంట్
 • పిల్లల లైంగిక ఉద్రేకాన్ని చూపుతున్న కంటెంట్
 • పిల్లల్లో లైంగిక వాంఛికను చూపించే కంటెంట్

పిల్లల నేరపూరిత ప్రవర్తన 

మత్తుపదార్థాలు, మద్యపానం, పొగాకు వంటివి తీసుకోవడంతో పాటు ఇతర దుష్ప్రవర్తనలను నేరపూరిత ప్రవర్తన అని అంటారు.  
వీటిని పోస్ట్ చేయవద్దు:

 • పిల్లలు మద్యపానం, మత్తుపదార్థాలు లేదా పొగాకు ఉత్పత్తులను తీసుకుంటున్నట్లు, కలిగి ఉన్నట్లు లేదా కలిగి ఉండవచ్చని చూపుతున్న కంటెంట్

పిల్లల దుర్వినియోగం

పిల్లల దుర్వినియోగం అంటే తమ అధికారాన్ని ఉపయోగించి పిల్లల భౌతిక హాని మరియు/లేదా మానసిక ఒత్తిడి కలిగించడం. భౌతిక హాని అంటే ఉద్దేశపూర్వకంగా పిల్లల శరీరంపై గాయాలు చేయడం. మానసిక ఒత్తిడి అంటే పిల్లల పట్ల భౌతిక లేదా లైంగిక దాడి బెదిరింపులు చేయడం లేదా ఇతర రకాల బెదిరింపులు చేయడం.
వీటిని పోస్ట్ చేయవద్దు: 

 • పిల్లల పట్ల భౌతిక లేదా మానసిక దుర్వినియోగాన్ని చూపుతున్న కంటెంట్

పిల్లల్ను లైంగికంగా ఆకర్షించడం

లైంగికంగా ఆకర్షించడం అంటే పెద్దలు తమ అధికారాన్ని ఉపయోగించి పిల్లల్లో నమ్మకాన్ని ఏర్పరచుకుని, ఆ తర్వాత వారి పట్ల లైంగిక దాడి, లైంగిక దుర్వినియోగం లేదా సెక్సువల్ ట్రాఫికింగ్‌కు పాల్పడటం.
వీటిని పోస్ట్ చేయవద్దు:

 • పిల్లలను లైంగికంగా ఆకర్షించడాన్ని ప్రోత్సహించే, నేర్పించే లేదా సమర్థించే కంటెంట్ 
 • పిల్లల్ని లైంగికంగా రెచ్చగొట్టే సంభాషణలో చూపుతున్న కంటెంట్
 • లైంగికంగా రెచ్చొగట్టే విషయాలను పంచుకోవడానికి పిల్లలకు ప్రయోజనాలు చూపించే లేదా వారిని బెదిరించే కంటెంట్

పిల్లల్ని లైంగికంగా వాడుకోవడం

పిల్లల్ని లైంగికంగా చూపించే లేదా లైంగికంగా వాడుకునే కంటెంట్‌ను మేము అనుమతించము.
వీటిని పోస్ట్ చేయవద్దు: 

 • పిల్లల్ని లైంగికంగా రెచ్చగొట్టే నృత్యాలలో చూపించే కంటెంట్
 • పిల్లల్ని లైంగికంగా అభ్యంతరకమైన లేదా రెచ్చగొట్టే భాషలో మాట్లాడుతున్నట్లు చూపడం


సమగ్రత, ప్రమాణికత

మా సంఘంలోని సభ్యులను మోసం చేయడానికి లేదా తప్పుదారి పట్టించడానికి ఉద్దేశించిన కంటెంట్ కారణంగా మా విశ్వాసం-ఆధారిత సంఘానికి ప్రమాదం ఏర్పడుతుంది. అటువంటి కంటెంట్‌ను మా ప్లాట్‌ఫారమ్‌లో అనుమతించము. స్పామింగ్, ప్రతిరూపణ, తప్పుదారి పట్టించే ప్రచారాలు వంటివి ఇందులోకి వస్తాయి.

స్పామ్

ప్లాట్‌ఫారమ్‌లో కృత్రిమంగా జనాదరణ పొందడానికి ఉపయోగించే కంటెంట్ లేదా కార్యకలాపానికి అనుమతి లేదు. ఇంటరాక్షన్ గణాంకాలను పెంచడం కోసం ఉపయోగించే కృత్రిమ ప్లాట్‌ఫారమ్ పద్ధతులకు కూడా అనుమతి లేదు. 
వీటిని చేయవద్దు:

 • వీక్షణలు, ఇష్టాలు, అనుచరులు, షేర్‌లు లేదా వ్యాఖ్యలను కృత్రిమంగా పెంచుకోవడానికి సూచనలను పంచుకోవద్దు
 • వీక్షణలు, ఇష్టాలు, అనుచరులు, షేర్‌లు లేదా వ్యాఖ్యలను అమ్మడం లేదా కొనుగోలు చేయడంలో పాల్గొనవద్దు లేదా అందుకు ప్రయత్నించవద్దు
 • కృత్రిమ ట్రాఫిక్ జెనరేషన్ సేవలను ప్రచారం చేయవద్దు
 • అప్రమాణిక కార్యకలాపాలను రూపొందించడం, వాణిజ్యపరమైన స్పామ్‌ను పంపిణీ చేయడం లేదా ఇతర ప్రణాళికాబద్ధమైన పనులతో పాటు అసత్య లేదా మోసపూరితమైన అవసరాల కోసం బహుళ TikTok ఖాతాలను ఉపయోగించడం TikTok విధానాలకు వ్యతిరేకం

ప్రతిరూపణ

ప్రజలను మోసం చేయడం కోసం వేరే వ్యక్తులు లేదా సంస్థలు లాగా వ్యవహరించడానికి మేము అనుమతించము. ప్రతిరూపణ జరిగినట్లు మాకు నివేదికలు వస్తే, ఉల్లంఘనకు పాల్పడిన ఖాతాలను తీసివేస్తాము. ప్యారడీ, వ్యాఖ్యానం లేదా అభిమానుల ఖాతాలకు మేము మినహాయింపు ఇస్తాము, కానీ TikTokలో తమ గుర్తింపును లేదా ప్రయోజనాన్ని వారు తప్పక స్పష్టంగా, తప్పుదారి పట్టించకుండా తెలియజేయాలి.
వీటిని పోస్ట్ చేయవద్దు: 

 • ఒక వ్యక్తి లేదా సంస్థ కనుక మరొకరి పేరు, బయోగ్రాఫికల్ వివరాలు లేదా ప్రొఫైల్ చిత్రాన్ని ఉపయోగిస్తే, అది తప్పుదారి పట్టించవచ్చు

తప్పుదారి పట్టించే సమాచారం

మా సంఘానికి లేదా భారీ సంఖ్యలో ప్రజలకు హాని కలిగించే తప్పుదారి పట్టించే సమాచారాన్ని మేము అనుమతించము. తమకు నచ్చిన విషయాల గురించి గౌరవప్రదంగా చర్చించుకోవడానికి మేము మా వినియోగదారులను ప్రోత్సహిస్తాము, కానీ వ్యక్తుల ఆరోగ్యం లేదా సమాజంలో శాంతికి భంగం కలిగించే తప్పుదారి పట్టించే సమాచారాన్ని తీసివేస్తాము. తప్పుదారి పట్టించే ప్రచారాలు పంపిణీ చేసే కంటెంట్‌ను కూడా మేము తీసివేస్తాము. 
వీటిని పోస్ట్ చేయవద్దు:

 • తప్పుదారి పట్టించడం అంటే భయం, ద్వేషం లేదా పక్షపాతం కలిగి ఉండటం
 • వైద్య చికిత్సల గురించి అసత్య సమాచారం వంటి తప్పుదారి పట్టించే సమాచారం కారణంగా వ్యక్తుల ఆరోగ్యానికి హాని కలగవచ్చు
 • హోక్సెస్, ఫిషింగ్ ప్రయత్నాలు లేదా మానిపులేటెడ్ కంటెంట్ కారణంగా హాని కలగవచ్చు
 • ఎన్నికలు లేదా ఇతర పౌర ప్రక్రియల గురించి సంఘం సభ్యులను తప్పుదారి పట్టించే కంటెంట్ 

మేధోపరమైన ఆస్తి

అందరూ ఒరిజినల్ కంటెంట్‌ను రూపొందించి, పంచుకోవాలని మేము ప్రోత్సహిస్తాము. ఇతరుల మేధోపరమైన ఆస్తి హక్కులను ఉల్లంఘించే విధంగా కంటెంట్‌ను ప్రచురించడానికి లేదా పంపిణీ చేయడానికి మేము అనుమతించము.
వీటిని పోస్ట్ చేయవద్దు:

 • ఇతరుల కాపీరైట్‌లు, వ్యాపారచిహ్నాలు లేదా ఇతర మేధోపరమైన ఆస్తి హక్కులను ఉల్లంఘించే లేదా అతిక్రమించే కంటెంట్


ప్లాట్‌ఫారమ్ భద్రతకు ప్రమాదాలు

ఎగువ పేర్కొన్న కంటెంట్, ప్రవర్తనతో పాటు, మా విధాన ప్రకారం TikTok సేవకు ఇబ్బంది పెట్టే పనులను మేము నిషేధించాము:

 • TikTok వెబ్‌సైట్, యాప్ లేదా అనుబంధిత నెట్‌వర్క్‌లను హ్యాక్ చేయద్దు లేదా వాటిలో వినియోగదారుల యాక్సెస్‌ను నియంత్రించే విధంగా దేనినీ బైపాస్ చేయకూడదు
 • మోసపూరితమైన లేదా హానికరమైన వైరస్‌లు, ట్రోజన్ హర్సెస్, వార్మ్స్, లాజిక్ బాంబ్‌లు లేదా ఇతర మెటీరియల్‌లను కలిగిన ఫైల్‌లను పంపిణీ చేయవద్దు
 • ఫైల్‌లు, పట్టికలు లేదా డాక్యుమెంటేషన్‌తో పాటు TikTok ఆధారంగా ఉత్పత్తులలో సవరణలు, మార్పులు, అనువాదం, రివర్స్ ఇంజినీర్, డిసెంబుల్, డీకంపైల్ చేయవద్దు మరియు సారూప్య ఉత్పత్తులను సృష్టించద్దు, అలాగే TikTokలో ఉన్న భద్రతా కోడ్, అల్గారిథమ్‌లు, పద్ధతులు లేదా సాంకేతికతలను తిరిగి రూపొందించవద్దు
 • TikTokనుండి సమాచారాన్ని సేకరించడానికి ఆటోమేటెడ్ స్క్రిప్ట్ లను ఉపయోగించవద్దు

మా అద్భుతమైన గ్లోబల్ సంఘంలో సభ్యులుగా ఉన్నందుకు, అందరు వినియోగదారులకు భద్రతను అందించడంలో సహాయపడుతున్నందుకు ధన్యవాదాలు. మా సంఘం మార్గదర్శకాలను ఉల్లంఘించే కంటెంట్ లేదా ఖాతాలు మీకు కనిపిస్తే, మాకు తెలియజేయండి, మేము సమీక్షించి, సముచిత చర్యలు తీసుకుంటాము.